Samaikya andhra
-
ఆ కానిస్టేబుళ్లకు ప్రమోషన్
సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవో సంఘం నిర్వహించిన ‘సమైక్యాంధ్ర’ సభలో జై తెలంగాణ అంటూ నినదించిన పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలపై సస్పెన్షన్లు ఎత్తివేసి, ప్రమోషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఈ కానిస్టేబుళ్లు ముఖ్యమంత్రిని కలిశారు. సమైక్యాంధ్ర సభలో జై తెలంగాణ అని నినాదాలు చేసినందుకు తమను సస్పెండ్ చేశారని సీఎంకు వివరించారు. దీనికి స్పందించిన కేసీఆర్ ఆ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ఎత్తివేసి విధుల్లోకి తీసుకోవడంతో పాటు ప్రమోషన్ ఇవ్వాలని అక్కడే ఉన్న డీజీపీ అనురాగ్‌శర్మను ఆదేశించారు. సస్పెన్షన్‌లో ఉండగా ప్రమోషన్ ఇవ్వడానికి నిబంధనలు అనుమతించవని డీజీపీ చెప్పారు. దీంతో నెలరోజుల్లో ప్రమోషన్ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించగా వాటిని అమలు చేయాలని మెదక్ ఎస్పీకి అధికారులు సూచించారు. -
కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత
-
కావూరి ఇంటి వద్ద ఉద్రిక్తత
ఢిల్లీ: కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమైక్యవాదులు కావూరి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కుండీలను పగలకొట్టారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. సీమాంధ్ర విద్యార్థి నాయకులు సేవ్ఆంధ్రప్రదేశ్ పోస్టర్లను అతికించి నిరసన తెలిపారు. -
రెండోరోజూ ‘టీ’ రగడ
* లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం * సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు * ఉభయ సభలూ నేటికి వాయిదా * తెలంగాణపై చర్చ కోరుతూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం * అవిశ్వాస తీర్మానం నోటీసులిచ్చిన మోదుగుల, సబ్బం * సభ అదుపులో లేకపోవడంతో పరిశీలించలేకపోతున్నానన్న స్పీకర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశం వరుసగా రెండోరోజు కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. ఇతర అంశాలపై వివిధ పార్టీల నేతలు కూడా ఆందోళనకు దిగడంతో లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పలుమార్లు వారుుదా పడినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్‌సభ, రాజ్యసభలు శుక్రవారానికి వారుుదా పడ్డారుు. - గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభానికి ముందే ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. - పార్టీ సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. ఈ అంశంపై చర్చించాలంటూ సభలో వాయిదా తీర్మానం కూడా పార్టీ ఇచ్చింది. మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన సబ్బం హరి, టీడీపీ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. -ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ మీరాకుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే రాష్ట్ర ఎంపీలు సమైక్యాంధ్ర, తెలంగాణ అనుకూల నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. - సమైక్యాంధ్రప్రదేశ్‌ను కొనసాగించాలని కోరుతూ వైఎస్సార్సీపీ సభ్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డిలు వెల్‌లోకి వెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఇదే సమయంలో సీమాంధ్ర ఎంపీలు సాయిప్రతాప్, ఎం.వేణుగోపాల్‌రెడ్డిలు కూడా వెల్‌లోకి వచ్చారు. - తెలంగాణ ఎంపీలు విభజన బిల్లును వెంటనే సభ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తమిళనాడు జాలర్లపై శ్రీలంక వేధింపులకు నిరసనగా డీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. అకాలీదళ్ సభ్యులు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను లేవనెత్తారు. - ప్రశ్నోత్తరాలు కొనసాగనివ్వండి అంటూ స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రారంభమైన మూడు నిమిషాలకే లోక్‌సభ వారుుదా పడింది. - మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడు కూడా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ‘ఇది చివరి సమావేశం.. సభను శాంతియుతంగా సాగనివ్వండి..’ అంటూ స్పీకర్ కోరారు. సభ్యుల నినాదాల మధ్యే కొద్దిసేపు సభా కార్యక్రమాలను కొనసాగించారు. - 12.16కు అవిశ్వాస తీర్మానం నోటీసులపై మీరాకుమార్ ప్రకటన చేశారు. ‘ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మూడు నోటీసులు వచ్చాయి. ఈ తీర్మానాలకు మద్దతిచ్చేందుకు 50 మంది సభ్యులు వారి వారి స్థానాల్లో లేచి నిలబడాల్సి ఉంటుంది. అప్పుడు నేను వీటిని అనుమతించాలో లేదో నిర్ణయించగలను. కానీ సభ అదుపులో లేదు.. అందువల్ల ఈ తీర్మానాలను పరిశీలించలేక పోతున్నాను’ అని చెప్పారు. కొద్దిసేపటికే లోక్‌సభ శుక్రవారానికి వారుుదా పడింది. - సభ అదుపులో లేనప్పటికీ కేంద్రం పలు నివేదికలను ప్రవేశపెట్టింది. మొత్తంగా రెండోరోజు లోక్‌సభ కేవలం 15 నిమిషాల పాటే కొనసాగింది. జేడీయూ ఎంపీలతో వైఎస్సార్సీపీ చర్చలు లోక్‌సభ వాయిదా అనంతరం జగన్, మేకపాటి, ఎస్పీవై రెడ్డిలతో పాటు మాజీ ఎంపీలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరిలు రాజ్యసభలో జేడీయూ సభానాయకుడు శివానంద్ తివారీ, ఎంపీ ఎంకే సింగ్‌లతో పార్లమెంట్ సెంట్రల్హాల్లో భేటీ అయ్యారు. వారితో విభజన బిల్లుపై చర్చించిన నేతలు బిల్లును అడ్డుకునేందుకు సహకరించాలని కోరారు. శాసనసభ బిల్లును తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేసిన జగన్.. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందని వారికి వివరించారు. రెండు ప్రాంతాలకూ శుభవార్త: జేడీ శీలం ‘నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఎవరికీ అన్యాయం చేయదు. తెలుగువారికి న్యాయం చేస్తుంది. తెలంగాణ వారికి శుభవార్త, సీమాంధ్ర వారికి కూడా శుభవార్త ఉంటుంది..’ అని కేంద్ర మంత్రి జేడీ శీలం వ్యాఖ్యానించారు. కిరణ్ చరిత్రకు త్వరలో ముగింపు: పొన్నం ‘టీ బిల్లును ఆపాలన్న ఆలోచన పొరపాటు. ముఖ్యమంత్రి కిరణ్ చరిత్ర త్వరలో ముగుస్తుంది. తెలుగువాడి పరువు ప్రతిష్టలను ఢిల్లీలో మంటగలిపారు..’ అని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కమల్‌నాథ్ కాంగ్రెస్ ఎంపీలను రెచ్చగొట్టారు లోక్‌సభలో గురువారం తాము అవిశ్వాసం నోటీసుపై స్పీకర్ అనుమతి కోరేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సభలో గందరగోళం సృష్టించడానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎంపీలను రెచ్చగొట్టారని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆరోపించారు. అవిశ్వాసానికి 71 మంది ఎంపీల మద్దతు కూడా ఉందని, అవిశ్వాసానికి అనుమతిస్తే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలేదని వారు పేర్కొన్నారు. ఎంపీలు మోదుగుల వేణుగోపాలరెడ్డి, కె.నారాయణరావు పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడారు. రాజ్యసభలోనూ గందరగోళం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తెలంగాణ అనుకూల, వ్యతిరేక నినాదాలతో మూడు నిమిషాలకే వాయిదాపడింది. సమైక్యాంధ్ర నినాదాల మధ్య తిరిగి 12 గంటలకు ప్రారంభం కాగా.. మళ్లీ గందరగోళం నెలకొంది. ఆరు నిమిషాల తరువాత సభాపతి మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని చెబుతూ వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ప్రారంభమైన ఒక నిమిషానికే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ ప్రకటించారు. రాజ్యసభలోనూ తమిళ జాలర్ల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఏఐడీఎంకే, డీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. వివిధ అంశాలపై ఎస్పీ, వామపక్షాలు, అకాలీదళ్ సభ్యులు నిరసన వ్యక్తం చేసినా గందరగోళంలో ఏమీ విన్పించలేదు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతో పాటు పలు కుంభకోణాలను బీజేపీ సభ్యులు లేవనెత్తారు. సభలో గందరగోళంపై అసహనంగా కన్పించిన కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సీట్లో నుంచి లేచి పక్కకు వెళ్లారు. ఆందోళన చేస్తున్న సభ్యులకు ఏవో సైగలు చేస్తూ, ఎద్దేవా చేస్తున్నట్టుగా కన్పించారు. -
మండలిలో నినాదాల హోరు
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సోమవారం కొనసాగిన కొద్దిసేపూ సభ్యుల సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో మార్మోగిపోరుుంది. ఉదయం 10కి సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఐదు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులు సమైక్య తీర్మానం చేయూలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చైర్మన్ చక్రపాణి సభను మళ్లీ వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం 1.45కి మళ్లీ ప్రారంభమైనా నినాదాలు కొనసాగడంతో మండలి మంగళవారానికి వాయిదా పడింది. నోటీసులు తిరస్కరించండి: వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరించినట్టే సీఎం, మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసులను కూడా తిరస్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ కోరారు. ఆయన సోమవారం మండలి మీడియూ పారుుంట్‌లో సోమవారం మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రూల్ 77 కింద నోటీసు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, విద్రోహచర్య అని అన్నారు. మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి కాదు: రామచంద్రయ్య పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, మండలి తిరస్కరించాలని ప్రభుత్వం తరఫున నోటీసులివ్వడానికి మంత్రివర్గం ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని మండలిలో సభా నాయకుడు, మంత్రి రామచంద్రయ్య అన్నారు. మంత్రివర్గం నాయకుడిగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. నోటీసులివ్వడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్నారు. -
ఏలూరులో ఏపీఎన్జీవోల నేతల ధర్నా, అరెస్ట్
ఏలూరు: రాష్ట్ర విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిర్వహించిన సమైక్యాంధ్ర బంద్ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో ఏపీఎన్జీవోల నేతలు శుక్రవారం ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏపీఎన్జీవోల నేతలను అరెస్ట్ చేసి ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఏపీఎన్జీవోలు ధర్నాకు దిగారు. వారి ఆందోళనకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దతు తెలిపగా, ధర్నాకు వద్దకు వైఎస్ ఆర్ సీపీ నేత ఆళ్లనాని చేరుకున్నట్టు తెలుస్తోంది. కాగా, విభజన బిల్లుపై చర్చను వ్యతిరేకిస్తూ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు సీమాంధ్రలో బంద్ జరుగుతోంది. సీమాంధ్ర జిల్లాలో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతోంది. పార్టీ శ్రేణులతోపాటు సమైక్యవాదులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సమైక్య వాదులు బంద్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పలు వ్యాపార సంస్థలు... స్వచ్చందంగా బంద్‌లో పాల్గొన్నాయి. -
'సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోలు నాకు రెండు కళ్లు'
కాకినాడ: ''సమైక్యాంధ్ర, ఏపీఎన్జీవోల సమస్యలు నాకు రెండు కళ్లు లాంటివి'' అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు. ఈ రెండింటితోనే ఏపీఎన్జీవోల ఎన్నికలకు పోతామని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిల్లును అడ్డుకునేందుకు ఒత్తిడి తెచ్చేలా జనవరి 2న విశాఖలో సమైక్యాంధ్ర మహాసభ ఏర్పాటు చేయనున్నట్టు అశోక్‌బాబు ప్రకటించారు. అంతేకాకుండా జనవరి 3న సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే సీమాంధ్రులకు సమైక్యాంధ్ర విలువలు తెలియజేస్తామని అశోక్‌బాబు చెప్పారు. -
రేపు ఉదయం రాష్ట్రపతిని కలవనున్న జగన్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి రేపు ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు రాష్ట్రపతిని కలిసేందుకు జగన్‌కు అపాయింట్మెంట్ ఇచ్చారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రేపు ఉదయం జగన్‌తోపాటు పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలుస్తారు. జగన్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు రాష్ట్రపతి వద్దకు వెళతారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచమని వారు రాష్ట్రపతిని కోరతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఈ బృందం రాష్ట్రపతికి అఫిడవిట్లు ఇస్తుంది. -
సమైక్యతే లక్ష్యంగా.. 123 రోజుల జనోద్యమం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 123వ రోజూ శనివారం సీమాంధ్ర జిల్లాల్లో సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు.. ఇలా విభిన్న రూపాల్లో సమైక్యవాదులు రాష్ర్టం కలిసే ఉండాలన్న ఆకాంక్షను చాటారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు, జేఏసీ నాయకులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యార్థులు 123 సంఖ్య ఆకారంలో కూర్చుని సమైక్య నినాదాలు చేశారు. కృష్ణాజిల్లా కలిదిండిలో జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. టీ-బిల్లు పెడితే మెరుపు సమ్మె: విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెడితే మెరుపు సమ్మెకు దిగుతామని సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖపట్నంలో ఒక ప్రకటనలో విడుదల చేశారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌథ వద్ద సమైక్యాంధ్ర ధర్నాలో తెలంగాణ ఇంజనీరు సీమాంధ్రకు చెందిన ఓ మహిళా ఉద్యోగినిపై పరుష పదజాలంతో దూషణలకు దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొనసాగుతున్న వైఎస్సార్సీపీ శ్రేణుల దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీమాంధ్ర జిల్లాల్లో చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా కైకలూరులో ఈ దీక్షలు 116వ రోజుకు చేరాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు, చిత్తూరు జిల్లా పలమనేరు, తిరుపతిలో చేపట్టిన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. ఇక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు గ్రామాల్లోకి వెళ్లి గడపగడకూ వైఎస్సార్ సీపీ సమైక్యనాదం పేరిట పాదయాత్రలు చేపట్టారు. సమైక్యాంధ్ర ఆవశ్యకత, రాష్ట్ర సమైక్యతకు పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న అవిరళకృషిని ప్రజలకు వివరిస్తున్నారు. -
పార్టీల అధ్యక్షులతో ఉమ్మడి భేటీకి యత్నం
సమైక్యాంధ్ర కోసం బొత్స, చంద్రబాబుతో భేటీ: అశోక్‌బాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ముందుకొస్తే.. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆయా పార్టీల అధ్యక్షులందరితో ఉమ్మడి సమావేశం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు పేర్కొన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీలో చర్చకొచ్చినప్పుడు.. సభలో సమైక్యాంధ్రకు ఆయా పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఏపీఎన్జీవో సంఘ ప్రతినిధులు శనివారం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. తొలుత సంఘ ప్రతినిధులతో కలిసి అశోక్‌బాబు గాంధీభవన్‌లో బొత్స, మంత్రి శైలజానాథ్‌తో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు అసెంబ్లీలో చర్చకొచ్చినప్పుడు కాంగ్రెస్ సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా టీ-బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడతారని బొత్స హామీఇచ్చారని తెలిపారు. పార్టీల అధ్యక్షులతో సమావేశానికి అందరూ హాజరైతే, తాను కూడా వస్తానని బొత్స హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఇందుకు అధ్యక్షులందరూ అంగీకారం తెలిపితే.. రెండు, మూడ్రోజులల్లోనే భేటీకి యత్నిస్తామని అశోక్‌బాబు అన్నారు. బాబు పార్టీలో చర్చిస్తామన్నారు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలూ టీ-బిల్లును వ్యతిరేకించేలా చూడాలని తాము చంద్రబాబును కోరగా.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన బదులిచ్చినట్టు అశోక్‌బాబు తెలిపారు. అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరఫున ప్రతినిధులను పంపుతానని బాబు హామీ ఇచ్చారని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగే సమయంలో మరోసారి ఢిల్లీ వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తామన్నారు. కాగా, అశోక్‌బాబు గాంధీభవన్‌లో మాట్లాడుతున్న సమయంలో పలువురు తెలంగాణవాదులు జై తెలంగాణ నినాదాలు వినిపించారు. ప్రతిగా ఏపీఎన్జీవో ప్రతినిధులు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. -
రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్ జగన్ సమావేశం
-
రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్ జగన్ సమావేశం
హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి తమ పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఒకే ఒక అంశంపై ఆయనతో చర్చలు జరుపుతారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ఆయనకు వివరిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కరించలేనివి ఉన్నందున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించమని ఆయనను కోరతారు. రాష్ట్రానికి సంబంధించి ఒక నివేదిక కూడా వారు ఆయనకు ఇవ్వనున్నారు. రాష్ట్ర సమైక్యతకు బిజెపి ఎందుకు మద్దతు ఇవ్వాలో తెలియజేసే అంశాలు ఆ నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. -
విభజన నరకాసురుల వధ
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని వినూత్న రీతిలో కొనసాగిస్తోంది. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొందరు కుట్రపన్నుతున్నారని, వారిని రాజకీయంగా వధించాలని కోరుతూ తిరుపతి సమీపంలో తుమ్మలగుంట కూడలిలో వారి చిత్రపటాలతో దిష్టిబొమ్మను తయారుచేశారు. వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో టపాకాయలతో తయారుచేసిన ఈ సెట్టింగ్‌ను పేల్చివేసి ’విభజన నరకాసురుల వధ’ నిర్వహించారు. రాష్ర్టం సమైక్యంగా ఉండాలని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక కూడలిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం నిర్వహించారు. పార్టీ నేత కొణతాల రామకృష్ణ హోమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త గేదెల తిరుపతి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు బైక్‌ర్యాలీ తీశారు.అదే విధంగా సీమాంధ్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు గురువారం కూడా కొనసాగాయి. ఎంపీ బాపిరాజుకు సమైక్య సెగ: టీటీడీ చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజుకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సమైక్య సెగ తగిలింది. వైసీపీ నేత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో అడ్డుకున్నారు.ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. ఆయన కాళ్లుపట్టుకొని సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. బాపిరాజు మాట్లాడుతూ త్వరలో జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో అన్ని రాజకీయపార్టీలు సమైక్యాంధ్రకు మద్దతు తెలిపితే విభజన ఆగిపోతుందని చెప్పారు. కొనసాగుతున్న సమైక్యపోరు రాష్ర్ట విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉద్యమం గురువారం 93వ రోజుకు చేరింది. చిత్తూరు జిల్లా పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్లో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తుండగా బయట సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో విభజనను నిరసిస్తూ నినాదాలు చేశారు. ముమ్మిడివరంలో ఉద్యమం ప్రారంభమై 80 రోజులు పూర్తయిన సందర్భంగా 216 జాతీయ రహదారిపై 80 ఆకారంలో బైఠాయించి నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పామిడిలో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మౌన దీక్ష చేశారు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏపీ ఎన్జీఓ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద ఎన్జీవోలు భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలో సమైక్యాంధ్రకు మద్ధతుగా ఆర్టీసీ ఎన్ఎంయూ సభ్యులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. -
కిరణ్ది తుగ్లక్ పాలన: చంద్రబాబునాయుడు
తణుకు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భారీ వర్షాల బీభత్సంతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వ తీరు పిచ్చి తుగ్లక్ పాలన మాదిరిగా ఉందని టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బుధవారం తణుకులోని ఆంధ్రా సుగర్స్ సమావేశ మందిరంలో జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమర్థ ప్రభుత్వం కావడంతోప్రజలకు సహాయం అందడం లేదన్నారు. ప్రజల కోసం సీఎం మెడలు వంచైనా సహాయం అందేలా చేస్తామన్నారు. వరి పచ్చగా కనిపిస్తున్నప్పటికీ దిగుబడి మాత్రం రాదని, రైతులకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని విభజించి మొద్దబ్బాయి రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కార్యకర్తలు ఆరు నెలలపాటు వ్యాపారాలను పక్కనపెట్టి, పార్టీ కార్యక్రమాల్లో మునిగి తేలాలని హితవు పలికారు. అడుగడుగునా సమైక్య సెగ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వరిచేలను పరిశీలించేందుకు వచ్చిన చంద్రబాబుకు తణుకు, అత్తిలి మండలాల్లో అడుగడుగునా సమైక్యవాదుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. తొలుత నరేంద్ర సెంటర్లో ఎన్జీవో జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల వద్ద పెద్దఎత్తున విద్యార్థులు ‘జై సమైక్యాంధ్ర’ అనాలని బాబును పట్టుబట్టారు. అందుకు ససేమిరా అన్న ఆయన.. వాస్తవాలను తెలుసుకోవాలంటూ.. ప్రసంగించడంతో విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కాంగ్రెస్ పరిస్థితి బాగుండకపోవడంతో సోనియా తెలంగాణలో టీఆర్ఎస్, సీమాంధ్రలో వైఎస్సార్ సీపీతో పొత్తులు పెట్టుకుని పైకి రాష్ట్ర విభజన అంటూ నాటకాలు ఆడుతున్నారంటూ విమర్శలకు దిగారు. హైదరాబాద్, సైబరాబాద్‌లను సింగపూర్‌కు దీటుగా అభివృద్ధి చేశానని చెప్పడంతో మళ్లీ నిరసన ఎదురైంది. అనంతరం దువ్వ-వరిఘేడు ప్రాంతంలోని దానమ్మగుడి ప్రాంతంలో సమైక్యవాదులతో జత కలిసిన టీడీపీ కార్యకర్తలు సైతం ‘సమైక్యాంధ్ర కావాలి. సమన్యాయం కాదు. జై సమైక్యాంధ్ర అనండి’ అంటూ పట్టుబట్టారు. చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సమైక్యవాదులు రోడ్డుపై చంద్రబాబు కాన్వాయ్‌కు అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. వరిఘేడు, తిరుపతిపురం, రామచంద్రపురం సెంటర్లలో నిలదీసిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. -
విభజనాగ్ని.. జనోద్యమం@ 92
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 92వ రోజైన బుధవారం కూడా సీమాంధ్ర జిల్లాల్లో ఉద్ధృతంగా సాగింది. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ప్రదర్శనలు, విభజన యత్నాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు ఊరూరా పోటెత్తాయి. అనంతపురంలోని టవర్ క్లాక్ సర్కిల్లో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఒంటికాలిపై నిలబడి నిరసన తెలిపారు. గుంతకల్లులో విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఆకారంలో కూర్చొని ఆందోళన చేపట్టారు. హిందూపురంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సమైక్యవాదులు దహనం చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో ఎన్జీవోల జేఏసీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. పుంగనూరులో ఎన్జీవోలు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విభజన ప్రక్రియను ఆపకపోతే సీమాంధ్రులు భవిష్యత్‌లో బానిసలుగా బతకాల్సి వస్తుందంటూ వీఆర్వోలు చేతులకు, మెడలకు సంకెళ్లు తగిలించుకుని రాయలసీమ, కోస్తాంధ్ర ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డిని పుంగనూరులో సమైక్యవాదులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అనాలని పట్టుపట్టారు. ఇందుకు బెరైడ్డి ససేమిరా అనడంతో గందరగోళం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో రెవెన్యూ ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. విజయవాడలో బెజవాడ బార్ అసోసియేషన్ (బీబీఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు రాస్తారోకో చేశారు. కలిదిండిలో విద్యార్ధులు మానవహారం నిర్వహించి, సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. నాగాయలంకలో రహదారిపై గుంజీలు తీసి నిరసన వ్యక్తం చేశారు. నెల్లూరులోని చింతారెడ్డిపాళెం జంక్షన్ వద్ద ఏపీఎన్జీఓలు రాస్తారోకో నిర్వహించారు. కేసీఆర్, సోనియా, దిగ్విజయ్ చిత్రపటాలను దహనం చేశారు. కావలిలో తహశీల్దార్కార్యాలయం సెంటర్లో ఎన్జీవోలు రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. గంటపాటు వాహనాల రాకపోకలు అడ్డుకుని సమైక్య నినాదాలు చేశారు. కాకినాడలో న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించారు. హోరెత్తించిన వైఎస్సార్సీపీ శ్రేణులు రాష్ట్ర విభజన నిర్ణయంపై ఎగసిపడుతున్న నిరసనోద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బుధవారం కూడా ఆందోళనలు హోరెత్తించారు. చిత్తూరులో ‘సమైక్య శంఖారావం’కు వేలాదిగా విద్యార్థులు కదలివచ్చారు. పలమనే రులో వైఎస్ఆర్ సీపీ నాయకులు రిక్షా తొక్కి, మొక్కజొన్న పొత్తులు అమ్మి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూరులో సమైక్య దీవెన యాత్ర చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పార్టీ నేతల ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో పార్టీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. కృష్ణాజిల్లా చాట్రాయిలో పోలవరం-విస్సన్నపేట రహదారిపై పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఇక ఈనెల 2వ తేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
బలహీన ప్రభుత్వం ఎలా విభజిస్తుంది?: మైసూరా
హైదరాబాద్: తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న యుపిఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా విభజిస్తుంది? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మైసూరా రెడ్డి ప్రశ్నించారు. విభజనను కాంగ్రెస్ తన సొంత వ్యవహారంగా నిర్వహిస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విభజనపై అసెంబ్లీలో తీర్మానం ఎందుకు ప్రవేశపెట్టరు? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఏర్పాటు చేసి జీఓఎం టైమ్‌పాస్ సమావేశాలు నిర్వహిస్తోందని విమర్శించారు. జీఓఎం భేటీలు అన్నీ టీ, బిస్కెట్లతో ముగుస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒంటెత్తు పోకడకు, ఏకపక్ష విభజనకు నిరసనగా వైఎస్ఆర్ సిపి పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ 1ని సమైక్య దినోత్సవంగా ప్రకటించారు. ఆ రోజు సమైక్యవాదాన్ని బలంగా వినిపించాలన్నారు. గ్రామసభల ద్వారా సమైక్యతీర్మానాలు చేయాలన్నారు. ఈమొయిల్ రూపంలో ప్రధానికి తీర్మానాలు పంపాలని చెప్పారు. పట్టణాల్లో మానవహారాలు ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1 రాత్రి విభజనకు కారకులైన వారి దిష్టిబొమ్మలతో నరకచతుర్దశి జరుపుతామని చెప్పారు. నవంబర్ 7 మంత్రుల బృందం సమావేశం సందర్భంగా 6, 7 తేదీల్లో రహదారుల దిగ్బంధం చేస్తామన్నారు. సమైక్యం కోరుకునే వారంతా ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని మైసూరా రెడ్డి పిలుపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీని సమావేశపర్చాలన్నారు. అసెంబ్లీలో సమైక్యతకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విభజన విషయంలో నైతిక విలువలు కూడా పాటించడం లేదని బాధపడ్డారు. అసెంబ్లీ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. -
తెలుగువారి ‘హోం’కు ‘వర్క్’
విశ్లేషణ: ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి చూస్తే సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా! సునామీలు, కుంభవృష్టి, పెనుతుపానులు, టార్నా డోలు, టార్పీడోలు వాటికి తెలియకుండానే దిశలూ దిక్కులూ మార్చుకుంటాయి. ఆంధ్రపదేశ్ విభజన ప్రక్రియ కూడా అగమ్యగోచరంగా మారి భిన్నమైన దిక్కులలో ప్రయాణిస్తూ అన్నిటినీ ప్రశ్నార్థకం చేస్తోం ది! ‘విభజన’ ప్రతిపాదనకు ఎలాంటి ప్రత్యామ్నా యాలతో పరిష్కారం వెతకాలా అన్న మీమాంసలో యూపీయే కొట్టుమిట్టాడుతోంది! ఏ పరిష్కారమూ దొరకక చేస్తున్న పని - తల్లినీ తండ్రినీ చంపిన ఓ ప్రబుద్ధుడు ‘అయ్యా నేను తల్లీ తండ్రీ లేనివాణ్ణి, భిక్షపెట్ట’మని అడుక్కున్న ట్టుగా ప్రభుత్వ శాఖలలోని గడప గడపా తిరుగుతోంది! స్వార్ధ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి సాహసించిన కాంగ్రెస్ పాలకులు నేడు దిక్కు తోచని ‘కంగారు’ల్లాగా పరుగులు పెడుతున్నారు! సుశీల్ కుమార్ షిండేకు ఆయన హోంశాఖ అధికారులే విచిత్రమైన ‘గమనిక’ను (‘నోట్’ను) సమర్పిం చబోవటం ఈ కంగారులో భాగమే. ‘నోట్’లో పంచదార! ‘హోం’వర్క్ ఫలితంగా మంత్రికి సమర్పించిన ఆ ‘నోట్’లో మూడు ప్రతి పాదనలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో విచిత్రమైన ప్రతిపాదన కూడా ఉంది. మొదటి పరిష్కారం ‘తెలంగాణలోని పది జిల్లాలకు తోడుగా స్వచ్ఛం దంగా వచ్చి చేరగోరే ఇతర జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకుని అన్నిం టినీ కలిపి తెలంగాణగానే ఏర్పాటు చేయండి!’ అంటే మొదటి ఎస్ఆర్సీ (ఫజల్ అలీ), శ్రీకృష్ణ కమిటీల మొదటి ప్రతిపాదన సమైక్యాంధ్రనే హోంశాఖ అభిలషిస్తోందా?! ఈ ‘నోట్’ను ఎవరు తయారు చేశారోగాని సదరు పత్రకా రుడు మహా‘సరసుడే’ కాదు, హోంశాఖలో బహుశా ప్రజలను విభజించి పాలిం చడం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! బహుశా రాష్ట్ర మెజారిటీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఈ ‘నోట్’ డ్రాఫ్టింగ్ జరిగినట్టుంది. ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పు డున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా! పేరు మార్చుకుందాం! ఈ సందర్భంగా రాజ్యాంగ పరిశీలకులందరి దృష్టికీ రావలసిన అంశం ఉంది. ఏ కేంద్ర పాలక పక్షం, ఏ‘3’వ అధికరణ ఆధారంగా ఏ తెలుగు జాతిని చీల్చా లని ఉవ్విళ్లూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని ‘ఇ’ క్లాజు అవసరాన్ని బట్టి ‘రాష్ట్రం పేరును మార్చకునే’ హక్కును కూడా ప్రసాదించిందని మరచిపోరాదు! అంటే, తెలంగాణ పది జిల్లాలతో పాటు ఎన్ని జిల్లాలు వచ్చి చేరితే అన్ని జిల్లా లూ కలిసిన ‘తెలంగాణ రాష్ర్టం’గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించి నట్టయింది! ఆ లెక్కన మిగిలిన 13 జిల్లాలూ, ఆ పది జిల్లాలతోనూ కలిసి వెరసి - అక్షరాలా ‘తెలంగాణ’యే అవుతుందిగదా! నిజానికి యావత్తు రాష్ట్రమూ ‘తెలంగాణ’యే. ‘తెలంగాణ’ అంటే, తెలుగులకు (తెలుగు వారికి) ఆణెము / ఆణియము, అంటే తెలుగు వారు నివసించే చోటు అనీ, ప్రాంతం అనీ, స్థిర నివాసమనీ అనే అర్థం. సుమారు 300 ఏళ్లు సీమాంధ్ర ప్రాంతాలతోపాటు దక్కన్ వరకూ ఏలిన మహమ్మదీయ (ముసల్మాన్) పాలకులు (చరిత్ర జ్ఞాన శూన్యులైన నేటి నేతలకంటె) నాడేతెలివిగా వ్యవహరించారు కాబట్టే ఈ తెలుగు ప్రాంతాన్ని ‘తెలంగాణ’ అని పిలిచారు. (చూ: ఇండియా; ఎ హిస్టరీ ‘గ్రంథంలో జాన్కేయి 2000, హార్వర్ కాలిన్స్ పబ్లిషర్స్ ప్రచురించిన దేశ పటం: పేజీ:280)! బహుశా హోంశాఖ ‘నోట్’ కూడా తెలంగాణలో అన్ని జిల్లాలూ (ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్ దట్ కమ్ ఫార్వర్డ్ టు జాయిన్ ఇన్ తెలంగాణ విల్ బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ టు ఫామ్ తెలంగాణ) వచ్చి చేరమని ఆహ్వానం పలికి ఉంటుంది! అర్థవంతంగా ఉంటుంది! రాజ్యాంగంలోని 3వ అధికరణం ‘ఇ’ సెక్షన్ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్’ను కృత్రి మంగా విభజించకుండానే అర్థవంతంగానూ, సహజంగానూ, చారిత్రికంగానూ జాతి-భాషాపరంగానూ సుఖంగా అమరగల ‘తెలంగాణ’ అని పేరు మార్చు కోవచ్చుగదా! దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఏర్పడి నప్పుడు - అకారాది క్రమం కోసమని అటు ఇంగ్లీష్ వర్ణమాలకు, ఇటు తెలుగు వర్ణమాలకు సమస్థాయిలో ఉన్న తొలి అక్షరాలతో ‘ఎ’ / ‘ఆ’ ఆంధ్రప్రదేశ్ ఏర్ప డటం శుభదాయకం అనుకున్నారు నాటి పెద్దలు. ఆ ఆశతోనే (ఆంధ్రప్రదేశ్) తప్పు సమాసం అయినా ఎంచుకున్నారు. ‘ప్రజాప్రతినిధుల’ వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలక పక్షాలు, ముఖ్యం గా కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్లుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి కూడా వెనుదీయలేదు. వాటిల్లో కొన్ని రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్రూట్ మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి రేపటి పాలక పక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలే! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేద్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవి కావు! స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధ విరుద్ధమైన సవరణ చట్టాలూ తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ, 4వ అధికరణలు. దేహభక్తే తప్ప దేశభక్తి ఏది! కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు, ఈడేర్చుకోవడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు ‘డి’ క్లాజు ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చట్టం తీసుకొచ్చి, దానికి భాష్యం చెప్పా లన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్టుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే ఇతర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలు గాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371(డి) సవరణ చట్టానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దాని ద్వారా కేంద్ర కేబినెట్కూ, సాధ్యమవుతుందిగాని అడ్డదారుల్లో కాదు! పైగా హోంశాఖ చూపిస్తున్న ‘నోట్’లో నేడు వ్యతిరేకులుగా మారి ప్రజల కోసం పదవుల్ని త్యాగం చేయలేని ‘దేహభక్తి’కి తప్ప దేశభక్తికి దూరమైన నాయకులకు తెలియని రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి ఇచ్చిన ‘ఒకటవ వివరణ’లోనే ఉంది. ఇది రెండు రకాల భాష్యాలకి అవకాశమిస్తోంది. ఎలా అంటే, 3వ అధికరణలో ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకూ ఉన్న క్లాజుల్లో ‘రాష్ట్రం’ అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యూటీ) ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది! మిగిలిన సూత్రాలు అందుకే, ఇదే అదననుకొని రాజధాని యూటీగా మార్చి క్రమంగా అన్ని హం గుల్నీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలన్నది హోంశాఖ రెండవ సూత్రం! అయితే, జనాన్ని పాలక పక్షాలు గందరగోళపరచడం కోసం చేసిన ప్రయత్నం - మినహాయింపు ‘క్లాజు’ పేరిట ’రాష్ట్రం’ అనే పదంలో ‘కేంద్రపాలిత ప్రాంతం ‘చేరి ఉండగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్ర ప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ‘కేంద్రపాలిత ప్రాంతం’గానో (యూటీ) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ర్ట ‘విభజన’ గురించి ఆలోచించాలి గాని అంతకుముందు కాదని ప్రతిపాదించడానికి కారణం 3వ అధికరణంలోని ఈ అయోమయపు ‘వివరణ-1’ కాబట్టి - ఇంతకూ రాజ్యాం గం సాధికార షెడ్యూల్‌కు బద్ధమై మైదాన ప్రాంతాల మోతుబరుల దోపిడీకి గురవుతున్న ఆదివాసీ గిరిజన తెగలు తమ లిపి, ప్రత్యేక సంస్కృతి పరిరక్షణకు విశాఖ, తూర్పుగోదావరి, ఉత్తర తెలంగాణలోని గిరిజన ప్రాంతాలన్నింటినీ విడగొట్టి భద్రాచలం రాజధానిగా మన్య రాష్ట్రం ఏర్పరచాలన్న డిమాండ్‌ను మరి ఎందుకు నిరాకరిస్తున్నట్లు? అర్థం తెలియకే... కాబట్టి మొత్తం తెలుగు జాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోవడానికి గాను, ‘ఆంధ్ర’ అనే పదం (తెలుగు అనేది తెలి యక) పట్ల అజ్ఞానంతో కొందరు ‘ఎలర్జీ’ పెంచుకున్నారు. తద్వారా తెలుగు జాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగానే 3వ అధికరణలోని ‘ఇ’ క్లాజు ప్రకారం ‘తెలంగాణ’ అని గానీ, ‘తెలుగు నాడు’ అని గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగు వాడికీ అభ్యంతరం ఉండదు. మనసారా ఆహ్వానించి తీరుతాడు! -
'సమైక్య శంఖారావం' సభలో ఎవరేమన్నారు...
బాబును జాతి క్షమించదు: మేకపాటి ‘‘రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు దాన్ని వెనక్కు తీసుకోకుంటే తెలుగు జాతి ఆయనను క్షమించదు. ఈ అపవాదు ఆయన జన్మకే గాక ఆయన బిడ్డలకూ ఉంటుంది. రాష్ట్రానికి 50 శాతం ఆదాయం వచ్చే హైదరాబాద్ నగరం లేకుండా ఈ రాష్ట్రం ఎలా నడుస్తుందని బాబు అనుకుంటున్నారు? తెలంగాణలో పుట్టిన వారిగా కొందరు రాష్ట్రాన్ని విభజించాలని కోరుకోవడంలో ఒక అర్థముంది. కానీ బాబూ! చిత్తూరు జిల్లాలో పుట్టిన వాడివి, నువ్వెలా (అందుకు) సిద్ధపడ్డావ్? ఏం జన్మ నీది? మనిషి రూపంలో ఉన్న వికృత రూపుడివి నువ్వు. రాజశేఖరరెడ్డి చనిపోయాక రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సోనియా ప్రయత్నించడం దారుణం. కేసీఆర్, జానారెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి వారు ముఖ్యమంత్రి కావాలనుకుంటే తెలుగు ప్రజలందరి ఆమోదంతో ఆ పదవి తీసుకోవాలి. ఆరు నెలల కాలంలోనే జగన్మోహన్రెడ్డి వంటి సరైన నాయకత్వం రాష్ట్రాన్ని పాలించనుంది. అందుకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ ప్రజలను మోసగిస్తున్న కిరణ్: కొణతాల ‘‘అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిస్తామని ఇప్పటికీ ముఖ్యమంత్రి తప్పుడు మాటలు చెబుతున్నారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఓటింగ్ జరగదని స్పీకర్‌గా చేసిన ఆయనకు తెలియదా? తెలిసీ ప్రజలను మోసగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సీఎం పదవినైనా వదలిపెడతానంటున్న కిరణ్, రాష్ట్ర విభజన పూర్తయ్యాక ఆ పని చేస్తారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జెండాలతో గానీ, వాటి పక్కన పెట్టయినా ఎలా వీలైతే అలా కలిసి రావాలని కాంగ్రెస్, టీడీపీ నేతలకు జగన్ సూచించారు. ఇప్పటికైనా వారు తమ జెండాలతో గానీ, వాటిని పక్కన పెట్టయినా కలిసి రావాలి.’’ మంత్రి పదవిని వదులుకున్నా: విశ్వరూప్ ‘‘విభజన వల్ల తలెత్తే సమస్యలేమిటో తెలుసు కాబట్టే రాష్ట్ర సమైక్యత కోసం నినదించి మంత్రి పదవికి రాజీనామా చేశా. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు సమ్మె చేసినా కేంద్రం స్పందించలేదు. వారు సమ్మె విరమించాక ఉద్యమంలో విరామం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్సార్సీపీ చాలా స్పష్టంగా సమైక్యాంధ్ర నినాదంతో ముందుకొచ్చింది. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడగలిగేది వైఎస్సార్ కాంగెస్ పార్టీ ఒక్కటే. అందుకే నేనందులో చేరాను. ’’ ఢిల్లీ పీఠానికి జగన్ తుపాన్: జూపూడి ‘‘స్వార్థపూరితంగా రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించిన ఢిల్లీ పీఠాన్ని ఇప్పుడు జగన్ అనే తుపాను తాకింది. ఆ తుపానులో కొట్టుకుపోయేందుకు వారు సిద్ధంగా ఉండాలి. ఎవర్నడిగి, ఎవరి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు? వైఎస్ మరణానంతరం ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్, టీడీపీ కలిసి తీసుకున్న నిర్ణయమిది. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు రాష్ట్రాన్ని విభజిస్తారా?’’ మొరిగే కుక్కలకు జవాబివ్వగలం: కొడాలి ‘‘రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆజ్యం పోసిన దుర్మార్గుడు చంద్రబాబే. రాజశేఖరరెడ్డి మరణించాక తన దగ్గర ఉన్న పెంపుడు కుక్కలతో రోజూ వైఎస్సార్, జగన్‌పై మొరిగిపిస్తున్నారు. బాబుకు తగిన జవాబు చెబుతామంటుంటే, ‘ఆయన పెద్దాయన , ఎందుకులె’మ్మంటూ మా అధినేత సర్దిచెబుతున్నారు. అధినేత మాకు అవకాశమిస్తే, బాబు మొరిగిపిస్తున్న వారందరికీ జవాబు చెప్పగలిగే సత్తా ఉంది.’’ సమైక్యం చివరిదాకా పోరు: శోభానాగిరెడ్డి ‘‘పాలకులు అసమర్థులైతే ప్రజలు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఈ నాలుగేళ్ల పాలనే ప్రత్యక్ష సాక్ష్యం. వైఎస్సార్ ఉండుంటే ఈ కష్టాలు వచ్చేవి కాదని అందరూ భావిస్తున్నారు. మళ్లీ అలాంటి నాయకత్వం జగన్‌తోనే సాధ్యం. బాబుకు జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక సోనియాతో చేతులు కలిపి విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చారు. ఉద్యోగులు తమ జీవితాలను పణంగా పెట్టి చేసిన ఉద్యమాలు కిరణ్, బాబులను కదిలించలేకపోయాయి’’ హైదరాబాద్ అందరిదీ: రెహ్మాన్ ‘‘హైదరాబాద్ ఎవరబ్బ సొత్తూ కాదు, ఇది తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రజలందరిదీ. ఇక్కడ నివసించేవారు ఏ భయాందోళనలూ పడాల్సిన అవసరం లేదు. చంద్రబాబుకు దిశా దశ లేవు. రాష్ర్టంలో దీక్ష చేస్తే రాళ్లతో కొడతారని భయపడి ఢిల్లీలో చేశారు. మా పార్టీ అధినేత జగన్ ఇందిరా పార్కు వద్ద దీక్ష చేస్తామంటే అనుమతివ్వలేదు గానీ బాబుకు ఢిల్లీ ఏపీభవన్‌లో అనుమతిచ్చారు.’’ సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి: నల్లా ‘‘రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది. వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు కూడా బాగా లబ్ధి పొందారు. మళ్లీ అలాంటి పథకాల అమలు జగన్ వల్లే సాధ్యమని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు’’ వాదనల మధ్య ఘర్షణ: గట్టు ‘‘రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది రెండు ప్రాంతాల మధ్య ఘర్షణ కాదు, రెండు వాదన మధ్య ఘర్షణ. తీర్పేమిటో ప్రజలే చెబుతారు. స్వాతంత్రోద్యమ సమయంలోనూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు హామీ ఇస్తేనే ఉద్యమంలో పాల్గొంటామని అప్పట్లో ఇక్కడి నేతలు గాంధీకే తేల్చిచెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రానికే జగన్ ముఖ్యమంత్రి కావాలని మే కోరుకుంటున్నాం’’ తీర్మానంతో బాబు ముందుకు రావాలి: దాడి ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానం చేయడానికి చంద్రబాబు ముందుకు రావాలి. పీసీసీ కూడా అలాంటి తీర్మానం చేయాలి. అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు నమ్ముతారు. విభజనకు ఉత్సాహం చూపుతున్న సోనియా, బాబులను బహిష్కరించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ విభజిస్తే దిశ దశ ఉండవు ‘‘రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తే దిశ దశ ఉండవు. హైదరాబాద్ నగరం మనదని భావించే కోస్తాలో ఎకరాలు అమ్ముకుని ఇక్కడ గజాల స్థలం కొని అభివృద్ధి చేశాం. ఐటీ, ఫార్మా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాక, ఇప్పుడు వెళ్లిపోమడం ఎంతవరకు సమంజసం?’’ -గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అభినందనీయం ‘‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఉద్యమిస్తున్న వైఎస్సార్సీపీకి, జగన్మోహన్రెడ్డికి హృదయపూర్వక అభినందనలు. కొందరు నేతలు రహస్య ఎజెండాతో విభజనతో మన భవిష్యత్తును అంధకారం చేయజూస్తున్నారు. ’’ -ఏవీ పటేల్, సీమాంధ్ర గెజిటెడ్ అధికారుల జేఏసీ నేత విద్యార్థుల భవిష్యత్తేమిటి? ‘‘రాష్ర్టం విడిపోతే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. చదువుల తర్వాత తమ భవిష్యత్తేమిటనే బెంగ వారిలో ఉంది. వెఎస్సార్ సీపీ నిర్ణయాన్ని సీమాంధ్రలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులమూ స్వాగతిస్తున్నాం. ’’ -అడారి కిషోర్‌కుమార్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేత -
సడలని పోరు... ఎడతెరపి లేని వానలోనూ మిన్నంటిన జనోద్యమం
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర జిల్లాల్లో నాలుగైదు రోజులుగా ఎడతెరపిలేని వాన.. ఊళ్లను ముంచెత్తిన భారీవర్షాలు.. జలమయమైన నగరాలు.. చాలాచోట్ల జనజీవనం అస్తవ్యస్తం.. అయినా సరే.. సమైక్యాంధ్ర జనోద్యమం ఏమాత్రం తగ్గడంలేదు. 87వ రోజైన శుక్రవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సమైక్య ఆందోళనలు హోరెత్తాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జేఏసీ, మిట్స్ కళాశాలల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ జేఏసీతో కలిసి విద్యార్థులు, ఎన్జీవోలు మానవహారం ఏర్పాటు చేశారు. పుంగనూరులో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఆస్పత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతపురంలో జాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఎస్కేయూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో విద్యార్ధులు మానవహారం చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రైళ్లు, బస్సులకు సమైక్యాంధ్ర పోస్టర్లు అంటించారు. అమలాపురంలో ఆర్టీసీ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. పెద్దాపురం, కాకినాడ, రాజమండ్రిల్లో న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు నిరసన దీక్షలు చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వాహనాలకు ‘జై సమైక్యాంధ్ర’ స్టిక్కర్లను అతికించారు. భీమవరం పట్టణంలో విద్యార్థులు రాస్తారోకో చేశారు. రైతుల దీక్షలు : కృష్ణాజిల్లా చల్లపల్లిలో లక్ష్మీపురానికి చెందిన రైతులు దీక్ష చేశారు. అవనిగడ్డలో పాత ఇనుము వ్యాపారులు, సిబ్బంది, సిం హాద్రి కాలనీ వాసులు దీక్ష చేశారు. నెల్లూరులో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించి అనంతరం సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సమైక్య సభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లా గూడూరులో రైతు గర్జన పేరిట జరిగిన బహిరంగసభకు రైతులు, రైతుకూలీలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఇప్పటికే ఎన్నో సాగు సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు... ఇక రాష్ట్రం విడిపోతే మరింత దుర్భర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు, ఆదోనిలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి రాస్తారోకో చేశారు. ఆగని వైఎస్సార్ సీపీ దీక్షలు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టిన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వర్ష బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టిన పార్టీ నేతలు, కార్యకర్తలు సమైక్యాంధ్ర ఉద్యమ పథాన్ని మాత్రం వీడలేదు. శుక్రవారం జోరు వర్షంలోనూ నిరశన దీక్షలు కొనసాగించారు. -
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
-
రాజీనామాల ఆమోదం కోసం ఢిల్లీ కోర్టులో జగన్ పిటిషన్
హైదరాబాద్: లోక్‌సభ స్పీకర్ తమ రాజీనామాలు తిరస్కరించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి, ఆ పార్టీకే చెందిన మరో ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారితోపాటు నంద్యాల ఎంపి ఎస్పివై రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఎస్పివై రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరు ముగ్గురూ రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతూ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన 13 మంది ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు సమర్పించిన రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ గత శుక్రవారం తిరస్కరించారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెందిన లోక్‌సభ సభ్యుల రాజీనామాలు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వచ్ఛందంగా చేసినవి కావని స్పీకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ఏర్పడిన తీవ్రమైన భావోద్వేగాల నడుమ తీసుకున్న రాజీనామా నిర్ణయాలను ఆమోదించటం సాధ్య కాదన్న అభిప్రాయంతో స్పీకర్ ఉన్నట్లు లోక్‌సభ సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 101(3), లోక్‌సభ నియమావళిలోని 204 నిబంధనను అనుసరించి స్పీకర్ ఆయా ఎంపీల రాజీనామాలను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరించారు. కాంగ్రెస్‌కు చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, అనంత వెంకట్రామిరెడ్డి, ఎ.సాయిప్రతాప్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనుమూరి బాపిరాజు, జి.వి.హర్షకుమార్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఎస్.పి.వై.రెడ్డి, టీడీపీ సభ్యుడు కొనకళ్ల నారాయణరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాలను తిరస్కరించారు. ఈ 13 మందిలో జగన్, మేకపాటి, ఎస్పివై రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామ చేసినట్లు వారు చెప్పారు. తమ రాజీనామాలు ఆమోదించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ సిపి నేతలు ముందే చెప్పారు. ఆ విధంగా వారు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేశారు. -
విద్యార్థుల పోరుకేక.. కదంతొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం వరుసగా 84వరోజూ మంగళవారం ఉధృతంగా సాగింది. రాష్ర్టం ముక్కలైతే తమ భవిష్యత్తు అంధకారమవుతుందంటూ విద్యార్థిసంఘాలు ఆందోళన చేపట్టాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీలో జరిగిన రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు చెందిన విద్యార్థుల సదస్సు ఎంపీలు రాజీనామాలు చేసేవరకు ఉద్యమించాలని తీర్మానించింది. కర్నూలు జిల్లా కోసిగిలో నిర్వహించిన విద్యార్థి గర్జన జరిగింది. రాష్ట్రం విడిపోతే ఉపాధి అవకాశాలు మృగ్యమై విద్యారంగం తిరోగమనం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో రైతుగర్జన పేరిట బహిరంగసభ నిర్వహించారు. కర్నూలు లో భూగర్భ జలశాఖ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. అనంతపురంలో యూత్ జేఏసీ ఆధ్వర్యంలో టవర్ క్లాక్ సర్కిల్లో మానవహారం నిర్మించారు. ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ కుందుర్పిలో సమైక్యవాదులు గాడిదకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపుమేరకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రహోంమంత్రి షిండేకు మెసెజ్‌ల ద్వారా సమాచారం పంపించారు. ముదినేపల్లి మండలం చిగురుకోటలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు గడపగడపకు మేల్కొలుపు పేరుతో ఇంటింటికీ వెళ్లి సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరించారు. నాగాయలంకలో జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. జగ్గయ్యపేటలో విద్యార్థులు పిరమిడ్ల ఆకారంతో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. కలిదిండి సెంటరులో రైతులు దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో కదంతొక్కుతున్న పార్టీ శ్రేణలు మంగళవారం కూడా విభిన్న రూపాల్లో ఆందోళనలు కొనసాగించాయి. వైఎస్సార్ జిల్లా పులివెందులలో పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరంలో కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. శిబిరం వదే ్ద రోడ్డు పక్కన చెప్పులు కుట్టి, బూట్ పాలిష్ చేసి, రోడ్లు శుభ్రం చేసి నిరసన తెలిపారు. తిరుపతిలో తుడా మైదానం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మూటలుమోసి నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో ఉన్నత విద్యను అభ్యసించిన యువత ఇలా మూటలు మోసుకొని వచ్చే ఆదాయంతో జీవించాల్సిందేనని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని కోరుతూ శ్రీకాళహస్తిలో పార్టీ నేత బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు కల్యాణి ఆధ్వర్యంలో వృత్తి పనివారు, రైతులు, రజకులు, చేనేత కార్మికులు పనిముట్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కృష్ణాజిల్లా చాట్రాయి మండలంలోని కృష్ణారావుపాలెంలో పార్టీ కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే ధర్నా చేపట్టారు. ఇక ఈనెల 2వతేదీ నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని అన్ని మండలాల్లోనూ పార్టీ శ్రేణులు చేపట్టిన రిలే నిరశన దీక్షలు నిరవధికంగా కొనసాగుతున్నాయి. -
సమైక్య ముసుగులో సీఎం కిరణ్ మోసం
కుర్చీ కాపాడుకోడానికే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. విశాఖ విమానాశ్రయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనను సజావుగా న డిపించడానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వత్తాసు పలుకుతూ సీఎం ఓ అస్త్రంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. విభజన పక్రియ సజావుగా సాగిపోవడానికి ప్రజాప్రతినిధులతో రాజీనామాలు ఇవ్వనీయకుండా, రాజకీయ సంక్షోభం రానీయకుండా సీఎం అడ్డుపడుతున్నారన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శాసనసభలో తీర్మానానికి కిరణ్ సర్కారు ప్రయత్నించడంలేదని ధ్వజమెత్తారు. విభజనపై కేంద్రం ముందుకు వెళుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించిన చందంగా తాపీగా కూర్చున్నారని విమర్శించారు. సోనియాను ఎదిరిస్తుంటే సీఎం పదవీత్యాగం చేస్తారని గతంలో చాలామంది భావించారని, కానీ ఇపుడు ఆయన నిజస్వరూపం బయటపడిందని చెప్పారు. సమైక్యవాదాన్ని అణచివేసే ప్రయత్నాలు చేస్తున్న కిరణ్ చరిత్రహీనులుగా మిగులుతారన్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేసే పరిస్థితి లేకుండా చేసి సోనియాగాంధీ ప్రజాస్వామ్యాన్ని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభకు హరికృష్ణ చేసిన రాజీనామాను, మంత్రి విశ్వరూప్ చేసిన రాజీనామాను ఆమోదించినా, మిగతా మంత్రుల రాజీనామాలు, వైఎస్సార్ సీపీ రాజీనామాలు ఆమోదించకపోవడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీకి మసి పూయాలని చూస్తున్నారన్నారు. రాజీనామాలపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు. చంద్రబాబు సమైక్యాంధ్ర ముసుగులో ఒక మాదిరిగా.. ముసుగు తీసి మరొకలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సేవియర్ ఆఫ్ కాంగ్రెస్ (రక్షకుడు)గా చంద్రబాబు మారారని ఎద్దేవా చేశారు. సోనియా నేతృత్వంలో చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి పని చేస్తున్నారని పేర్కొన్నారు. తనపై సీబీఐ కేసులు లేకుండా, సమైక్యాంధ్రకు జగన్ సీఎం కాకూడదన్న లక్ష్యంతో కాంగ్రెస్‌తో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు. -
సమైక్య యాగం
సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమం అలుపెరగకుండా సాగుతోంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 78రోజులుగా సాగుతున్న జనోద్యమం బుధవారం నాడూ ఉద్ధృతంగా ఎగసింది. బక్రీద్‌ను పురస్కరించుకుని ముస్లింలు సమైక్య రాష్ట్రం కోసం పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జాతీయ రహదారిపై సుదర్శన యాగం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆకాంక్షిస్తూ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో జాతీయ రహదారిపై మహా సుదర్శన యాగం నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రాష్ట్ర విభజనపై ప్రజాభిపాయ సేకరణ చేపట్టారు. ఈ పోలింగ్‌లో సకల జనులు సమైక్య రాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. విశాఖ జిల్లా భీమిలి, అనకాపల్లిలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లా నెల్లిమర్ల, భోగాపురం, గజపతినగరం, పార్వతీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మంత్రుల చిత్రపటాలతో ఉన్న ఫ్లెక్సీలపై కుళ్లిన టమాటాలు, కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. హైవేపై రాస్తారోకో : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. వెంకటగిరిలో భిక్షాటనతో నిరసన చేపట్టారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ముస్లింలు, ఉద్యోగ జేఏసీ నాయకులు సమైక్యాంధ్ర నినాదాలు రాసిన ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిలే దీక్ష చేపట్టారు. కృష్ణాజిల్లా పామర్రులో కళ్లకు గంతలు కట్టుకుని జేఏసీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్లో విభజనవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో సమైక్యవాదులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముస్లింల ర్యాలీ : వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్లలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించి సమైక్య నినాదాలను హోరెత్తించారు. జమ్మలమడుగులో వేలాది మంది రైతులు పెద్దఎత్తున ప్రదర్శన చేపట్టారు. బద్వేలులో ఉపాధి హామీ సిబ్బంది, మైదుకూరులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ర్యాలీ నిర్వహించారు. రాయచోటిలో సమైక్యవాదుల రిలే దీక్షలకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఈద్గా బయట సమైక్య నినాదాలు చేశారు. మదనపల్లెలో సమైక్యవాదులు గొంతులకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు. అనంతపురం జిల్లా పామిడిలో మంత్రుల కమిటీ గో బ్యాక్ అంటూ సమైక్యవాదులు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం విడిపోతే ఉపాధి కరువవుతుందని బెళుగుప్పలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. రాష్ట్రం విడిపోతే రాళ్లు..రప్పలు తిని బతకాల్సి వస్తుందంటూ అనంతపురంలో ఎస్కేయూ విద్యార్థులు నిరసన తెలిపారు. సమైక్యాంధ్రనే కొనసాగిస్తామని కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంతవరకు సమ్మె విరమించేది లేదంటూ ఏపీఎన్జీవోలు, మున్సిపల్ ఉద్యోగులు, డిగ్రీ అధ్యాపకులు కర్నూలులో ప్రతిజ్ఞ బూనారు. ప్రజాప్రతినిధుల ప్రమాణాలు : రాష్ట్ర శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తామని సీమాంధ్రలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రతినబూనారు. తూ.గో.జిల్లా అమలాపురంలో జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల వద్దకు వచ్చిన మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తాను అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని వ్యతిరేకిస్తానని ప్రతిజ్ఞ చేశారు. తాను రాసి తెచ్చిన ప్రమాణ పత్రాన్ని జేఏసీ ప్రతినిధులకు చదివి వినిపించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే, మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తాము సమైక్య రాష్ట్ర పరిరక్షణకు కట్టుబడి ఉంటానని ఆయా ప్రాంతాల్లో ఎన్జీవోలకు హామీపత్రం రాసిచ్చారు. ఉద్యమంలో అలసి కోమాలోకి.. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సంక్రాంతిపాడు వీఆర్వోగా పనిచేస్తున్న కొండా దేవదాసు రెండు నెలలకు పైగా సమైక్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. మంగళవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇంటి ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆందోళన అనంతరం తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామమైన నార్నెపాడు వెళ్తుండగా ఉద్వేగానికిలోనైన దేవదాసు వాహనంపై నుంచి పడిపోయారు. వెంటనే సహచరులు విజయవాడ ఆస్పత్రికి తరలించగా, పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతను అపస్మారక స్థితికి చేరకున్నాడని తెలిపారు. నరాలు చిట్లిపోవడంతో పరిస్థితి ఆందోళనగానే ఉందని చెబుతున్నారు. రెండు నెలలుగా వేతనాలు లేక, ఇళ్లు గడిచే పరిస్థితి లేకపోవటంతో భార్య కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా, రాష్ట్ర విభజనపై కలత చెంది అనంతపురం జిల్లాలో ఒకరు, విశాఖ జిల్లాలో ఒకరు బుధవారం మరణించారు. ఆగని ప్రజాగ్రహం సాక్షి నెట్వర్క్ : అధికారపార్టీ నేతలు, మంత్రులపై ప్రజాగ్రహం కొనసాగుతోంది. టీటీడీ పాలక మండలి చైర్మన్, ఎంపీ కనుమూరి బాపిరాజు రాజీనామా చేయాలనే డిమాండ్‌తో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఆయన ఇంటికి వస్తున్న రైతులను పోలీసులు నిలువరించారు. దీంతో సుమారు రెండు గంటలసేపు రైతులు అక్కడే వేచిచూసి పోలీసులను దాటి తోసుకువె ళ్ళేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు జేఏసీ జిల్లా అధ్యక్షుడు నిమ్మల రామానాయుడికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరో నలుగురు రైతులకు గాయాలయ్యాయి. నెల్లూరులో ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించారు. తొలుత మంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను మంత్రి ఇంటి గేటు ముందు దహనం చేశారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు ఇంటి ముట్టడికి యత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇక సీమాంధ్ర హక్కుల కోసం పోరాటం చేస్తామని కేంద్ర మంత్రులు పురందేశ్వరి, పల్లంరాజు వ్యాఖ్యానించడాన్ని నిరసిస్తూ కర్నూలులో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. -
సమైక్య హోరు వానలోనూ అదేజోరు..
సాక్షి నెట్వర్క్: హోరువానలోనూ సమైక్యాంధ్రకోసం ఉద్యమ జోరు తగ్గడం లేదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉద్యమిస్తామంటూ సీమాంధ్రులు నిరూపిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం 72వ రోజుకు చేరుకుంది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉద్యోగులు చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. విద్యుత్ ఉద్యోగులు సబ్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించగా, కనిగిరిలో ర్యాలీ తీశారు. నెల్లూరులో ఎన్జీఓ నేతలు కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు దహనం చేశారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్ష భగ్నానికి నిరసనగా కడపలో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. కడపలోని పారా మెడికల్, మెడికల్ జేఏసీ ఆధ్వర్యంలో 650 మంది ఆర్టీసీ కార్మికులకు రూ. 6లక్షల విలువైన నూనె, బియ్యం, కందిబేడలను పంపిణీ చేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో దాతలు 350 బస్తాల బియ్యాన్ని ఆర్టీసీ కార్మికులకు అందజేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలను వివరిస్తూ లఘు నాటిక ప్రదర్శించారు. విశాఖ జిల్లా పాతగాజువాకలో ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య దీక్షకు దిగగా, న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం వైఎస్సార్ కూడలిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డిని అక్కడి ఉద్యోగ జేఏసీ నేతలు గురువారం కలిసి సమైక్యానికి సహకరించమంటూ కాళ్లుపట్టుకుని కోరారు. అనంతపురం జిల్లా మడకశిరలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) నుంచి గురువారం అనంతపురం వస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమైక్య సభలో అసువులు బాసిన వీఆర్వో భీమవరం : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గురువారం నిర్వహించిన గోదావరి గర్జన సభలో వీఆర్వో అసువులు బాశారు. భీమవరం మండలం రాయలం వీఆర్వో వేగేశ్న ప్రసాదరాజు (57) గురువారం వేకువజాము నుంచి గర్జన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వేదిక వద్దే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. సహోద్యోగులు ఆయనను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రసాదరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి అశోక్‌బాబు సంతాపం తెలిపారు. -
ఎవరికీ అర్ధంకాని చంద్రబాబు దీక్ష
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని ఏపి భవన్లో దీక్ష ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. పలానందుకు చేస్తున్నానని ఆయనా చెప్పడంలేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, 9 ఏళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా స్పష్టత లేకుండా దీక్ష చేయడం ఏమిటని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష ప్రారంభించే ముందు నిన్న జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కూడా ఆయన స్పష్టంగా సమాధానం చెప్పలేకపోయారు. సమాధానాలు చెప్పడానికి తడబడ్డారు. అసహనం వ్యక్తం చేశారు. కానీ అతని ఉద్దేశం మాత్రం స్పష్టం చేయలేదు. ఈరోజు కూడా తెలుగు ప్రజలకు న్యాయం జరిగేవరకు పోరాడతానని చెప్పారు. ఆ న్యాయం ఏమిటో చెప్పలేదు. ఆయన దీక్ష సమైక్యత కోసం చేస్తున్నారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయమని చేస్తున్నారా? త్వరగా రాష్ట్రాన్ని విభజన చేయమని చేస్తున్నారా? అనేది అర్ధం కావడంలేదు. ఆయనా చెప్పడంలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ ఈరోజు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కోరిక మేరకే రాష్ట్రాన్ని విభజించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని విభజించాలని చంద్రబాబు స్వయంగా తమకు లేఖ రాసి ఇచ్చినట్లు తెలిపారు. మరి ఆయన దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడంలేదన్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఒక స్పష్టతలేకుండా దీక్ష చేపట్టడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర ప్రజల క్షేమంకన్నా ఇరు ప్రాంతాలలో తన రాజకీయ భవిష్యత్తు ముఖ్యంగా భావిస్తున్నట్లు అందరికీ అర్ధమైపోతోంది. చంద్రబాబు చర్యల వల్ల కాంగ్రెస్‌కు తన పనిని తాను మరింత సులువుగా చేసుకుపోయే అవకాశం ఏర్పడుతోంది. రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చారు. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ప్రకటించిన తరువాత సీమాంధ్రలో రాజధాని నిర్మాణం కోసం నాలుగైదు లక్షల కోట్లు కావాలని కోరారు. ఈ రెండు విషయాల ద్వారా విభజనకు ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక దీక్ష దేనికో ఆ పార్టీ నేతలకు కూడా అర్ధం కావడంలేదు. ఎందుకంటే వారూ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదా! పార్టీ నేతలు ఇచ్చిన సలహాలకు కూడా ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నట్లు లేదు. చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు మాత్రం తన తండ్రి దీక్షతో దేశం మొత్తం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నాడు. స్పష్టమైన డిమాండ్ ఏమిటో చెప్పకుండా దీక్ష చేస్తున్న చంద్రబాబు వైపు దేశం మొత్తం వింతగా చూస్తుందన్న విషయం ఆయనకు అర్ధం కావడంలేదు. -
జగన్ సమైక్య దీక్షకు వెల్లువెత్తుతున్న మద్దతు
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు హైదరాబాద్‌తోపాటు సీమాంధ్ర అంతటా మద్దతు వెల్లువెత్తుతోంది. నాలుగవ రోజు దీక్ష కొనసాగిస్తున్న జగన్‌ను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. అనేక మంది జగన్‌ను కలిసి తమ మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు కూడా ఈరోరజు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. బుక్కరాయసముద్రం మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్‌రెడ్డి వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. కూకట్పల్లి క్రిస్టియన్ మైనారిటీ నాయకుడు రెవరెన్ జార్జ్హెర్బత్ ఆధ్వర్యంలో 500 మంది చర్చి ఫాదర్లతో జగన్ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర అంతటా జగన్ దీక్షకు మద్దతుగా పలువురు నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆమరదీక్షలు, రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా అగరంపల్లిలో జగన్ దీక్షకు మద్దతుగా దేవాలయశాఖ మాజీ ఉద్యోగి కేశవులు చేస్తున్న దీక్ష నాలుగవ రోజుకు చేరింది. జగన్ దీక్షకు మద్దతుగా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి దీక్ష చేయనున్నారు. బీఎం కండ్రికలో పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తిరుపతి తుడా సర్కిల్లో పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, అభిమానులు ర్యాలీలు నిర్వహించి రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5వ రోజు మహిళలలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రాజంపేట కన్వీనర్ కోనా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దీక్ష చేస్తున్నారు. రాయచోటిలో ఈ రోజు దీక్షలో 30 మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ, నందిగామ, మైలవరం, తిరువూరులలో పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.పామర్రులో పార్టీ సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు దీక్షలో ముస్లిం సొదరులు పాల్గొన్నారు. నిడదవోలులో పార్టీ సమన్వయకర్త రాజీవ్ కృష్ణా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. పెనుగొండ గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పార్టీ సమన్వయకర్త ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. కదిరిలో వైఎస్ఆర్ సీపీ నేత వజ్ర భాస్కర్‌రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. రాయదుర్గంలో పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్‌లో పార్టీ సమన్వయ కర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో, కదిరి, ఒడీసీలో వైఎస్ జగన్ అభిమానులు దీక్షలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పోరు పాదయాత్ర నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పార్టీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మునగపాకలో యలమంచిలి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త బుడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే దీక్ష చేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో 3వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. -
పార్టీలన్నీ ఉద్యమిస్తే కేంద్రం వెనక్కు
samaikyandhra, telangana, employees forum, muralikrishna, సమైక్యాంధ్ర, తెలంగాణ, ఉద్యోగుల ఫోరం, మురళీకృష్ణ సచివాలయ సమైక్యాంధ్రఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ వ్యాఖ్య వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి సమైక్యం కోసం ఉద్యమిస్తే విభజన అంశంపై కేంద్రం వెనక్కుతగ్గడం సాధ్యమేనని సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు ఉద్యోగుల ఫోరం సోమవారం సంఘీభావం తెలిపింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యోగులు జగన్ దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ జగన్ ఆమరణ దీక్ష చేపట ్టడం అభినందనీయమన్నారు. గతంలో సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో పోరాడితే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించే ప్రతిపార్టీకి తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు. జగన్‌ను కలిసిన వారిలో కో చైర్మన్ బి.మురళీమోహన్, కన్వీనర్ టి.వెంకటసుబ్బయ్య, వైస్ చైర్మన్ బెన్సన్, కోఆర్డినేటర్ ఎ.రవీంద్రరావు, సచివాలయ హౌసింగ్ సొసైటి ప్రెసిడెంట్ కె.వెంకట్రామిరెడ్డి తదితరులున్నారు. మరోవైపు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్ కె. ఓబుళపతి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వైఎస్ జగన్‌ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో ఉపాధ్యాయులు సైతం పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు వైఎస్సార్సీపీ అధినేతకు వినతిపత్రం అందజేశారు. -
సోనియా క్విట్ ఇండియా..
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. సోమవారం సచివాలయం పాత ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ‘సోనియా క్విట్ ఇండియా.. ప్యాకేజీలు వద్దు సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో సచివాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సమతా బ్లాక్ ఎదురుగా కూర్చుని నిరసన తెలిపారు. అంతకుముందు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చల్లో పాల్గొన్నారు. ఈనెల 9న సీఎంతో సమావేశం కానున్నామని, రాష్ట్ర విభజన నిలిపివేయడంపై స్పష్టమైన హామీ వచ్చేంత వరకూ సమ్మె కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఫోరం కన్వీనర్ మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య తెలిపారు. విద్యుత్ సౌధలో పోటాపోటీ ఆందోళనలు సీమాంధ్ర, తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీలు సోమవారం విద్యుత్ సౌధలో పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించాయి. సమ్మెలో పాల్గొంటున్న అసాంఘిక శక్తులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కో ఆర్డినేటర్ రఘు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యుత్‌సౌధకు వచ్చి మద్దతు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించేది లేదని సీమాంధ్ర జేఏసీ చైర్మన్ సాయిబాబా స్పష్టం చేశారు. -
మనకు కావలసింది ముజఫర్ నగర్లు కాదు.. మొహబత్ నగర్లు: ఎన్డిటివితో వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూ -
సీఎం కార్యాలయం ఎదుట సీమాంధ్ర ఉద్యోగుల నిరసన
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయం ఉద్యోగులు ఆందోళనలను మరింత తీవ్రతరం చేశారు. గురువారం ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం సమత బ్లాక్ వద్దకు దూసుకొచ్చి బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, రాష్ట్రాన్ని విభజిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. కొన్నాళ్ళుగా విధులకు దూరంగా ఆందోళన బాట పట్టిన ఉద్యోగులు గురువారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత నేరుగా సమత బ్లాక్ వద్దకు ప్రదర్శనగా బయల్దేరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గని ఉద్యోగులు పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ సమత బ్లాక్ వద్దకు చేరుకుని, అక్కడే బైఠాయించి సాయంత్రం వరకూ నిరసన తెలిపారు. కాగా, సమత బ్లాక్ వద్ద ఆందోళన సందర్భంగా సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ బెన్సన్ స్పృహ కోల్పోవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: మురళీకృష్ణ సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ వెల్లడించారు. ఉద్యోగుల సర్వసభ్య సమావేశం డీ బ్లాక్‌లోని సమావేశ మందిరంలో దాదాపు ఐదు గంటల పాటు జరిగింది. తెలంగాణ ప్రక్రియపై కేంద్రం ముందుకెళ్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చేపట్టాలనే అంశంపై ఈ సందర్భంగా అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం దిగివచ్చే వరకూ ఆందోళన చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్టు వెల్లడించారు. సమైక్యవాదుల మనోభావాలను గుర్తించాలని, సమైక్యవాదాన్ని కోరుకునే ఏ పార్టీకైనా తమ మద్దతు ఉంటుందని తెలిపారు. -
కలుపుమొక్కలను ఏరేయాలి: అశోక్‌బాబు
‘కృష్ణా’ రైతు మహాగర్జన పిలుపు రాజీనామా చేయని మంత్రులు, ఎంపీలు ద్రోహులే..: అశోక్‌బాబు సమైక్యాంధ్ర ద్రోహులకు 2014లో ఓటెయ్యొద్దు {పాణాలైనా అర్పించి కేంద్ర కేబినెట్ నోట్‌ను అడ్డుకుంటాం సమైక్యవాదం 19 జిల్లాలకు విస్తరించింది రాహుల్ చెబితే నేరచరిత్ర ఆర్డినెన్సును ఆపేశారు.. మరి కేబినెట్ నోట్కూడా కాని తెలంగాణ నిర్ణయం విరమించలేరా? సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో అవకాశవాద కలుపుమొక్కలుగా ఉండే నాయకులను ఏరిపారెయ్యాలని ఆంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్, ఏపీఎన్జీవోల సంఘ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు రైతులకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో బుధవారం జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రైతు మహాగర్జన సభలో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయని కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ద్రోహులే అన్నారు. వీరు నిజంగా తెలుగు తల్లికి పుట్టి ఉంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని హితవు పలికారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేసే ఏ పార్టీ నాయకుడైనా ఓటెయ్యవద్దని, అటువంటి అవకాశ రాజకీయ నాయకులకు 2014 ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు అనే బుల్లెట్‌తో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు మారిన సంగతి గత ఎన్నికలు రుజువు చేశాయని, 2014 ఎన్నికల్లో అదే చరిత్ర పునారావృతం అవుతుందని హెచ్చరించారు. 2004లో తెలంగాణాపై రెండో ఎస్సార్సీ అన్న పార్టీకి పట్టం కట్టామని, 2009లో అసలు రాష్ట్ర విభజన ప్రాస్తవన లేని పార్టీని గెలిపించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. ఈసారి కూడా రాష్ట్ర విభజనను అడ్డుకునే నాయకులకే అండగా నిలుస్తామని అశోక్‌బాబు స్పష్టంచేశారు. తమ ప్రాణాలైనా అర్పించి తెలంగాణా బిల్లు కేంద్ర కేబినెట్ ఆమోదానికి రాకుండా అడ్డుకుంటామన్నారు. రాజకీయాల్లో నేర చరితులు అనే విషయంలో బిల్లు దశకు వచ్చి రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లిన తరుణంలో కేవలం రాహుల్ గాంధీ అభ్యంతరం చెప్పారని బుట్టదాఖలు చేశారని, అలాంటింది కేబినెట్ నోట్‌గా కూడా రాని తెలంగాణా అంశాన్ని ఎందుకు ఆపలేరని ప్రశ్నించారు. రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు 110 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మా సహనానికి కేంద్రంలోని యూపీఏ సర్కార్ పరీక్ష పెడుతోందని, మా చేతల్లో, మాటల్లో గాంధీ ఉన్నా, గుండెల్లో మాత్రం అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాస్‌చంద్రబోస్ ఉన్నారన్న విషయం చాటిచెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. తాము సాగిస్తున్న సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రలోని 13 జిల్లాలకే పరిమితం కాలేదని, ఇది ఖమ్మం, నల్గొండ, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకూ విస్తరించిందన్నారు. అచ్చమైన రైతులే రోడ్డెక్కి గర్జించడం చూస్తే ఈ జిల్లా వాడిగా గర్వపడుతున్నానన్నారు. కలియుగ ‘హంస’ కేసీఆర్ పాలు, నీరును వేరుచేసే ప్రత్యేక లక్షణం హంసకు మాత్రమే ఉందని, అలాంటి పాలు, నీరులా కలిసి ఉన్న తెలంగాణా, సీమాంధ్రను వేరుచేసే హంసను తయారు చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయేనని అశోక్‌బాబు విమర్శించారు. తెలంగాణ ఉద్యమం వాస్తవాలపై నిర్మించలేదని, మీడియా, సాహిత్యంవల్లే దానికి ఒక ఊపు వచ్చిందని, అటువంటి జోష్ మన ఉద్యమానికి కూడా అవసరమని అశోక్‌బాబు అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అవసరమైతే తెలంగాణ వాళ్లకే ఐదేళ్లపాటు నాయకత్వం అప్పగించేందుకు సిద్ధం కావాలని, అప్పుడైనా ఉద్యమాలు లేని ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుందేమో ఆలోచించాలని అశోక్‌బాబు అన్నారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, మాదిగ దండోరా రాష్ట్ర నాయకుడు వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ తెలంగాణాకు మద్దతు పలికే మంద కృష్ణమాదిగ గుంటూరులో సభ పెడతానని ప్రకటించారని, ఆయన్ను ఇక్కడ కాలుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఈ రైతు గర్జనలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గీతలు ఆకట్టుకున్నాయి. -
గవర్నర్ ను కలిసిన వైఎస్ జగన్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి పార్టీ ప్రతినిధి బృందంతో కలిసి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. శాసనసభను వెంటనే సమావేశపరచాలని కోరారు. సమైక్య రాష్ట్రతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వారు ఒక వినతి పత్రం గవర్నర్‌కు అందజేశారు. జగన్ వెంట పార్టీ ముఖ్యనేతలు ఉన్నారు. -
సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేయాల్సిందే: అశోక్‌బాబు
ఎంపీలకు ఎపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు డిమాండ్ ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలి ఉద్యమం ఎలా ఉందో కర్నూలుకు వచ్చి తెలుసుకో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ సమైక్యాంధ్ర కోసం గర్జించిన కర్నూలు సాక్షిప్రతినిధి, కర్నూలు: ‘పొత్తులు, ఎత్తులతో సంబంధం లేకుండా సమైక్యాంధ్ర కోసం పోరాడే పార్టీకే వచ్చే ఎన్నికల్లో మద్దతిస్తాం. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఇప్పుడు అన్ని పార్టీలకు చెందిన అభిమానులు ఉన్నందున పార్టీల గురించి ఇప్పుడే ప్రకటించబోం. సమైక్యాంధ్ర కోసం 13 జిల్లాల్లోని ఎంపీలు, కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఎంపీల రాజీనామాలపై ఒత్తిళ్లు పెంచుతాం. అదే సమయంలో శాసనసభ్యులంతా అసెంబ్లీలో తెలంగాణ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే వారికి రాజకీయ భవిష్యత్తు మిగులుతుంద’ని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. కర్నూలులో ఆదివారం జరిగిన ‘సమైక్య రాష్ట్ర ప్రజాగర్జన’ సభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన సకల జనుల భేరిలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన ఢవ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘ సమైక్యఉద్యమం ఉవ్వెత్తున నడుస్తోంది.. కర్నూలులో సభ అంటే లక్షలాది మంది జనం తరలివచ్చారు. అయితే దీన్ని హైదరాబాద్‌లో జరిగిన సభలో ఓ నాయకుడు (కేసీఆర్) అపహాస్యం చేస్తూ మాట్లాడారు. గడ్డితిని, ఈకలు తింటూ చేసేవి ఉద్యమాలా అంటూ హేళన చేశారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఉద్యమం అంటే ఏంటో తెలుస్తుంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇంకా ఉద్యమం తీవ్రమవుతుంది. మీరు బలహీనపడి మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. సీమాం ధ్రుల అంగీకారం లేకుండా తెలంగాణ రాదు. తెలంగాణ ప్రకటన చేసి 60రోజులైంది. ముందుకు వెళుతున్నాం అంటున్నారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానికి కారణం మా ఉద్యమమే. తెలంగాణ విషయంలో ముందుకు వెళ్లినా ఢిల్లీలో ఆపే శక్తి మాకుంది. మా ఎంపీల మెడలు వంచి తెలంగాణను ఆపుతాం. ఇప్పటి వరకు గాంధీల్లా శాంతియుత ఉద్యమం చేస్తున్నాం. రెచ్చగొడితే మా గుండెల్లో ఉన్న అల్లూరి సీతారామరాజు, తరిమెల నాగిరెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి వారు బయటకి వస్తారు. మేం సమైక్యంగా ఉండాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు మీరు సర్దుకుపోయాం అంటున్నాం. ఇప్పుడు మేం సర్దుకుపోతాం కలిసుందాం అంటున్నాం’ అని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్‌ను గెలిపించాం 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ విభజన లేనందుకే ఆ పార్టీని గెలిపించామని, విభజన అన్న పార్టీలను ఓడించామని అశోక్‌బాబు గుర్తు చేశారు. సమైక్యరాష్ట్రంగా ఉంచుతారని నమ్మకంతో ఓట్లేసిన ప్రజలను కాంగ్రెస్ మోసగించి తెలంగాణ ప్రకటన చేయడం సరికాదన్నారు. నదీజలాల సమస్యలను పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఉండడానికి మేమేం అటు ఇటు కాని వాళ్లం కాదు. పార్లమెంటులో బిల్లు పెట్టిన రోజున ఢిల్లీలో మిలియన్మార్చ చేస్తామని ప్రకటించారు. ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు వి.సిహెచ్ వెంగళరెడ్డి అధ్యక్షత వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మేధావుల ఫోరం రాష్ట్ర నేత చలసాని శ్రీనివాస్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ, కర్నూలు జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాశ్, పరిపాలన అధికారి సంపత్ కుమార్‌తో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు పాల్గొని ప్రసంగించారు. -
సమైక్య లేఖ చంద్రబాబు ఇచ్చినా సంతకం చేస్తాం : శోభా నాగిరెడ్డి
వైఎస్సార్సీపీ నేత శోభా నాగిరెడ్డి స్పష్టీకరణ * మేం ఇచ్చే లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా? * సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు బాబు కుట్ర పన్నుతున్నారు * సమైక్యం కోసం మేం ఏం చేసినా తప్పుపడుతున్నారు * తన తోక పత్రికల్లో వేరే అర్థం వచ్చేలా రాయిస్తున్నారు * సమైక్యాంధ్రపై టీడీపీ విధానమేంటో స్పష్టం చేయాలి * సోనియాతో మీరు డీల్ కుదుర్చుకుని మాపై బురద చల్లుతారా? * జగన్‌పై బురదజల్లే బదులు రాష్ట్ర సమైక్యతకు కృషి చేయండి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద బురద చల్లే బదులు, ఆరు కోట్ల తెలుగు ప్రజల గురించి ఆలోచించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, రాజగురువు రామోజీరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత భూమా శోభానాగిరెడ్డి హితవు పలికారు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ఏకవాక్య లేఖ ఇచ్చినా సంతకం చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టంచేశారు. సమైక్యాంధ్ర జేఏసీ లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సమైక్య లేఖపై సంతకానికి చంద్రబాబు సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో తమ పార్టీ ఏ అడుగు వేసినా దాన్ని చంద్రబాబు తప్పు పడుతున్నారని, ఎవరు దొంగలో, ఎవరు నిజాయితీగా ఉద్యమిస్తున్నారో తేల్చాల్సిన సమయం వచ్చిందన్నారు. సమైక్యాంధ్ర కోసం రాసిన ఏకవాక్య తీర్మానంపై సంతకం చేయడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు, బొత్స సత్యనారాయణలు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు ఎవరికీ లేదంటూ ఆరు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకొచ్చి ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ మా అధినేత జగన్మోహన్రెడ్డి పలుమార్లు తన అభిమతాన్ని, పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా వెల్లడించారు. సమైక్య రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసిరావాలని కోరారు. అందుకోసం జేఏసీ నేతలు కేంద్రానికి ఒక లెటర్ డ్రాఫ్టు తయారుచేస్తే పార్టీ అధ్యక్షుడిగా సంతకం చేస్తానని చెప్పారు. ఆ దిశగా అన్ని పార్టీలు కూడా కలిసి రావాలని కోరారు’’ అని వివరించారు. అయితే సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని శోభ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసినా వేరే అర్థం వచ్చేలా బాబు తన తోక పత్రికల్లో రాయిస్తున్నారని, అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మరో రంగుపూసి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘టీడీపీ నేతలకు, ఎల్లో మీడియాకు ఒకటి మనవి చేస్తున్నా. జగన్‌పై బురద చల్లే కార్యక్రమాలకు ఇచ్చే ప్రాధాన్యతను రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు ఇవ్వాలి’ అని చురక అంటించారు. సమైక్యాంధ్రపై టీడీపీ విధానమేంటో చంద్రబాబు స్పష్టం చేయాలని శోభ డిమాండ్ చేశారు. రెండు నెలలుగా సమైక్య ఉద్యమంలో ఉన్న ఎన్జీవో సోదరులు జీతాలు లేక కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన పార్టీలేవి, డ్రామాలాడుతున్నవి ఏవో గమనించాలని జేఏసీలకు ఆమె విజ్ఞప్తి చేశారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా? టీడీపీని దెబ్బతీయడానికి ఎవరో కుట్ర చేయాల్సిన అవసరంలేదని, చంద్రబాబు విధానాలే ఆ పార్టీని సర్వనాశనం చేస్తున్నాయని శోభ పేర్కొన్నారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వమని మేం చెప్పామా? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌జారీ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడిన రోజునే టీడీపీ సగం చచ్చిపోయిందన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోమన్న ఏపీఎన్జీవోల విజ్ఞప్తిని తోసిపుచ్చినప్పుడు పూర్తిగా మరణించిందన్నారు. రాజకీయంగా జగన్‌ను దెబ్బతీయడానికి బాబు చేసే కుట్రలన్నీ ఆయనకే నష్టం చేకూరుస్తున్నాయని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అన్నిరకాల అండదండలు అందిస్తున్న టీడీపీ అధినేత.. ఇప్పుడు తాము కుమ్మక్కు అయ్యామని ఆరోపించడానికి సిగ్గేయట్లేదా అని దుయ్యబట్టారు. సోనియాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మాతో డీల్ కుదిరిందా లేక వారి నిర్ణయానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబుతో డీల్ కుదిరిందా అని నిలదీశారు. సోనియాతో డీల్ కుదరలేదంటే చంద్రబాబు తన లేఖను వెనక్కి తీసుకోమని రాజగురువు రామోజీ, తోకపత్రికలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ‘‘సోనియాగాంధీ వదిలిన బాణం జగన్ అని తనది రామబాణం అని చంద్రబాబు అంటున్నారు. ఇంకా బాణాలు వదిలే పరిస్థితిలో ఉన్నారా! బాబు ఎప్పుడో అంపశయ్య మీద ఉన్నారు’’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసిన ఏకైక నాయకుడు జగన్ అని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌కే కాకుండా చంద్రబాబుకు కూడా మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారన్నారు. జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానాలపై గౌరవం లేదా? దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల మాత్రమే జగన్‌కు బెయిల్ వచ్చిందని శోభానాగిరెడ్డి స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే సీబీఐ తుది చార్జిషీట్ వేసిందే కానీ.. జగన్ మీద ప్రేమతోనో, అభిమానంతోనో కాదన్నారు. కేంద్రం పంజరంలో చిలక అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినప్పుడు అన్ని పార్టీలూ స్పందించినా చంద్రబాబు మాత్రం నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదని గుర్తుచేశారు. కేసులు నిరూపితమై శిక్షపడిన వ్యక్తి జగన్ కాదని టీడీపీ నేతలు గుర్తుంచుకొని మాట్లాడాలని హితవు పలికారు. జగన్‌కు బెయిల్ రావడంపై వారు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే న్యాయస్థానాలపై ఉన్న గౌరవమేంటో తెలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో చంద్రబాబు, టీడీపీ నాయకులు.. మనిషి లక్షణాలను కూడా మరిచిపోయి నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీలో సబ్బం హరికి సభ్యత్వం లేదు.. అనకాపల్లి ఎంపీ సబ్బంహరి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని శోభ స్పష్టం చేశారు. తమ పార్టీలో ఆయనకు సభ్యత్వం కూడా లేదని పేర్కొన్నారు. జగన్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలో భాగంగా హరి మాట్లాడుతున్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ ఇమేజ్ను ఎలాగైనా దెబ్బతీయాలని కాంగ్రెస్‌తోపాటు టీడీపీలోనూ కుట్ర జరుగుతోంది. అందులో భాగంగానే హరి మాట్లాడారు. ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో సభ్యత్వం లేదు. కేవలం పార్టీలోకి రావాలనుకుంటున్న వ్యక్తి మాత్రమే. అయితే జగన్ ఇమేజ్ దెబ్బతీసేందుకు కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలో భాగంగా హరి పావుగా మారారు. ఆయన మాట్లాడిన మాటలు మా అందర్నీ బాధించాయి. ముఖ్యంగా జగన్మోహన్రెడ్డి చాలా బాధపడ్డారు. సబ్బం హరి వ్యాఖ ్యలకు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు, ఇకపై కూడా సంబంధం ఉండదు. ఆయన మా పార్టీలోకి వస్తానన్నా చేర్చుకునేది లేదు’’ అని శోభానాగిరెడ్డి స్పష్టంచేశారు. -
సీమాంధ్ర బంద్ సంపూర్ణం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమంలో భాగంగా ఏపీఎన్జీవోల పిలుపుమేరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మంగళవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. విద్యాసంస్థలు, వర్తక, వాణిజ్యసంస్థలు, సినిమాహాళ్లు, ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు, పెట్రోలుబంకులు మూసివేశారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడ జాతీయరహదారులను దిగ్బంధించారు.. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పోర్టు కార్యకలాపాలను అడ్డుకున్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్ అండ్ బీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఉభయగోదావరి జిల్లాల మధ్య గల చించినాడ బ్రిడ్జిపై జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో రాకపోకలు గంటలతరబడి నిలిచిపోయూరుు. కలకత్తా-చెన్నయ్ జాతీయ రహదారిని జిల్లాలో పలుచోట్ల దిగ్బంధించారు. విశాఖనగరంలో ఈపీడీసీఎల్ కార్యాల యంలో చేపట్టే బోర్డు మీటింగ్‌ను విద్యుత్ జేఏసీ, ఆర్టీసీ నేతలు అడ్డుకున్నారు. విజయనగరంలో ముస్లింలు నిరసన ర్యాలీ నిర్వహించగా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన మహేంద్రతనయ వంతెనపై సమైక్యవాదులు ైటె ర్లు కాల్చి నిరసన తెలిపారు. హౌరా-చెన్నై జాతీయ రహదారిపై అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు అడ్డుకోవడంతో వేలాది వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణాజిల్లాలోని బంటుమిల్లి రోడ్డు, బందరు వెళ్లే రోడ్డు, గుడివాడ రోడ్డులపై ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి వంటావార్పు చేశారు. విజయవాడలోని గొల్లపూడి, కనకదుర్గమ్మ వారధి, రామవరప్పాడు రింగ్, బెంజిసర్కిల్ వద్ద ఎన్జీవో నేతలు రోడ్లపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. తిరువూరులో విజయవాడ- జగదల్పూర్ జాతీయ రహదారిపై కట్టెలేరు వంతెన వద్ద బైఠాయించిన జేఏసీ నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. గుంటూరులోని ఆటోనగర్, వీఎస్సార్ కళాశాల, కఠెవరం గ్రామాల వద్ద తెనాలి విజయవాడ రహదారిపై రాస్తారోకోలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు చర్చి సెంటర్లో క్రైస్తవులు మానవహారం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చీరాలలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటా-వార్పు నిర్వహించారు. ఎనిమిది వేల మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి గండికి పాదయాత్రను చేపట్టారు. కర్నూలు జిల్లా నంద్యాలలో 24 మంది వికలాంగులు 24 గంటల దీక్ష చేపట్టారు. బంద్ నేపథ్యంలో బెంగళూరు-హైదరాబాద్(44వ), కర్నూలు-చెన్నై(18) జాతీయ రవాహదారులను సమైక్యవాదులు దిగ్బంధించి వాహనల రాకపోకలను అడ్డుకున్నారు. డోన్‌లో జేఏసీ నేతలు 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడలిలో దర్జీలు నడిరోడ్డుపై కుట్టు మిషన్లతో నిరసన తెలిపారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, ద్విచక్ర వాహనాలను పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు పాఠశాలలు, వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ సమైక్యాంధ్ర ప్రకటనే ప్రధాన డిమాండ్‌గా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు అక్టోబర్ 11న ఒంగోలులో ‘విద్యుత్ గర్జన’ నిర్వహించనున్నారు. 13 జిల్లాల్లోని విద్యుత్ ఉద్యోగులతో పాటు హైదరాబాద్ విద్యుత్‌సౌధలోని ఉద్యోగులందరూ కుటుంబ సమేతంగా గర్జన కార్యక్రమానికి హాజరు కావాలని గుంటూరులో జరిగిన రాష్ట్ర విద్యుత్ జేఏసీ సమావేశం నిర్ణయించింది. నేడు అనంత రైతు రంకె అనంతపురం: సమైక్యాంధ్ర వాణిని వినిపించేందుకు బుధవారం అనంతపురంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ‘అనంత రైతు రంకె’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
తెలుగుతల్లికి ఉద్యమ హారతి
వరద ఉధృతిని తలదన్నిన ఉద్యమ ఉరవడికి కృష్ణమ్మ చిన్నబోయింది.. మహిషాసుర మర్దనం కంటే ముందుగానే విభజనాసురుల సంహారానికి కదంతొక్కిన సమైక్యశ్రేణుల ధర్మాగ్రహాన్ని చూసి దుర్గమ్మ విస్తుబోయింది.. స్వరాజ్య మైదానం మరో స్వతంత్ర పోరాట పతాకైంది. తెలుగుతల్లిని చెరబట్టిన నిజాంను తరిమికొట్టే యుద్ధతంత్రాలకు, గెరిల్లా దళాల శిక్షణకు నాడు కేంద్రమైన బెజవాడ.. ఆంధ్రప్రదేశ్‌ను నిలువునా చీల్చే సోనియా, కేసీఆర్ దుష్టద్వయ కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టే నేటి కురుక్షేత్ర మహాసంగ్రామానికి కమ్యూనిస్టు రుషి సుందరయ్య వేదిక నుంచి పాంచజన్యం పూరించింది. స్వరాజ్య మైదానంలో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరైన జనసందోహం వెల్లువలా.. : బైక్ ర్యాలీగా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్తున్న సమైక్యవాదులు సేవ్ ఆంధ్రప్రదేశ్.. అంటూ మహిళాలోకం కదం తొక్కింది. సమైక్య నినాదం : జై సమైక్యాంధ్ర అంటున్న మహిళలు విన్యాసం : సభావేదికపై సాంస్కృతిక ప్రదర్శన తెలుగుతల్లికి నృత్య నీరాజనం : వేదికపై చిన్నారుల నృత్య ప్రదర్శన నారీభేరి : సభకు హాజరైన మహిళల సమైక్య నినాదాలు -
సమ్మె విరమణకు ససేమిరా
సాక్షి; హైదరాబాద్: సమైక్యాంధ్ర కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న నిరసనలు 50 రోజులు పూర్తిచేసుకున్నాయి. గురువారం 50వ రోజు నిరసనలను ఉద్యోగులు వినూత్న రీతిలో నిర్వహించారు. సమైక్య గణేశుని పూజించి ర్యాలీగా సాగి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ‘గణేశా.. గణేశా.. రాష్ట్రాన్ని రక్షించు..’ అంటూ నినాదాలతో ర్యాలీ తీశారు. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కూడా గురువారానికి 17వ రోజుకు చేరుకుంది. మరోవైపు రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా నిరవధిక సమ్మె చేపడుతున్న సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి గురువారం సచివాలయంలో చర్చలు జరిపారు. సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతోందని, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీటిని దృష్టిలో ఉంచుకుని వెంటనే సమ్మె విరమించాల్సిందిగా ఉద్యోగులను కోరారు. అయితే సీఎస్ అభ్యర్థనను సచివాలయ ఉద్యోగులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకూ సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు సీఎస్‌కు స్పష్టం చేశారు. సమ్మె కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రజా పంపిణీ వ్యవస్థ పనిచేయక పేదలకు నిత్యావసర సరుకులు అందడం లేదని ఉద్యోగులకు సీఎస్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లకు ఆటంకం కలుగుతోందని, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. సమస్యలను మంత్రివర్గ ఉపసంఘానికి వివరించి పరిష్కారం పొందవచ్చని సూచించారు. అయితే రాష్ట్ర విభజనతో ఉద్యోగులే కాకుండా సీమాంధ్ర విద్యార్థులు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారని, సామాజిక బాధ్యతతో తాము సమ్మె చేపడుతున్నామని ఉద్యోగులు సీఎస్‌తో చెప్పారు. ఇలా ఎన్ని రోజులు సమ్మె కొనసాగిస్తారని సీఎస్ ప్రశ్నించగా రాష్ట్ర విభజన ప్రక్రియ నిలిపి వేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకూ కొనసాగిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సమ్మె రోజులకుగాను తాము జీతం కూడా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో ఎన్ని రోజులు సమ్మె కొనసాగినా వేతనాలు కోరబోమన్నారు. 25న ఢిల్లీకి సీమాంధ్ర ఉద్యోగులు.. సమైక్య ఆందోళనలను దేశ రాజధానికి విస్తరించాలని నిర్ణయించిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు అందులో భాగంగా 25న ఢిల్లీ పయనమవుతున్నారు. వరుసగా 3 రోజులపాటు రాజధానిలో వివిధ రూపాల్లో నిరసనలు తెలపాలని నిర్ణయించినట్టు సచి వాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య చెప్పారు. గురువారం సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ నిరసనల ప్రణాళికను వెల్లడించారు. ఏపీఎన్జీవోల సమ్మెపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో నిర్వహించనున్న సమావేశానికి తమను ఆహ్వానిస్తే వెళ్లి సమస్యలను చెప్పుకుంటామన్నారు. సీమాంధ్ర ఉద్యోగులందరం పెద్ద సంఖ్యలో ఢిల్లీ వెళ్తామని చెప్పారు. 27న జంతర్‌మంతర్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించామని, ఈ ధర్నాకు బీజేపీ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీల అధ్యక్షులు, జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తామన్నారు. చర్చలకు రండి మంత్రివర్గ ఉపసంఘం ఆహ్వానం సభ ఉన్నందున రాలేమన్న సంఘాలు రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టిన సీమాంధ్ర ఉద్యోగ సంఘాలను మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఆహ్వానించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో చర్చలు జరుగుతాయని తెలిపింది. అయితే శుక్రవారం విజయవాడలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ జరుగుతున్నందున చర్చలకు రాలేమని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఆదివారం అయితే చర్చలకు వస్తామని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. -
సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలి : వీ లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కో-ఆర్డినేటర్ లక్ష్మణరెడ్డి పెనుమంట్ర, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని అసెంబ్లీని సమావేశపర్చి సమైక్యాంధ్రపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కో-ఆర్డినేటర్ వీ లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జన గోదావరి సభలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించాలని కోరారు. వైఎస్సార్సీపీ సమైక్య శంఖారావాన్ని పూరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులు తక్షణమే పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి నాయకత్వం వహించాలని, రాజకీయ నాయకులు పరస్పర దూషణలు వీడి ఉద్యమంలో మమేకం కావాలని ఆయన కోరారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు సమైక్యవాదానికి మద్దతు పలకాలన్నారు. హైదరాబాద్‌లో సమైక్యవాదులు నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికను చూపించలేకపోతున్నందున విభజన జరగబోదని లక్ష్మణరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. -
డెడ్ లైన్..18
వైవీయూ, న్యూస్‌లైన్: ఈ నెల 18వ తేదీలోపు మంత్రులతో పాటు పార్లమెంట్ సభ్యుడు సాయిప్రతాప్ రాజీనామా చేయాలని హెచ్చరిక పేరుతో రూపొందించిన పోస్టర్‌ను వారి ఇళ్లకు అతికించారు. సోమవారం నగరంలోని ఏడురోడ్ల కూడలి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీబైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యనినాదాలు చేస్తూ తొలుత మంత్రి సి. రామచంద్రయ్య ఇంటివద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ‘హెచ్చరిక’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఇంటికి అతికించారు. సమైక్యద్రోహులు మంత్రులు రాజీనామాలు చేయాలంటూ నినదించారు. అనంతరం మంత్రి అహ్మదుల్లా ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటికి పోస్టర్లు అతికించారు. మంత్రి తనయుడు అషఫ్త్రో సమైక్యవాదులు వాగ్వాదానికి దిగారు. సమైక్యవాదులుగా ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. అక్కడి నుంచి రాజంపేట ఎంపీ సాయిప్రతాప్ ఇంటివద్దకు వెళ్లారు. అక్కడ ఆయన ఇంటికి, కారుకు స్టిక్కర్లు అతికించారు. మంత్రులు, ఎంపీలు రాజీనామాలు ఆమోదింపచేసుకుని సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. లేనిపక్షంలో ప్రజాప్రతినిధుల ఇంటి వద్దే దీక్షలకు పూనుకుంటామన్నారు. పోలీసులతో వాగ్వాదం.. బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న సమైక్యవాదులను సీఐ శివన్న ఆధ్వర్యంలో పోలీసులు ఆడ్డుకునే యత్నం చేశారు. దీనికి సమైక్యవాదులు ప్రతిఘటించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఉద్యమాలు ఎలా చేస్తారంటూ సీఐ ప్రశ్నించడంతో సమైక్యవాదులు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉద్యమాలను ఖాకీజులుంతో అణగదొక్కాలని చూస్తే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు శ్రీనివాసులు, జయరామయ్య, బాలశౌరిరెడ్డి, జమాల్‌రెడ్డి, గంగాధర్, తిరుపాల్, నరసారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, చెన్నకేశవరెడ్డి, శ్రీనివాసులు, రామ్మూర్తి, శంకరయ్య, రవిశంకర్‌రెడ్డి, దామోదర్, శ్రీనివాసయాదవ్, పి.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత యాత్రపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ ఏ జిల్లా నుంచి చేపట్టాలన్న అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాశాకే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయాన్ని వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని ఏ జిల్లా పర్యటనకు వెళితే ఎలాంటి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అధినేతతోసహా టీడీపీ ముఖ్య నేతలందరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బస్సుయాత్ర మొదట విడతలోనే పశ్చిమగోదావరి జిల్లాలో బాబు పర్యటిం చాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమకారుల నుంచి నిరసనలు ఎదురయ్యే ప్రమాదముందని జిల్లానేతలు సూచిం చినందున ఆ జిల్లాకు వెళ్లకుండానే మొదట విడత యాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో రెండోవిడత యాత్రకు వెళ్లాలన్న యోచనతో ఉన్న చంద్రబాబు శుక్రవారం తన నివాసంలో పార్టీ నేతలతో చర్చించా రు. ప్రస్తుతం పార్టీకి ఏ జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయన్న దానిపై చర్చించారు. ప్రకాశం, నెల్లూరుతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ మేరకు చేయగలుగుతామో పరిశీలించి రూట్‌మ్యాప్‌లు ఖరా రు చేయాలని సూచించారు. ఒక్కో విడతలో రెండు జిల్లాల్లో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అధినేత ఢిల్లీ పర్యటన తర్వాతే రెండో విడత బస్సు యాత్ర మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సోమవారం తరువాతే ఢిల్లీ యాత్ర: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సోమవారం తర్వాతే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతల సమావేశంలో ఢిల్లీ యాత్ర వివరాలపైనా చర్చ జరిగింది. ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులతోపాటు వివిధ పార్టీల జాతీయ నేతల అపాయింట్మెంట్లపై నేతల్ని బాబు ఆరా తీశారు. ఆర్థిక సంక్షోభం పై ఢిల్లీలో పార్టీపరంగా సదస్సు నిర్వహించాలన్న యోచనపై చర్చించారు. భేటీలో నేతలు కె.రామ్మోహనరావు, గరికపాటి రామ్మోహనరావు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. -
విద్యుత్ సమ్మె షాక్
సాక్షి, నెట్వర్క్ : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ జేఏసీ 72 గంటల సమ్మె పిలుపుతో సీమాంధ్రలోని పలు జిల్లాల్లో అంధకారం నెలకొంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం అర్ధరాత్రి నుంచే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వర్షంతో మోటార్లు నీటమునిగి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన కర్నూలు జిల్లాలోని ఆర్టీపీపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో మరమ్మతు పనులు జరగలేదు. దీంతో గురువారం కూడా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 1490 మంది ఉద్యోగుల్లో 90 మంది మాత్రమే విధులకు హాజరయ్యారు. వారిలో కూడా సీఈ, ఎస్ఈ అధికారులే అధికంగా ఉన్నారు. విధులకు హాజరవుతున్న ఉద్యోగులను జేఏసీ నాయకులు గేట్ బయటనే అడ్డుకున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం కర్నూలు జిల్లాలోని శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేందుకు కొందరు ఉద్యోగులు విఫలయత్నం చేశారు. కరెంట్ ఉత్పాదనకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను పవర్‌హౌస్ వద్ద నియమించడంతో ప్రభావం అంతగా కన్పించలేదు. విజయవాడ ఎన్టీటీపీఎస్లో ఎక్కువమంది సమ్మెలోకి వెళ్లడంతో విద్యుత్ ఉత్పాదనపై ప్రభావం చూపింది. గురువారం ఉదయం 6 గంటలకే థర్మల్ కేంద్రం మూడు గేట్లను మూసేశారు. విద్యుత్ జేఏసీ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ గురువారం డిస్కమ్ జేఏసీ చైర్మన్ అశోక్, కన్వీనర్ డీఈ మునిశంకరయ్య ఆధ్వర్యంలో తిరుపతిలోని డిస్కమ్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలోని డిస్కమ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పరిశ్రమలలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఎన్టీటీపీఎస్ జేఏసీలో చీలిక! ఎన్టీటీపీఎస్లో 72 గంటలపాటు సమ్మెలోకి దిగిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. గురువాం రాత్రి కొందరు ఉద్యోగులు డ్యూటీకి హాజరయ్యారు. సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులు వారితో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో గేట్ల వద్ద పోలీసు బలగాను, ఎన్టీటీపీఎస్ భద్రతా సిబ్బందిని నియమించి లోపలకు వచ్చే ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. జేఏసీలో ఎలాంటి చీలిక రాలేదని జెన్కో జేఏసీ చైర్మన్ టి. శ్యాంసుధాకర్ స్పష్టంచేశారు. -
సమైక్యానికి కట్టుబడితే లేఖ వెనక్కు తీసుకోండి: మైసూరారెడ్డి
టీడీపీకి మైసూరారెడ్డి డిమాండ్ కాంగ్రెస్ నేతలు పదవులకు రాజీనామా చేయాలి అధిష్టానాన్ని ఒత్తిడి చేయకుండా డ్రామాలెందుకు? దాడులు అమానుషం, తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టయితే రాష్ట్రాన్ని విభజించాలని, ఆ పార్టీ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నప్పుడే ఆ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకున్నట్టవుతుందని చెప్పారు. రాష్ట్ర విభజనపై టీడీపీ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకుంటుందా? లేక అదే విధానానికి కట్టుబడి ఉంటుందా? ఏదో ఒకటి ప్రజలకు తెలియజేసి తన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. అలాగే కాంగ్రెస్ మంత్రులు, ఇతర నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా తమ అధిష్టానవర్గంపై ఒత్తిడి తెచ్చి తమ విజ్ఞతను చాటుకోవాలని సూచించారు. ఏపీఎన్జీవోలు నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభలో పాల్గొని తిరిగి వెళుతున్న సందర్భంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన దాడిలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి, కాకినాడకు చెందిన కట్టా సత్యనారాయణ గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మైసూరారెడ్డితోపాటు పార్టీ నేతలు బి.గురునాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మేరుగ నాగార్జున మంగళవారం ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైసూరారెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడారు. విభజనపై నీ అభిప్రాయం చెప్పు బాబూ... టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్లి సింహగర్జనలు చేసే బదులు విభజనపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రం వద్ద ఒక రకంగా చెప్పి, ప్రజల్లోకి వెళ్లి మరోరకంగా మాట్లాడటం రెండు నాల్కల ధోరణి అవుతుందే తప్ప మరొకటి కాదని విమర్శించారు. బాబు తన లేఖను వెనక్కి తీసుకోకుండా, కాంగ్రెస్ మంత్రులు అధిష్టానంపై ఒత్తిడి చేయకుండా ఉంటే... వాళ్లు కుమ్మక్కయి డ్రామాలు ఆడుతున్నారనేది స్పష్టం అవుతుందని చెప్పారు. ఈ రెండు పార్టీలూ ఇలాగే వ్యవహరిస్తే ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు మరింత రగిలి దుష్పరిణామాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభ సందర్భంగా తలెత్తిన హింసాత్మక ఘటనలకు మూలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా సమావేశాలు జరుపుకుని తమ అభిప్రాయాలు చెప్పుకోవచ్చని, కానీ ఇలాంటి దాడులనేవి అమానుషమని, ఈ దాడిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. ఒంటెత్తు పోకడలతో ఏకపక్షంగా సీట్ల కోసం, ఓట్ల కోసం నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయన్నారు. ఇప్పటివరకూ ఓ రకంగా మాట్లాడుతూ వచ్చిన మంత్రులు, ఇపుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజీనామాలు చేసి అధిష్టానంపై ఒత్తిడి తేకుండా అసెంబ్లీలో తీర్మానం వచ్చినపుడు ఓడించడానికే సభ్యులుగా కొనసాగుతామని మంత్రులు చెప్పడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్-3 ప్రకారం భారత రాష్ట్రపతి కోరే తీర్మానం కేవలం శాసనసభ వైఖరి తెలుసుకోవడానికేనని, ఉత్తరప్రదేశ్ మాదిరిగా అసెంబ్లీ తీర్మానం పెట్టి కేంద్రానికి తమ అభిప్రాయం తెలియజేయడానికి ఇపుడున్న అడ్డంకులు ఏమీ లేవని మైసూరా స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియం సభలో పోలీసు కానిస్టేబుల్‌పై దౌర్జన్యం జరిగిందనే విషయాన్ని ప్రస్తావించగా... శాంతి భద్రతలు పరిరక్షించే విధుల్లో ఉన్న వ్యక్తి ఆ విధంగా నినాదాలు చేయడం సబబేనా? అని ప్రశ్నించారు. అది ఆయన విజ్ఞతకు, ఆయనకు మద్దతునిస్తున్న వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. సభ సందర్భంగా ఉద్యోగులు రెచ్చగొట్టారనే ఆరోపణలపై ప్రశ్నించగా... ఎవరు ఎవరిని రెచ్చగొట్టారు? ఒకరు సభ జరుపుకునేటపుడు మరొకరు అంతరాయాలు కలిగించడం సరికాదు కదా? అని ఆయన బదులిచ్చారు. -
జజ్జనకరి... జనాలే.. జనసంద్రంలా సీమాంధ్ర
స్వచ్ఛంద ఉద్యమానికి 37రోజులు సమైక్య భావనతో ఉప్పొంగుతున్న హృదయాలు అందరి నోటా ఒకే మాట...తెలుగుజాతిని చీల్చవద్దు... సాక్షి, నెట్వర్క్ : రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్రను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని రోడ్డుపైనే నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు సామూహికంగా సెలవులపై వెళ్లారు. దీంతో కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సమైక్యాంధ్ర చేపట్టిన దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు గురువారం 37వ రోజూ ఉధృతంగా కొనసాగాయి. అనంతపురం జిల్లా పామిడిలో సకల జనుల సమైక్య గర్జనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు తమ జీతాలను, జీవితాలను పణంగా పెట్టి సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తోంటే కాంగ్రెస్, టీడీపీ నేతలు విందులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మడకశిరలో మాదిగలు నిర్వహించిన సింహగర్జన సమైక్య ర్యాలీలో ఎమ్మెల్యే సుధాకర్‌ను రాజీనామా చేయాలంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరులో ఉపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటాలతో ర్యాలీలు, రాస్తారోకోలు నిర్వహించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది సామూహిక సెలవుపై వెళ్లారు. చంద్రగిరి మండల ప్రజలు రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. నెల్లూరులో కేసీఆర్‌ను వలవేసి పట్టుకున్నట్లుగా వినూత్న నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో బంద్ పాటించారు. ఆమదాలవలసలో ఉపాధ్యాయుల దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే సత్యవతిని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు కూడా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని ఎమ్మెల్యే అనడంతో గందరగోళం నెలకొంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఉపాధ్యాయులు రోడ్లపైనే గురుపూజోత్సవాన్ని జరుపుకుని నిరసన తెలిపారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపైనే విద్యార్థులు భోజనాలు చేయగా, బద్వేలు పట్టణంలో బ్రాహ్మణులు రోడ్డుపైనే చండీయాగం చేపట్టారు. విశాఖలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుల్ని సన్మానించారు. కె.కోటపాడు విద్యార్థులు భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. కర్నూలులో విద్యుత్ ఉద్యోగులు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, రాష్ర్ట మంత్రి టీజీ వెంకటేష్ ఇళ్లను ముట్టడించారు. జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, షిండే, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను దున్నపోతులపై ఊరేగించారు. విజయవాడలో సీమాంధ్ర కాలేజీ యాజమాన్యాల జేఏసీ ఆధ్వర్యంలో వన్‌టౌన్‌లో రోడ్ల దిగ్బంధన నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కిలోమీటరుకు పైగా టెంట్లువేసి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ‘గురువుల మహాదీక్ష’ చేపట్టారు. పాలకొల్లులో మునిసిపల్ ఉద్యోగులు ‘సమైక్యాంధ్ర నగర సంకీర్తన’ చేపట్టారు. గోదావరి డెల్టా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ నుంచి ధవళేశ్వరం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించిన రైతులు కాటన్బ్యారేజీని ముట్టడించారు. ఇన్నీసుపేటలో విద్యార్థులు రోడ్డుపైనే గురుపూజోత్సవం నిర్వహించి, అధ్యాపకులను సన్మానించారు. 23 రకాల పప్పుధాన్యాలతో ఆంధ్రప్రదేశ్ చిత్రపటాన్ని అంగన్వాడీ వర్కర్లు రూపొందించారు. 48గంటల కోనసీమ బంద్ తొలిరోజు విజయవంతమైంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో గోవులతో నిరసన ర్యాలీ చేపట్టారు. మార్కాపురంలో పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది మేకలు, గొర్రెలతో భారీర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా శుక్రవారం నుంచి ఆందోళన చేపడుతున్నట్లు విద్యుత్ ఉద్యోగులు కాకినాడలో ప్రకటించారు. అలాగే, 6,200 మంది ఈపీడీసీఎల్ ఉద్యోగులు గురువారం సామూహిక సెలవు పెట్టి విధులను బహిష్కరించారు. తెర్లాంలో 500 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీలో వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుజయ్ కృష్ణారంగారావు పాల్గొన్నారు. మరో ఆరుగురు మృతి రాష్ట్ర విభజన నిర్ణయంపై కలతతో భావోద్వేగానికి గురైన ఐదుగురు గురువారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మరోవైపు, గతనెల 4న ఆత్మహత్యకు యత్నించిన సారెడ్డి రామాంజుల రెడ్డి (35) గురువారం మృతి చెందాడు. సమైక్య ఉద్యమంలో చురుగ్గా పొల్గొంటున్న ఇతను ఆ రోజు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. సీఎం రాజీనామా చేయాలి తిరుపతి: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రులు, సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సీమాంధ్ర విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో గురువారం సీమాంధ్ర విశ్వ విద్యాలయాల విద్యార్థి సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎంతో సహా ఇతర మంత్రులు ఈ నెల 11లోగా రాజీనామాలు చేసి తమతో కలసి ఉద్యమాల్లో పాల్గొనాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయకపోతే 12నుంచి వారి నివాసాల వద్ద రిలే దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రమంత్రి చిరంజీవి కూడా రాజీనామా చేయూలని, లేదంటే ఆయన కుటుంబ సభ్యుల చిత్ర ప్రదర్శనలను అడ్డుకుంటామని హెచ్చరించారు. నిరసనకారులపై అక్రమ కేసులను ఎత్తివేయూలని డిమాండ్ చేవారు. ఈ సమావేశం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు హరికృష్ణయూదవ్, కన్వీనర్ సుధారాణి ఆధ్వర్యంలో జరిగింది. సమైక్య ‘సాగర ఘోష’ సీమాంధ్రలో గళమెత్తిన లక్షలాది జనం సాక్షి, నెట్వర్క్ : జై సమైక్యాంధ్ర అంటూ లక్షలాది గొంతుకలు గళమెత్తాయి. గురువారం కాకినాడలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో లక్ష జనగళ సమైక్య సాగర ఘోష నిర్వహించారు. పార్టీ రహితంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలతో కాకినాడ జనసాగరమైంది. ప్రజాగాయకుడు వంగపండు ప్రసాద్ సమైక్యాంధ్ర పాటలతో ప్రజలను ఉత్తేజపర్చారు. దేశ నాయకుల వేషధారణతో పలువురు ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ‘ప్రొద్దుటూరు పొలికేక’కు లక్ష మందికిపైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగ పండు ఉష ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి విశాలాంధ్ర ప్రధాన కార్యదర్శి పరకాల ప్రభాకర్ ప్రధాన వక్తగా హాజరయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరులో సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమైక్య సింహగర్జన జరిగింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది జనం హాజరై సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో సన్‌ఫ్లవర్ విద్యాసంస్థలు, జేఏసీ, మీడియా ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన లక్షగళ గర్జనతో రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో లక్ష జనగళ ఘోష, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో లక్ష గళార్చన శంఖారావం, చిత్తూరు జిల్లా పీలేరులో విద్యార్థి సమైక్య సింహగర్జన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ సెంటర్లో సింహగర్జన జరిగింది. -
వారి సభకు అనుమతివ్వొద్దు: టీ అడ్వకేట్ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈనెల 7వ తేదీన ఏపీఎన్జీవోలు తలపెట్టిన సమైక్యసభకు అనుమతి ఇవ్వవద్దని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు పోలీసు ప్రధాన కార్యాలయంలో అదనపు డీజీ ఎస్.గోపాల్‌రెడ్డిని సోమవారం కలసి వినతిపత్రం సమర్పించారు. కొందరు పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు సమైక్య నినాదం తో హైదరాబాద్‌లో సభలు పెట్టించడం ద్వారా ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జేఏసీ నాయకులు సీహెచ్ ఉపేంద్ర, కె.గోవర్ధన్‌రెడ్డి, జనార్దనగౌడ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు అదనపు డీజీని కలిసిన వారిలో ఉన్నారు. ఆంధ్రుల సభను అడ్డుకుంటాం: పిడమర్తి రవి 7వ తేదీన సీమాంధ్రులు నగరంలో నిర్వహించ తలపెట్టిన సభను అడ్డుకుంటామని టీఎస్, ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు తెలిపారు. సోమవారం ఓయూ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణను అడ్డుకుంటే భౌతిక దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ నెల 4న అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఎమ్మిగనూరులో భారీ ర్యాలీ
సాక్షి, కర్నూలు:సమైక్య ఉద్యమం రగులుతోంది. విభజన నిర్ణయంపై సీమ మహోగ్రరూపం దాలుస్తోంది. తెలుగు ప్రజలను చీల్చే కుట్రపై పోరు ఉద్ధృతమవుతోంది. నిరసనలు మిన్నంటుతుండగా.. సమైక్యగళం హోరెత్తుతోంది. ఉ ద్యోగులు విరామం లేని పోరు సాగిస్తుండగా.. విద్యార్థి లోకం కదం తొక్కుతోంది. ఆదివారం రోజునా జిల్లా వ్యాప్తంగా సమైక్య నినాదం మారుమ్రోగింది. కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు కర్నూలు జిల్లా గౌండ కాంట్రాక్టర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు డ్రమ్ములు, తప్పెట్లతో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నృత్యప్రదర్శన సమైక్యవాదులను ఆకట్టుకుంది. ప్రభుత్వ డ్రైవర్ల సంఘం వినూత్న రీతిలో దిగ్విజయ్‌సింగ్ శవయాత్ర చేపట్టి రాష్ట్ర విభజన నిర్ణయంపై నిరసన వ్యక్తం చేసింది. విభజనకు నిరసనగా నేడు కర్నూలులో ఆటోల బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. కర్నూలు జిల్లా చౌకడిపో డీలర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఆదోనిలో రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టాన్ని జేఏసీ నాయకులు ప్రజలకు వివరించారు. ఫుట్‌వేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సర్కిల్లో చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. ఆలూరులో జేఏసీ ఆధ్వర్యంలో రేషన్‌షాపుల డీలర్లు ఆందోళన చేపట్టారు. ఆళ్లగడ్డ పట్టణంలో జేఏసీ నాయకులు.. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ నేత బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. తాపీ మేస్త్రీ, సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమైక్యవాదులు కర్నూలు-గుంటూరు రహదారిని దిగ్బంధించారు. బేతంచర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పాణ్యంలో మైనార్టీలు, వాల్మీకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. డోన్ పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లు, కొచ్చెర్వు గ్రామస్తులు, ఆటోవర్కర్స్ యూనియన్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప నగర్‌కు చెందిన క్యాబర్సి శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరుకుంది. మంత్రాలయం మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకారెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కుమార్తె గౌతమిరెడ్డిలు ఆయనకు సంఘీభావం తెలిపారు. విభజనను వ్యతిరేకిస్తూ మండల పరిధిలోని గుడేకల్లు గ్రామ ప్రజలు పట్టణంలో ఎద్దుల బండ్ల ర్యాలీ, కేసీఆర్ శవయాత్రను నిర్వహించారు. పద్మశాలి సంఘం, బండలు, టైల్స్ డిపోల ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించి సోమప్ప సర్కిల్లో మానవహారంగా ఏర్పడ్డారు. -
అడుగడుగునా అడ్డగింత
సాక్షి నెట్వర్క్ : సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర సెగ తగిలింది. సంఘీభావం పేరుతో దీక్షా శిబిరాల వద్దకు వచ్చిన నేతలను ఉద్యమకారులు అడుగడుగునా అడ్డుకున్నారు. రాజకీయాలు చేయొద్దు..రాజీనామాలు చేసి రండి అంటూ ఘెరావ్ చేశారు. కొద్దిమంది నాయకులు చేసేది లేక అక్కడి నుంచి వెనుదిరగగా.. మరికొందరు మాత్రం ఉద్యోగులను మీరూ రాజీనామా చేయండి మేం చేస్తామంటూ ప్రగల్బాలు పలికారు. దీంతో మరింత కోపోద్రిక్తులైన ఆందోళనకారులు వారిని అక్కడి నుంచి తరిమికొట్టేంత పనిచేశారు. లగడపాటితో లడాయి.. సమైక్యాంధ్ర పేరుతో చీటికిమాటికీ మీడియా సమావేశాలు పెడుతూ తానే మొదటి సమైక్య చాంపియన్ అని గొప్పలు చెప్పుకునే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు ఉద్యమకారుల నుంచి లడాయి తప్పలేదు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలిపేందుకు శనివారం యూనివర్సిటీకి వచ్చిన ఆయన్ను సమైక్యాంధ్ర విద్యార్థి, ఉద్యోగ జేఏసీ నాయకులు యూనివర్సిటీ గేట్ వద్దే అడ్డుకున్నారు. లగడపాటి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆయన విద్యార్థులకు ఎంతగా నచ్చజెప్పాలని చూసినా వారు విన్పించుకోలేదు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మీకు ముందే తెలుసుకదా.. ప్రజలకు ఎందుకు తెలియజేయలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిరాహారదీక్షా శిబిరం వద్దా అదే పరిస్థితి ఎదురైంది. లగడపాటి వెళ్లిపోవాలని కొందరు విద్యార్థులు దీక్షా శిబిరం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇక చేసేది లేక ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకు దిగారు. తాము మనసు చంపుకుని ఆ పార్టీలో ఉంటున్నామంటూ చెప్పుకొచ్చారు. ఉద్యమకారుల ‘విశ్వరూప’ం తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లిలో రిలేదీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రాష్ర్టమంత్రి పినిపే విశ్వరూప్‌ను సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అనుయాయులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవిని మామిడికుదురు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ఉద్యోగులు ఘెరావ్ చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటారు’ అంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ చేసి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎమ్మెల్యేను రెండుసార్లు అడ్డుకున్న జేఏసీ ప్రతినిధులు ‘ఎమ్మెల్యే గో బ్యాక్, ఎమ్మెల్యే డౌన్ డౌన్, ఎమ్మెల్యే రాజీనామా’ చేయాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలపై జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో జీవీఎంసీ నుంచి సౌత్జైలు రోడ్డు వద్దకు చేరుకున్న ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ సమైక్య ర్యాలీకి అదే మార్గంలో వెళుతున్న రాజ్యసభ సభ్యుడు మద్దతు తెలిపేందుకు కారు దిగారు. దీంతో కొంతమంది యువకులు ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలోకి రావాలని నినాదాలు చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, డోన్ ఎమ్మెల్యే కేఈ కష్ణమూర్తిని జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. సమైక్యవాదులతో జే‘ఢీ’ గుంటూరు జిల్లా తెనాలిలోని జేఎంజే మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి జేడీ శీలంను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఆయన మంత్రుల రాజీనామా కోరే అధికారులెందుకు రాజీనామా చేయడం లేదని ఎదురు ప్రశ్నించడంతో వాదులాట జరిగింది. కేబినెట్లో ఉండి సమైక్యవాదుల ప్రతినిధిగా ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని చెప్పినా సంతప్తి చెందని సమైక్యవాదులు ఆయనను ఘెరావ్ చేశారు. -
సమైక్యహారం.. అపూర్వ మానవహారం
చేతులు కలిశాయి.. సత్తా చూపాయి.. కలిసికట్టుగా సమైక్యాంధ్ర ఆకాంక్షను చాటాయి. శ్రీకాకుళం జిల్లా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సమైక్యభావం వెల్లివిరిసింది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారి(ఎన్‌హెచ్-16)పై శ్రీకాకుళం జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం నుంచి చివరన ఉన్న ఇచ్ఛాపురం వరకు సుమారు 176 కిలోమీటర్ల పొడవునా అపూర్వ మానవహారం నిర్మించారు. పల్లె, పట్టణం.. ఉద్యోగులు, సామాన్యులు, కర్షకులు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఉదయం 9 గంటలకే జాతీయ రహదారిపై చేరుకొని 10 నుంచి 11 గంటల వరకు చేతులు కలిపి మానవహారంగా ఏర్పడ్డారు. సాక్షి నెట్వర్క్ : సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ అలుపెరుగని పోరు సాగుతున్న పోరు శనివారం నాటికి 32రోజులకు చేరింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలు, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మల దహనాలతో ఉద్యమకారులు హోరెత్తించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరాలరేవు ఆవరణలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ రమేష్ బాబు ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం రాష్ట్ర అర్చక సమాఖ్య శాంతి హోమం నిర్వహించింది. కృష్ణా జిల్లా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో విదార్థి జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. తిరువూరులో సమైక్య జనగళం పేరిట వేలాది మంది జనం నదించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో కలెక్టరేట్ ఎదుట సమైక్యాంధ్రకు మద్దతుగా సంతకాల సేకరణ జరిగింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అధికారులు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయరహదారిని దిగ్బంధం చేశారు. సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించి అక్కడే రోడ్డుపై వంటవార్పు నిర్వహించి భోజనాలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులోని పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో బల్లకట్టుపై రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పాలకొల్లులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో 80 కిలోమీటర్ల బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో మూడు వేల మంది ఉద్యోగులు సోనియా గాంధీకి ఉత్తరాలు రాశారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు పోలీసు ఐలండ్ సెంటర్లో హోమం చేశారు. గుంటూరులో చాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు 48గంటల జిల్లా బంద్ రెండోరోజు శనివారం కూడా విజయవంతమైంది. కర్నూలు జిల్లా నంద్యాలలో లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 200 లారీలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. డోన్‌లో కురువ సంఘం ఆధ్వర్యంలో ఒంటెలతో ర్యాలీ చేపట్టారు. ఏపీఎన్జీవోస్, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో నిర్వహించిన సకల జనుల గళం విజయవంతమైంది. విశాఖపట్నంలో ముస్లీం జేఏసీ ఆధ్వర్యంలో ఒంటెలు, గుర్రాలతో ర్యాలీ చేపట్టి జీవీఎంసీ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విజయనగరంలో శనివారం సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకు జిల్లావ్యాప్తంగా గృహ వినియోగదారులతో పాటు వ్యాపార, వాణిజ్యవర్గాలు స్వచ్ఛందంగా కరెంటు వినియోగం నిలిపివేశాయి. సమైక్య విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో ఉన్న వీధి దీపాలను కూడా రెండు గంటల పాటు ఆర్పివేయడంతో జిల్లా మొత్తం అంధకారం అలముకుంది. సీతానగరంలో జేఏసీ ఆధ్వర్యంలో 15కిలోమీటర్ల మేర మానవహారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటిలో 30 మంది విశ్రాంత ఉద్యోగులు నిరాహారదీక్ష చేపట్టారు. వీరఘట్టంలో 20 వేల మందితో ఉపాధ్యాయ, ఆర్టీసీ ఐక్యకార్యచరణ సమితి ఆధ్వర్యంలో సకలజనగళం నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాష్ట్రం ముక్కలైతే భవిష్యత్తరాలకు గంజి కూడా దొరగదంటూ అనంతపురం జిల్లా కణేకల్లులో గంజి పంపిణీ చేసి ఎన్జీఓలు నిరసన వ్యక్తం చేశారు. మార్మోగిన కడప కడప, న్యూస్‌లైన్ : సమైక్య నినాదంతో కడప నగరం మార్మోగింది. సమైక్య పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించిన సభకు వైఎస్సార్ జిల్లా నలుమూలల నుంచి లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ట్రాఫిక్ నియంత్రణ పేరుతో పోలీసులు నగరాన్ని దిగ్బంధించినా సమైక్యవాదులు లెక్కచేయలేదు. ప్రతిఒక్కరూ సమైక్యనినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే వేదిక వద్ద కూడా పోలీసులు ఆంక్షలు విధించడంతో జేఏసీ నేతలు ఆగ్రహంతో ఊగి పోయారు. ఓ దశలో కడప డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డిపై చేయి చేసుకున్నంత పనిచేశారు. పోలీసులు మైదానాన్ని వదలివెళ్లాలని నినాదాలు చేశారు. డీఎస్పీ, ఎస్పీ ఇళ్లకు విద్యుత్, నీరు కట్‌చేయడంతో పాటు పారిశుద్ధ్ద్యాన్ని కూడా నిలిపి వేస్తామని హెచ్చరిం చారు. పోలీసు అధికారులు చివరికి దిగివచ్చారు తామేమీ ఆటంకం కలిగించబోమని ప్రొద్దుటూరు, మైదుకూరు డీఎస్పీలు శ్రీనివాసులురెడ్డి, చల్లా ప్రవీణ్‌కుమార్ ఉద్యమకారులకు సర్దిచెప్పారు. సభలో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక అధ్యక్షుడు, అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటం కోసం దేనికేనా సిద్ధమేనని ప్రకటించారు. 12 నుంచి అంధకారమే ఉద్యమాన్ని తీవ్రం చేయాలని విద్యుత్ ఉద్యోగుల నిర్ణయం ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : సమైకాంధ్ర ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసేందుకు 12 నుంచి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని విద్యుత్ ఉద్యోగులు నిర్ణయించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్ఏ కాలనీలో శనివారం సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల (జేఏసీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13 జిల్లాలకు చెందిన జెన్కో, డిస్కం, ట్రాన్స్‌కో, ఏపీఎస్పీడీసీఎల్లకు చెందిన ఉద్యోగులు హాజరయ్యారు. సమైకాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ సీమాంధ్రలో ఇంత పెద్దఎత్తున ఉద్యమం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండడం వల్లే 12 నుంచి సమ్మెలో దిగుతున్నట్లు తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 4 వరకు వర్క్‌టూరూల్, 5న మూకుమ్మడి సెలవులు, 6న పెన్‌డౌన్, టూల్‌డౌన్, 7న ఛలో హైదరాబాద్ విద్యుత్ సౌధ, 8, 9, 10 తేదీలలో సహాయ నిరాకరణ చేపడతామన్నారు. 11న సిమ్‌కార్డులను యాజమాన్యాలకు అప్పగించి 12 నుంచి సమ్మెలోకి దిగుతామన్నారు. తాము ఉద్యమంలో పాల్గొంటే రాష్ర్టంతోపాటు, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అంధకారం నెలకొంటుందన్నారు. 2 నుంచి ప్రజాప్రతినిధుల ఇళ్లకు ఉన్న విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
ఒకేరోజు రెండు సభలకు అనుమతి వద్దు : కె. నారాయణ
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర, తెలంగాణ వాదులు వచ్చే నెల ఏడున హైదరాబాద్‌లో తలపెట్టిన సభలకు అనుమతి ఇస్తే శాంతిభద్రతల పరిస్థితి తలెత్తవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ రెండు వర్గాల్లో ఎవరికి అనుమతి ఇచ్చినా ఇబ్బందేనన్నారు. రాష్ట్రప్రభుత్వం నియంత్రించగలిగే స్థితిలో ఉంటే వేర్వేరుగా అనుమతులివ్వాలని సూచించారు. ఆయన గురువారమిక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇరుప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగడానికి కేంద్రమే కారణమన్నారు. ఒకవైపు సీఎంను, మరోవైపు ఉప ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌సహా రాష్ట్రాన్ని శ్మశానవాటికగా మార్చాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో జరిగే ఘర్షణలకు కేంద్రమే బాధ్యత వహించాలన్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రజలు రాజకీయ నాయకుల్ని నమ్మే పరిస్థితి లేదని, అందువల్లే లగడపాటి తదితరులపై రాళ్ల దాడులని ఆయన చెప్పారు. -
సమైక్య ఉద్యమంపై చంద్రబాబు అనుమానం
సాక్షి, హైద రాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమంపై తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అనుమానమొచ్చింది. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమం నిజంగానే అంత తీవ్రస్థాయిలో ఉందా? లేదా తెరవెనుక ఎవరైనా నడిపిస్తున్నారా? ఉద్యమ ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై ఆరా తీయాల్సిందిగా పార్టీ నేతలను ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీలు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచే సీమాంధ్ర ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమం ప్రారంభమైంది. అది రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దీంతో పత్రికలు, టీవీ చానళ్లు కూడా ఉద్యమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. అయితే ఇది అసలైన ఉద్యమమేనా? లేక కేవలం మీడియా కావాలని అత్యధిక ప్రాధాన్యతనిస్తోందా? అని చంద్రబాబుకు అనుమానం వచ్చింది. దీంతో ఉద్యమం నిగ్గు తేల్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేతలకు అప్పగించారని సమాచారం. ఈ మేరకు కేఈ కృష్ణమూర్తి, పి.అశోక్ గజపతిరాజు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్ , డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కాలువ శ్రీనివాసులు, కాగిత వెంకట్రావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్ తదితరులు సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యమ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రస్తుతం పర్యటిస్తున్నారు. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో ఉద్యమం తీవ్రత, దాని వెనుక ఎవరు ఉన్నారు? మీడియా అధిక ప్రాధాన్యత ఇవ్వటానికి కారణాలు ఏమిటి? గ్రామస్థాయిలో కూడా ఉద్యమం జరుగుతోందా? అనే అంశాలపై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. ఈ వివరాలన్నింటినీ క్రోడీకరించి పార్టీ అధినేతకు నివేదిక అందిస్తామని జిల్లా పర్యటనల్లో ఉన్న నేత ఒకరు చెప్పారు. -
సమైక్యమే లక్ష్యంగా.. సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం
సమైక్య ఉద్యమం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. రాజకీయాలు, కులాలు, వర్గాలకతీతంగా ప్రజలే స్వచ్ఛందంగా సమైక్యరాష్ట్రం కావాలంటూ విభిన్నరీతిల్లో నిరసన వ్యక్తంచేస్తున్నారు. ప్రజోద్యమానికి సకలజనుల సమ్మె తోడు కావడంతో సీమాంధ్ర జిల్లాల్లో పాలన స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి కదలక ఇరవైరోజులు దాటింది. అయినా సరే జనం లెక్కచేయక ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేయొద్దంటూ అలుపెరగకుండా పోరాడుతున్నారు. -సాక్షి నెట్వర్క్ సమైక్య ఉద్యమం 28వరోజు మంగళవారం కూడా ఉద్ధృతంగా సాగింది. ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారా లు, జాతీయరహదారుల దిగ్బంధనాలు, వినూత్న ఆందోళనలతో సీమాంధ్రజిల్లాలు హోరెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఉద్యోగులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. పాలకొల్లులో గజల్స్ గాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కవులు, రచయితలు, కళాకారుల సదస్సు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో దర్జీలు రహదారిపై మిషన్లు పెట్టి దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో జాతీయరహదారిపై రాస్తారోకోకు దిగిన వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన వ్యక్తంచేశారు. మంగళగిరిలో 13వేల మంది విద్యార్థులతో ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు భారీప్రదర్శన నిర్వహించాయి. మాచర్లలో ఆర్టీసీ కార్మికులు చీరలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో 30గోవులకు పూజలు నిర్వహించారు. రాజమండ్రిలో బుధ, గురువారాలు సకల జనుల సమ్మె చేయాలని అన్ని జేఏసీల నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని 50వేల పోస్టుకార్డులు రాసి ప్రధాని, రాష్ట్రపతికి పంపే కార్యక్రమాన్ని కడియంలో విద్యార్థులు ప్రారంభించారు. విశాఖలో మహిళలు బోనాలతో ర్యాలీ చేపట్టారు. నెల్లూరులో వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్యశాఖల సిబ్బంది ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సూళ్లూరుపేటలో చేతివృత్తుల వారి ఆధ్వర్యంలో రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు. కృష్ణాజిల్లా కైకలూరులో చేపల రైతుల సం ఘం ఆధ్వర్యంలో జోరువానలో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం కలెక్టరేట్ పరిసరాలను ఎన్జీఓలు చీపుళ్లతో ఊడ్చి శుభ్రం చేసి వినూత్న నిరసన చేపట్టారు. సమైక్యాంధ్రకు మద్దతుగా మంత్రి బొత్స సత్యనారాయణ క్యాం పు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. శ్రీకాకుళంలో జిల్లా కోర్టు బయట న్యాయవాదులు మాక్ కోర్టు నిర్వహించారు. కడపలో చెన్నై- బెంగళూరు జాతీయరహదారిపై జిల్లావ్యాప్తంగా పదిచోట్ల ఆందోళనకారులు దిగ్బంధనం చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతమైంది. నేడు, రేపు తిరుపతి దిగ్బంధం తిరుపతి: బుధ, గురువారాల్లో తిరుపతిని సమైక్యవాదులు దిగ్బంధం చేయనున్నారు. ద్విచక్ర వాహనాలు తప్ప మరే ఇతర వాహనాలు తిరగకుండా బంద్ పాటించాలని నిర్ణయించారు. ఆ మేరకు తిరుమలకు వచ్చే భక్తులను రావద్దని పిలుపునిచ్చారు. హోరెత్తిన లక్షగళార్చన కర్నూలు: నంద్యాలలో లక్షగళార్చనకు విశేష స్పందన లభించింది. విద్యార్థుల ఉద్యమ గీతాలు, పాటలు, నృత్యాలతో వేదిక ప్రాంతం హోరెత్తింది. కర్నూలులోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంటకరెడ్డి తదితరులు బైఠాయించి వంటావార్పు చేపట్టారు. రాకపోకలను స్తంభింపజేశారు. 30న సీమాంధ్రలో వీధి దీపాలు వెలగవ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి రాష్ట్ర విభజన ప్రకటన వెలువడి ఈ నెల 30వ తేదీకి నెల రోజులు కావస్తోందని, దీనికి నిరసనగా ఆ రోజు సాయంత్రం సీమాంధ్రలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్లలో వీధి దీపాలను ఆర్పివేస్తున్నట్టు మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎల్.వర్మ మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. సాయంత్రం 6గంటలకు వెలిగించే దీపాలను రాత్రి 9 గంటలకు వెలిగించి, మూడు గంటల పాటు నిరసన చేయనున్నట్లు తెలిపారు. ఇక బుధవారం నుంచి సీమాంధ్రలోని అన్ని మునిసిపల్, కార్పొరేషన్ల ఉద్యోగులు సామూహిక సాధారణ సెలవులను పెట్టి నిరసన వ్యక్తం చేయనున్నట్టు ప్రకటించారు. దీక్షకు అనుమతిచ్చి.. అరెస్టులా? హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు సంఘీభావంగా మంగళవారం నగరంలోని యూసఫ్‌గూడ చౌరస్తాలో దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించిన ఆ పార్టీ నేతలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షకు ముందుగా అనుమతిచ్చిన పోలీసు లు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆరెస్టులకు పాల్పడ్డారు. ఉదయం నుంచి చౌరస్తాలో హైడ్రామా చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు దీక్ష టెంటును తొలగించి, వేదికను చిందరవందర చేశారు. ఫ్లెక్సీలను కూ లదోశారు. దీన్ని నిరసిస్తూ పార్టీ ఐటీ విభాగం కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ నేత డాక్టర్ ప్రఫుల్లారెడ్డి ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. జగన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, బంజారాహిల్స్ ఠాణాకు తరలించారు. పోలీసుల దమనకాండను ఎండగడుతూ మధుసూదన్‌రెడ్డితో పాటు ఎన్.భిక్షపతి, ఎం.కాశీరెడ్డి, ఎం.శ్రీనివాస్, శివశంకర్, ఆది త్య, గుర్రంపాటి దేవేంద్ర, పోతుల శివ, అశోక్, వై.ఇందిరారెడ్డి, జేఎల్ మేరీ, కట్టా రాఘసంధ్య, నూకల విజయలక్ష్మి తదితర నేతలు స్టేషన్లోనే ధర్నా చేశారు. నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మధుసూదన్‌రెడ్డి తెలిపారు. తాము శాంతియుతంగా సంఘీభావం తెలపడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు. -
టీటీడి ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
తిరుపతి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సీమాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. సీమాంధ్ర జిల్లాలో అడుగడుగునా నిరనసలు, ధర్నాలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో కూడా ఉద్యమ సెగ రగులుకుంది. నిత్యం శ్రీవారి సేవలో నిమగ్నమైఉండే టీటీడి ఉద్యోగులు తమ విధులను భహిష్కరించి సమైక్య ఉద్యమాన్ని కోనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 20రోజులుగా టీటీడి ఉద్యోగులు తిరుపతిలోని టీటీడి పరిపాలనా భవనం వద్ద రిలేనిరాహారదీక్షలు చేస్తున్నారు. ఉద్యమానికి మద్దుతుగా వారూ తమ సమైక్యా గళాన్ని వినిపిస్తున్నారు. సమైక్యాంద్రప్రదేశ్ మాత్రమే రాష్ట్రప్రజలంతా కోరుకుంటున్నారని టీటీడి ఉద్యోగులు అంటున్నారు. -
అసెంబ్లీ తీర్మానాన్ని ఓడిస్తాం: మంత్రి శైలజానాథ్
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెడితే కచ్చితంగా ఓడిస్తామని సమైక్యాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ ఎస్.శైలజానాథ్ ధీమా వ్యక్తం చేశారు. సీమాంధ్రకు చెందిన ఇతర పార్టీల ప్రజాప్రతినిధులతోపాటు సమైక్యవాదానికి కట్టుబడిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేయాలని కోరారు. సీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ప్రభుత్వ విప్ రుద్రరాజు పద్మరాజుతో కలిసి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించడం మినహా మరేది ప్రత్యామ్నాయం కాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోపాటు సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా తీర్మానం చేసి హైకమాండ్‌కు పంపామని తెలిపారు. హైకమాండ్ తీసుకున్న విభజన నిర్ణయం రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే అసెంబ్లీలో విభజన తీర్మానం ప్రవేశపెడితే ఖచ్చితంగా ఓడించేందుకు తమ శక్తినంతటిని వినియోగిస్తామన్నారు. గతంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలన్నీ శాసనసభలో తీర్మానం ఆమోదం పొందిన తరువాతే ఏర్పడ్డాయని గుర్తుచేశారు. ఆంధప్రదేశ్ శాసనసభలో విభజన తీర్మానం వీగిపోతే కొత్త రాష్ట్ర ఏర్పాటు ఆగిపోతుందనే నమ్మకం తమకు ఉందన్నారు. అసెంబ్లీలో విభజన తీర్మానాన్ని ఓడించిన తరువాత తాము ఏం చేస్తామనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని, మీరే (మీడియా) చూస్తారని చెప్పారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ప్రతిరోజూ సీమాంధ్రలో లక్షలాది ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇకనైనా రాజకీయ కుట్రను పక్కనపెట్టి విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని సమైక్య తీర్మానం చేసి పంపాలని బాబుకు సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం సమన్యాయం అని చెప్పడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలమంతా మొదటినుంచి సమైక్య వాదానికే కట్టుబడి ఉండటంతోపాటు హైకమాండ్‌పై ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తరపున ఏ ఒక్కరూ గెలవరనే విషయాన్ని దిగ్విజయ్‌సింగ్‌కు స్పష్టం చేశామని ఏరాసు చెప్పారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాయలసీమలోని 60 వేల ఎకరాలకు నీరందించే వివాదం ఇంకా పెండింగ్‌లో ఉందని, రాష్ట్రం విడిపోతే సీమలోని 20 లక్షలకుపైగా ఎకరాలకు నీరందించలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి ఆదేశించినా కావేరి సమస్య పరిష్కారం కాలేదని, అలాంటప్పుడు తమ సమస్యలను పరిష్కరించేదెవరని ఆయన ప్రశ్నించారు. -
హైదరాబాద్‌పై అందరికీ హక్కుంది!
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా ఉద్యమబాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం కూడా తమ నిరసనలు కొనసాగించారు. హైదరాబాద్‌పై తెలుగువారందరికీ సమాన హక్కు ఉందని నినదించారు. రాష్ట్ర విభజనపై యూపీఏ ప్రకటనకు నిరసనగా సామూహికంగా తపస్సు చేశారు. ఉద్యోగులందరమూ ఏపీపీఎస్సీ ద్వారా ప్రతిభ ఆధారంగా నియమితులైనవారమేనని, ఇందులో ఎవరూ అక్రమంగా ఉద్యోగం పొందినవారు లేరని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధానిలో ఉండే హక్కు ప్రతి ఉద్యోగికీ ఉందని, ఇందుకు ఎవరి అనుమతి అవసరం లేదంటూ నుదుట తెల్లబ్యాడ్జీలు కట్టుకుని.. సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. సీఎం కార్యాలయం ఉండే సమతా బ్లాక్ ఎదుట బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యాలయంలోనే ఉన్నారు. అనంతరం సచివాలయ సీమాంధ్ర ఫోరం కో కన్వీనర్ మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రుల ఉద్యమాన్ని అర్థం చేసుకుని కేంద్రం తన ప్రకటనను వెనక్కు తీసుకోవడంద్వారా రాష్ట్రంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ నిర్వహించి అన్ని ప్రాంతాల శాసనసభ్యులు తమ అభిప్రాయాలు వినిపించేందుకు అవకాశం కల్పించాలన్నారు. సీమాంధ్ర ఉద్యమంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. గతంలో తెలంగాణ ఉద్యోగులు నెలల తరబడి విధులు వదిలి ఆందోళన చేపట్టినప్పుడు.. తాము పూర్తిగా సహకరించామని, అదేరీతిలో ఇప్పుడు హక్కులకోసం పోరాడుతున్న తమపై నిందలు వేయడం సహేతుకం కాదని హితవు పలికారు. తమ ఆందోళన తమ హక్కులకోసమే తప్ప ఏ ఒక్కరికీ వ్యతిరేకంగా కాదని వివరించారు. ఇరుప్రాంతాల ఉద్యోగులమధ్య సుహృద్భావ వాతావరణం చెడగొట్టేందుకు కొందరు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని, వాటికి తాము ప్రతిస్పందించబోమని చెప్పారు. ఓటు హక్కున్న ప్రతిఒక్కరూ రాజకీయ అంశాలపై పోరాడవచ్చని, అది రాజ్యాంగం కల్పించిన హక్కని ఫోరం కార్యదర్శి కె.వి.కృష్ణయ్య పేర్కొన్నారు. విభజనపై తమ అభిప్రాయాలు చెప్పే భావప్రకటన స్వేచ్ఛను ఎవరూ ప్రశ్నించలేరన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజా ఉద్యమమని, లక్షలాది మంది స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు మద్దతుగా ఉద్యోగులు కూడా ఆందోళన చేపట్టవచ్చన్నారు. డిమాండ్లు సాధించేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. -
టీడీపీ, బీజేపీలు తెలంగాణను అడ్డుకోవచ్చు!
