అనంతపురం : అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలోని రెడ్డిపల్లి ఓపెన్ జైలు నుంచి పరారైన జీవిత ఖైదీ ఎరికలన్న ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. బుధవారం అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని రెడ్డిపల్లి జైలుకు తరలించారు. ఎరికలన్న జైలు నుంచి మంగళవారం తెల్లవారుజామున పరైన సంగతి తెలిసిందే.
ఆ విషయాన్ని గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే జైలు సూపరింటెండెంట్ శ్రీనివాస్కు తెలియజేశారు. ఎరికలన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అందులోభాగంగా అతడిని ఈ రోజు పట్టుకున్నారు. హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఎరికలన్న స్వస్థలం పెద్దవడుగూరు మండలం కొండూరు గ్రామం.