అనంతపురం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ జైలు నుంచి మంగళవారం తెల్లవారుజామున ఓ ఖైదీ పరారయ్యాడు. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఎరికలన్న అనే ఖైదీ జైలు నుంచి పరారయ్యాడు. ఆ విషయాన్ని ఈ రోజు ఉదయం గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలియజేశారు.
ఎరికలన్న కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సూపరింటెండెంట్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఎరికలన్న స్వస్థలం పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు.