నవ్వుతూనే అక్కడ కొరికాడు ? | Prisoner attacked in another prisoner in uttar pradesh jail | Sakshi
Sakshi News home page

నవ్వుతూనే అక్కడ కొరికాడు ?

Published Sat, Jul 22 2017 6:38 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

నవ్వుతూనే అక్కడ కొరికాడు ?

నవ్వుతూనే అక్కడ కొరికాడు ?

లఖ్‌నవూ: బహుశా ఇంత వరకు మనం ఇలాంటి సంఘటన గురించి వినిఉండం. జైలులో ఖైదీలు జోకులేసుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. హఠాత్తుగా వారిలోనే ఓ ఖైదీ తోటి ఖైదీ అంగాన్ని కొరికేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హర్దోయా జైలులో చోటుచేసుకుంది. జైలులోని ఏడో నంబర్ బ్యారక్ లో ఖైదీలు శుక్రవారం రాత్రి సరదాగా జోకులేసుకుంటూ నవ్వుకుంటున్నారు.  అదే సమయంలో ఓ ఖైదీ తోటి ఖైదీ మర్మాంగాన్ని తీవ్రంగా కొరికాడు. బాధతో కేకలు వేస్తుండగా పక్కనున్న వారు అతడిని విడిపించారు.

వెంటనే అధికారులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావటంతో అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాధితుడు నూర్ మహ్మద్ ఓ రేప్ కేసులో నాలుగు నెలలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడని జైలర్ మృత్యంజయ్ నారాయణ్ తెలిపారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తి మానసికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై విచారణ చేపట్టామని జైలర్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement