బనశంకరి: హత్యకేసులో పదేళ్ల జైలుశిక్షకు గురైన ఖైదీ పెళ్లి చేసుకోవడానికి 15 రోజుల విరామం (పెరోల్) పై విడుదల చేయాలని హైకోర్టు పరప్పన సెంట్రల్ జైలు అధికారులను ఆదేశించింది. వివరాలు.. 2015 ఆగస్టు 16న కోలారు జిల్లా మాస్తి హోబళి నాగదేవనహళ్లిలో ఒక హత్య జరిగింది. ఇందులో ఆనంద (29) అనే నిందితున్ని పోలీసులు అరెస్టు చేయగా కేసు నడిచింది. నేరం రుజువు కావడంతో సెషన్స్‌కోర్టు 2019లో యావజ్జీవిత శిక్ష విధించింది. దీనిని అతడు హైకోర్టులో అప్పీల్ చేయగా, శిక్షను 10 ఏళ్లకు తగ్గించింది.
మరోవైపు ఊర్లోనే ఇతడు ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకోవడానికి అతన్ని తాత్కాలికంగా విడుదల చేయాలని అతని తల్లి, ప్రియురాలు హైకోర్టులో వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న తో కూడిన బెంచ్ సోమవారం విచారించింది. ఇరువర్గాల వాదనలు ఆలకించిన తరువాత, అతనికి కట్టుదిట్టమైన షరతులతో ఏప్రిల్ 5 మధ్యాహ్నం లోగా 15 రోజులు పెరోల్ ఇవ్వాలని ఆదేశించారు. అతని పెళ్లికి అడ్డంకి తొలగింది.
Comments
Please login to add a commentAdd a comment