అప్రమత్తంగా ఉండాలి: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, టీడీపీలు కలిసి తెలంగాణను అడ్డుకునే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆ పార్టీల తెలంగాణ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ, బీజేపీల స్నేహహస్తం గురువారం లోక్‌సభలో సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ సమయంలో స్పష్టంగా బయటపడిందన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాజయ్యలు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అనకూలమని లేఖ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సొంత పార్టీ ఎంపీలతో సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో నాటకాలాడిస్తున్నారని దుయ్యబట్టారు.చంద్రబాబు చేయనున్న ఆత్మగౌరవ యాత్రకు ఆత్మవంచన యాత్రగా నామకరణం చేసుకుంటే బాగుటుందని సూచించారు. తెలంగాణ కోసం నిరసనకు దిగిన తమను సస్పెన్షన్ చేస్తే మౌనం దాల్చిన బీజేపీ, ఇప్పుడు సమైక్యాంధ్ర కోసం నిరసన తెలిపినవారి సస్పెన్షన్ అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. -
సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటాం: తెలంగాణ విద్యార్థి జేఏసీ
సాక్షి,హైదరాబాద్: సమైక్యాంధ్ర పేరుతో ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో బహిరంగసభ ఏర్పాటు చేస్తే అడ్డుకుని తీరుతామని తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించింది. జాక్ చైర్మన్ పిడమర్తి రవి, కన్వీనర్ బాలరాజు, అధ్యక్షుడు మర్రి అనిల్‌కుమార్ గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద మీడియాతో మాట్లాడారు. తమ విజ్ఞప్తులను కాదని హైదరాబాద్‌లో సమైక్య సభలు నిర్వహించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ప్రకటించింది. కాగా, హరికృష్ణ రాజీనామాకు నిరసనగా ఆయన తనయుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమని విద్యార్థి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అదే రోజు ‘తెలంగాణ విద్యార్థి ప్రజా యుద్ధభేరి’ సీమాంధ్ర ఉద్యోగులు వచ్చేనెల 7న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన సమైక్య సభను అడ్డుకుంటామని, అదే రోజును ‘తెలంగాణ విద్యార్థి ప్రజాయుద్ధభేరి’ పేరిట బహిరంగ సభ పెడతామని ఓయూ జేఏసీ నాయకులు భాస్కర్, అంబేద్కర్ తదితరులు ఒక ప్రకటన విడుదల చేశారు. -
కర్నూలులో ‘ జై సమైక్యాంధ్ర’ అన్న లక్ష గొంతుకలు
తాడేపల్లిగూడెంలో నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న అనంతపురంలో న్యాయవాదుల 48 గంటల నిరశన శ్రీకాకుళంలో విద్యుత్ ఉద్యోగులచే హైవే దిగ్బంధం రాజమండ్రిలో 33 మంది మున్సిపల్ కమిషనర్ల సమావేశం సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర కోసం 23 వ రోజూ నిరసనలు, ర్యాలీలు, మావనహారాలతో సీమాంధ్ర జనసంద్రమైంది. లక్షల గొంతుకలు జై సమైక్యాంధ్ర అంటూ గళమెత్తి ఘోషించాయి. ఉద్యమంలో ఊపుతీసుకువచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షలకు మద్దతుగా అనేకచోట్ల నిరాహారదీక్షలు నిర్వహిం చారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని నినదిస్తూ విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకులు రోడ్లపైకి వచ్చి మానవహారాలు జరిగాయి. ఉపాధ్యాయ ఐక్య కార్యాచరణ సమితి నేతృత్వంలో కర్నూలు రాజ్‌విహార్ సెంటర్లో నిర్వహించిన ‘లక్షగళ ఘోష’ కార్యక్రమం విజయవంతమైంది. నగరం, శివారులకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల జేఏసీల ఆధ్వర్యంలో లక్ష గొంతుకలతో చేసిన సమైక్యాంధ్ర నినాదం మారుమోగింది. రాజ్‌విహార్ మూడురోడ్ల కూడలి ఎటూ చూసినా జనసంద్రమైంది. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి, సమైక్యాంధ్ర జెండాలు చేత బూనారు. విద్యుత్ ఉద్యోగులు కర్నూలు జాతీయరహదారిని రెండు గంటల పాటు దిగ్భందించారు. అనంతపురం కలెక్టరేట్ మహిళా ఉద్యోగులు ఉపాధ్యాయ జాక్టో,స్వర్ణకారుల సంఘం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేశారు. న్యాయవాదులు 48 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. జెడ్పీ ఉద్యోగులు భిక్షాటన చేశారు. ఎస్కే యూనివర్సిటీలో మంత్రులు శైలజానాథ్, రఘువీరా దిష్టిబొమ్మలు, కళ్యాణదుర్గంలో సోనియాగాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ దీక్షకు సంఘీభావంగా కడప జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు సాగుతున్నాయి. ఉపాధ్యాయులు రోడ్లపైకి చేరి కదం తొక్కారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీని వాసులు దీక్ష ను భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బంద్‌ను పాటించారు. బద్వేలులో రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ తీయగా, రాయచోటిలో రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. చిత్తూరులో ఉన్నతాధికారులు ఉద్యోగులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గాంధీవిగ్రహం వద్ద కోలాటాలు అడగా, మినీలారీ అసోసియేషన్ ర్యాలీ నిర్వహించింది. వీ కోటలో ఆస్పత్రి సిబ్బంది రోగులకు రోడ్డుపైనే చికిత్సలు చేసి నిరసన తెలిపారు. మదనపల్లిలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, పాఠశాల విద్యార్థులకు రోడ్డుపైనే బోధనలు నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు మహాపాదయాత్ర గురువారం చంద్రగిరికి చేరుకుంది. తిరుపతిలో వైఎస్ విజయమ్మ దీక్షకు మద్దతుగా కుప్పం లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతోంది. విజయవాడకు విశాలాంధ్ర మహాసభ యాత్ర విశాలాంధ్ర మహాసభ బృందం యాత్ర విజయవాడకు చేరిన సందర్భంగా భారీ సభ ఏర్పాటుచేశారు. న్యాయవాదులు, సిబ్బంది గురువారం కూడా కోర్టు గేట్లకు తాళాలు వేసిన నిరసన తెలిపారు. వెఎస్ విజయమ్మ చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా జిల్లాలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు జరిగాయి. మైలవరంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీర్యాలీలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తెనాలిలో ఆర్టీసీ కార్మికులు మౌనప్రదర్శన చేయగా, రేపల్లెలో యోగాసనాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. తెనాలి, నరసరావుపేట, బాపట్ల, పొన్నూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, మాచర్లలో వైఎస్ఆర్ సీపీ రిలేదీక్షలు కొనసాగాయి. మంగళగిరిలో విద్యార్థి జేఏసీ సమ్మెకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే కాండ్రు కమలను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ప్రకాశం జిల్లాలో అటెండర్ స్థాయి ఉద్యోగి నుంచి గెజిటెడ్ అధికారి వరకు అందరూ ఉద్యమ బాట పట్టారు. చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ 48 గంటల ఆమరణ దీక్షను విరమించారు. నెల్లూరుజిల్లా ఉదయగిరి నియోజకవర్గం బోగ్యం వారిపల్లికి చెందిన యువకుల నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యార్థి జేఏసీ, ఎన్జీఓ అసోసియేషన్, గెజి టెడ్ ఆఫీసర్స్‌తోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీ లు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్దఎత్తున నిర్వహించారు. నాగళ్లతో రోడ్డెక్కిన రైతన్న తాడేపల్లిగూడెంలో వ్యవసాయ అధికారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రైతులు నాగళ్లు చేతబూని, ఎడ్లబండ్లతో ప్రదర్శన చేశారు. నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు కుమ్మర్లతో కలసి కుండలు తయారుచేసి నిరసన తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు బుట్టాయిగూడెంలో ఒకరోజు రిలేనిరాహార దీక్ష చేపట్టారు. చింతలపూడిలో కర్రా రాజారావు, ధర్మాజీగూడెంలో మట్టా సురేష్, చిన్నం సురేష్ ఆమరణ నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. విశాఖపట్నం జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్ తప్ప ఇతర ఉద్యోగులంతా రోడ్డెక్కారు. గోపాలపట్నం పరిధిలో ఆర్ఆర్ వెంకటాపురంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో వంటావార్పు, ైబె క్ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త గండి బాబ్జీ ఆధ్వర్యంలో వేపగుంటలో బైక్ ర్యాలీ తీశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎన్ఎంయూ ర్యాలీగా వెళ్లి మద్దిలపాలెం వద్ద వైఎస్సార్సీపీ ముస్లిం నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపింది. జిల్లాలోని ట్రైబల్ వెల్ఫేర్ ఉపాధ్యాయసంఘం ఆధ్వర్యంలో 11 మండలాల్లో ఉపాధ్యాయులు సమ్మెబాట పట్టారు. శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ ఆమరణ నిరాహారదీక్ష రెండోరోజూ కొనసాగింది. శ్రీకాకుళంలో జాతీయ రహదారిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు దిగ్భందించారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం మానవహారం చేపట్టింది. సీమాంధ్రలోని 33 మునిసిపాలిటీల కమిషనర్లు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ రాజమండ్రిలో సమావేశమయ్యారు. కాకినాడలో మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట జేఏసీ దీక్షలకు తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ఎమ్మెల్సీలు చైతన్య రాజు, రవికిరణ్ వర్మ సంఘీభావం తెలిపారు. దిండి-చించినాడ వంతెనపై రామరాజులంక గ్రామస్తులు వంటావార్పుతో రాస్తారోకో చేసి ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలను స్తంభింప చేశారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. రాజమండ్రి మోరంపూడి జంక్షన్లో వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ చేపట్టిన బస్సు యాత్ర అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగిం ది. పార్టీ సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీజిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో కొందరికి సోనియా, దిగ్విజయ్ సింగ్, బొత్స,కేసీఆర్ మాస్కులు ధరింపజేసి, వారిని చీపుళ్లు, చేటలతో కొడుతూ రోడ్లపై ఊరేగించారు. సాలూరులో మహిళలు జాతీయ రహదారిపై లలితా సహస్త్రనామ పారాయణం చేశారు. కరీంనగర్ జిల్లా నుంచి బొబ్బిలిలో నివసిస్తున్న ప్రవీణ్ అనే యువకుడికి... ఇరుప్రాంతాల వారు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని కోరతూ పౌర సన్మానం చేశారు. విభజన వేదనతో ఐదుగురు మృతి న్యూస్‌లైన్ నెట్వర్క్ : విభజన చిచ్చుకు గురువారం ఐదుగురు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కూసం నాగేంద్ర (50) హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి ఉపాధికి విఘాతం కలుగుతుందనే ఆందోళనతో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. లింగపాలెం మండలం కె.గోపవరం పరిధిలోని గణపవారిగూడెంకు చెందిన గద్దే ఆశీర్వాదం (32) టీవీలో సమైక్య ఉద్యమ వార్తలు చూస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణా జిల్లా నందిగామ మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన అరిగెల ప్రసన్న(23) గురువారం పరిటాల సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జై సమైక్యాంధ్ర అంటూ పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక అనంతపురంజిల్లా ముదిగుబ్బ మండల కేంద్రం లోని గేట్కొట్టాలకు చెందిన హైదర్‌వలి (55),ఓడీ చెరువు మండలం జంబులవాండ్లపల్లికి చెందిన జంబుల గంగిరెడ్డి (50) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. కాగా, పెద్దపంజాణి మండలం బొమ్మలకుంటకు చెందిన నడిమింటి ఈశ్వరయ్య (44) శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పం టించుకోబోగా, ఉద్యమకారులు అడ్డుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. విభజన జరిగితే తనకు వికలాంగుల పింఛన్ రాదేమోనన్న బెంగతో చాగల్లు మండలం ఊనగట్లకు చెందిన కొడమంచిలి శ్రీను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడూరులో కరెళ్ల సత్యనారాయణ (30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విజయమ్మ దీక్షా శిబిరాన్ని సందర్శించిన అనంతరం గుంటూరులోని సంగడికుంట ప్రాంతానికి చెందిన షేక్ అల్లాబక్షు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీక్షా శిబిరం ఎదురుగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని ‘జగనన్న బయటకు రావాలి, ప్రజలకు న్యాయం చేయాలి’ అని నినాదాలు చేస్తూ నిప్పంటించుకోబోయాడు. పోలీసులు అప్రమత్తమై అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. 26 నుంచి నేతల ఇళ్లకు సేవలు బంద్ మున్సిపల్ ఉద్యోగుల సంఘం ప్రకటన తిరుపతి, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకపోతే చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల ఇళ్లకు తాగునీరు, పారిశుధ్యం, వీధిదీపాలు వంటి సేవలను ఈనెల 26నుంచి నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.లోకేశ్వర వర్మ తిరుపతిలో గురువారం ప్రకటించారు. ఈనెల 12 నుంచి సమ్మెబాట పట్టిన మున్సిపల్ ఉద్యోగులు గురువారం ఒంటికాలిపై నిలుచుని నిరసన తెలిపారు. -
పదవుల్ని వదిలి ప్రజల్లోకి రండి
సాక్షి, ఏలూరు : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలకని ఏ రాజకీయ పార్టీకైనా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని పశ్చిమగోదావరి జిల్లా సమైక్యవాదులు హెచ్చరించారు. ఏలూరు నగరంలోని ఐఏడీపీ హాల్లో ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన చైతన్యపథం ‘ఎవరెటు’ చర్చా వేదిక కార్యక్రమానికి సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పదవులకు రాజీనామా చేసినట్టుగానే మిగిలిన పార్టీల నేతలూ వ్యవహరించాలని డిమాండ్ చేశారు. 60 ఏళ్ల వయసులో ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను చూసైనా పదవులు పట్టుకుని వేలాడుతున్న మంత్రులు, ఎంపీలు సిగ్గుపడాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా విజయమ్మలా పదవుల్ని వదిలిప్రజల్లోకి రాని నేతలను క్షమించేదిలేదని హెచ్చరించారు. రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా నది ఎండిపోతుందన్నారు. కృష్ణా నదికి నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ అడ్డు తగులుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు ఎల్. విద్యాసాగర్ మాట్లాడుతూ తెలంగాణలో సకల జనుల సమ్మెను రాజకీయ నాయకులు నడిపించారని, విభజన ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమం ప్రారంభించారన్నారు. న్యాయవాది పి. విజయలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ ప్రక్రియ రాజకీయ నాయకులు అడుతున్న రాక్షస క్రీడ అని ధ్వజమెత్తారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తూ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడంలేదని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీఎస్ ప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీకి సంబంధించిన 60శాతం ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని వివరించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని 123 ఆర్టీసీ డిపోలనూ మూసుకోవాల్సి వస్తుందన్నారు. ఏలూరు మర్చంట్స్ చాంబర్ అధ్యక్షుడు నేరెళ్ల రాజేంద్ర మాట్లాడుతూ.. అపరాలు, కొన్నిరకాల కూరగాయలు తెలంగాణ ప్రాంతం నుంచే ఇక్కడకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రం ముక్కలైతే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతాయని వివరించారు. జాతీయ విద్యాసంస్థలు, ఐటీ పరిశ్రమలు హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయని, సీమాంధ్రులే వాటిని అభివృద్ధి చేశారని జిల్లా ప్రైవేటు విద్యాసంస్థల అధ్యక్షుడు ఎంబీఎస్ శర్మ చెప్పారు. ఇప్పుడు వాటిని వదులుకోమంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్ ఏమిటని ప్రశ్నించారు. ఆందోళనను విరమించే ప్రసక్తే లేదు రాష్ట్ర విభజన ప్రకటనను వెనక్కి తీసుకునే వరకు ఆందోళనను విరమించేది లేదు. సమైక్యాంధ్ర ఉద్యమం మరో స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తోంది. ‘విభజించు-పాలించు’ అనే బ్రిటిష్ పాలకుల సిద్ధాంతం తరహాలోనే కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకుంటోంది. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కోరటం సిగ్గుచేటు. - శైలజ, ఉపాధ్యారుుని విద్యుత్ ఉత్పత్తి భారం అవుతుంది రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ భారం అవుతుంది. జల విద్యుత్, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు మన దగ్గర ఉన్నా ఇంధన వనరు లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. దానివల్ల ఇక్క డి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఇంధన కొరతతో మూతపడే ప్రమాదముంది. ఇది ఇరు ప్రాంతాలకు ఇబ్బం దికరమే. గ్యాస్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని కేసీఆర్, దిగ్విజయ్ మనకు సూచిస్తున్నారు. ప్రస్తుతం యూనిట్ విద్యుత్ ఉత్పత్తి వ్యయం రూపాయి ఉంటే గ్యాస్ వినియోగం వలన రూ.6 అవుతుంది. ఇది తీరని భారం. - తురగా రామకృష్ణ, జిల్లా కన్వీనర్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ -
సీమాంధ్రలో .. సమర దీక్షా బంధన్
పండగల్లేవ్.. పర్వదినాల్లేవ్... ఒకటే లక్ష్యం సమైక్యాంధ్ర పరిరక్షణ. సీమాంధ్రలో మూడువారాలకు పైగా విరామం లేకుండా హోరెత్తుతున్న సమైక్య ఉద్యమం శ్రావణపౌర్ణమి రక్షాబంధన్ నాడు బుధవారం వినూత్నరీతిలో ముందుకు సాగింది. సీమాంధ్రలో నివసిస్తున్న , ఉద్యోగరీత్యా పనిచేస్తున్న తెలంగాణ వారికి సమైక్యవాదులు రాఖీలు కట్టి రాష్ట్రం ముక్కలు కాకుండా కలిసుండాలని ఆకాంక్షించారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని వారికీ రక్షాబంధన్‌లు కట్టి విభజన వద్దని అందరూ కలిసుందామని కోరారు. - సాక్షి నెట్వర్క్ సీమాంధ్ర జిల్లాల్లో బుధవారం సమైక్య గర్జన మార్మోగింది. యధావిధిగానే ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, మానవహారాలు, సోనియా, చంద్రబాబు, బొత్స, చిరంజీవి, కేసీఆర్‌ల దిష్టిబొమ్మల దహనాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అడుగడుగునా కనిపించాయి. పోటెత్తిన గోదావరి తీరం అఖండ గోదావరితీరం సమైక్య నినాదంతో మార్మోగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో అన్ని జేఏసీలూ కలిసి ‘గోదావరి సమైక్య నాదం’ పేరుతో చేపట్టిన ప్రదర్శనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. గజల్ శ్రీనివాస్ హాజరై రాష్ట్ర సమైక్యతను చాటి చెప్పే గీతాలు ఆలపించారు. సమైక్యవాదులు లాలాచెరువు వద్ద జాతీయ రహదారిని ముట్టడించారు. కౌన్సెలింగ్ వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నినాదాలు కాకినాడ జేఎన్టీయూకేలో ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు సమైక్యవాదులు ప్రయత్నించగా పోలీసులు చుట్టుముట్టారు. కౌన్సెలింగ్‌కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు సైతం కౌన్సెలింగ్ నిలుపు చేయాలని నినాదాలు చేశారు. కడియంలో రోడ్డుపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు. రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను చాటుతూ వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర బుధవారం అమలాపురం పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని కొత్తపేట, కాకినాడ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో జరిగింది. నెల్లూరులో అధికారుల పెన్‌డౌన్ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లావ్యాప్తంగా అధికారులు పెన్‌డౌన్ చేపట్టి సమైక్యఉద్యమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. కావలిలో జరిగిన ఆందోళనల్లో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి వైఎస్సార్ విగ్రహం వద్ద జరిగిన వంటావార్పులో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. విజయ‘వాడ’వాడలా మానవహారాలు ఎన్జీవోల నేతృత్వంలో బుధవారం మధ్యాహ్నం విజయవాడ నగరవ్యాప్తంగా మానవహారాలు నిర్మించారు. నగరంలో రాత్రి కాగడాల ప్రదర్శన జరిపారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు విద్యుత్ దీపాలు ఆర్పివేసి నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో మానవహారం నిర్వహించగా వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వత్సవాయిలో జిల్లా సరిహద్దు వద్ద తెలంగాణవాదులకు రాఖీలు కట్టి కలిసి ఉండాలని కోరారు. రోడ్డుపై మాక్ కోర్టు విజయనగరం జిల్లా గజపతినగరంలో న్యాయవాదులు రోడ్డుపై మాక్ కోర్టు నిర్వహించారు. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో న్యాయవాదులు మాక్ కోర్టు నిర్వహించి సోనియా గాంధీకి దేశ బహిష్కరణ, ఆమెకు సహకరించిన సీమాంధ్ర మంత్రులకు రాజకీయ బహిష్కరణ విధిస్తూ తీర్పునిచ్చారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయనగరం ఎత్తుబ్రిడ్జిపై భారీ మానవహారం నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఎస్‌కోటలో సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు పురందేశ్వరి, చిరంజీవి, పీసీసీ చీఫ్ బొత్సల దిష్టిబొమ్మలకు పిండ ప్రదానం చేశారు. మూడురోజులు గూడెం బంద్ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం నుంచి 72 గంటల బంద్‌కు నాన్ పొలిటికల్, ఎన్జీవో జేఏసీలు పిలుపునిచ్చాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీల ఆధ్వర్యంలో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్గేట్, ఆశ్రం ఆసుపత్రుల వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు తిరివీధి వేణుగోపాల్ బుధవారం నుంచి నిరవధిక దీక్షకు కూర్చున్నారు. రైతుల ర్యాలీ అనంతపురంలో వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల అధికారులు, ఉద్యోగులు.. రైతులతో కలసి పరికరాలతో వినూత్న ర్యాలీ నిర్వహించారు. నగరంలో రిలే దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి సంఘీభావం తెలిపారు. అనంతరం వాహనాలకు జై సమైక్యాంధ్ర స్టిక్కర్లు అతికించారు. ఎస్కేయూలో విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 30న విశాఖలో సమైక్యమార్చ్ ఈనెల 30న వేలాది మందితో విశాఖలో సమైక్య మార్చ్ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రాయూనివర్సిటీ విద్యార్థి జేఏసీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం పోస్టర్ రిలీజ్ చేశారు. విశాఖనగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం నేత గవిరెడ్డి రామానాయుడు చేపట్టిన ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. జోరు వర్షంలోనూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో వేలాది మంది విద్యార్థులు వర్షంలోనే జాతీయ జెండాలు చేతబూని సమైక్య నినాదాలతో భారీప్రదర్శన చేపట్టారు. జమ్మలమడుగు, రాయచోటిలలో న్యాయవాదులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని సత్యాగ్రహం చేపట్టారు. ఒంగోలు నగరంలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. శ్రీకాకుళం కలెక్టర్ అడ్డగింత శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏలో బుధవారం జరుగుతున్న అధికారిక సమావేశానికి వెళుతున్న కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను సమైక్యవాదులు పాలకొండ ఏలాం సెంటర్లో అడ్డుకున్నారు. దాదాపు అరగంటసేపు ఆయన వాహనాన్ని నిలిపివేసి కలెక్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే సీకేబాబు వందలాది మందితో బుధవారం చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి తిరుమలకు మహాపాదయాత్రను ప్రారంభించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వరదయ్యపాళెంలో వైఎస్సార్సీపీ నాయకుడు చిన్న, అడ్వొకేట్ దశరథయ్యయ ఆమరణ నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరింది. సమైక్యవాదుల రక్తదానం విభజన పరులకు సమైక్యరక్తాన్ని ఎక్కించాలని కోరుతూ చంద్రగిరిలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో తెలంగాణ ఉద్యోగులకు రాఖీలు కట్టారు. సీమాంధ్రలో జాతీయ వార్తా చానె ళ్ల నిషేధానికి తీర్మానం సమైక్య ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వని జాతీయ వార్తా చానెళ్ల ప్రసారాలను ఆపివేయాలని తిరుపతి కేబుల్ ఆపరేటర్లు బుధవారం తీర్మానించారు. ఈ మేరకు సీమాంధ్రలోని 13 జిల్లాల ఎంఎస్‌వోలకు తీర్మానం పంపి సహకరించాలని కోరనున్నట్లు తెలిపారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఆర్టీసీ కార్మికులు వెనక్కు నడిచి నిరసన ప్రదర్శన చేశారు. తెనాలి, వినుకొండల్లో సమైక్యవాదులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు వాహనాల్ని అడ్డగించారు. కర్నూలులో టీడీపీ ఎమ్మెల్యే కేఈ కృష్ణమూర్తిని సమైక్యవాదులు ఘెరావ్ చేశారు. రెండు కళ్ల సిద్ధాంతం కలిగిన చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రాలిన మరో ఎనిమిది ప్రాణాలు రాయదుర్గంలో నిరశన దీక్షా శిబిరంలోనే గుండెపోటుతో ఒకరి మృత్యువాత సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభ‘జనా’ందోళన బుధవారం ఒక్కరోజే మరో ఏడుగురిని బలిగొంది. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరంలో ఉన్న తిమ్మప్ప(55) గుండెపోటుతో మృతి చెందాడు. దీక్ష శిబిరంలో సమైక్యనినాదాలు చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన తిమ్మప్పను పార్టీ కార్యకర్తలు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అప్పటివరకు తమతోపాటు శిబిరంలో ఉన్న వ్యక్తి హఠాన్మరణం చెందడంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి. ఇక విభజన వార్తలపై కలత చెంది ఓడీ చెరువుకు చెందిన బీడీ కార్మికుడు బాబ్జాన్(65), నార్పలలోని ఉయ్యాలకుంట కాలనీకి చెందిన రైతు మర్తాడు శివయ్య(46) గుండెపోటుతో మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామానికి చెందిన సొసైటీ మాజీ ప్రెసిడెంట్ వీరవల్లి సత్తయ్య(65) గుండెఆగి మరణించారు. హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరి పిల్లల భవితవ్యంపై ఆయన తీవ్రఆందోళనకు లోనై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం సంగం డెయిరీ పాలకేంద్రం అధ్యక్షుడు బత్తుల కృష్ణ(42) టీవీలో విభజన నేపథ్యంపై వార్తలు చూస్తూ గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడని బంధువులు తెలిపారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన మారేపల్లి నాగభూషణం (60), కర్నూలు జిల్లా కల్లూరు మండలం గోకులపాడుకు చెందిన కుమ్మరి రామదాసు(54) విభజన వార్తలతో కలతచెంది మృతిచెందినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి భవానీపేటకు చెందిన వెలగంటి రామకృష్ణ (39) రాష్ట్రం ముక్కలవుతుందనే భయంతో గుండెపోటుతో మృతి చెందాడు. కొరముట్ల దీక్ష భగ్నం రైల్వేకోడూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ ఏడు రోజులుగా వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరులో ఆమరణ నిరశన చేస్తున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు దీక్షను బుధవారం పోలీసులు భగ్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బలవంతంగా దీక్షను భగ్నం చేసి 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నలుగురికి సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి కొరముట్ల శ్రీనివాసులుకు కొబ్బరినీళ్లు తాగించి దీక్షను విరమింపజేశారు. కాగా, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి దీక్షను మంగళవారం రాత్రే పోలీసులు భగ్నం చేసినప్పటికీ ఆయన బుధవారం ఉదయం వరకు ఆస్పత్రిలో దీక్ష కొనసాగించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు మధ్యాహ్నం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
విభజిస్తే కాంగ్రెస్ భూస్థాపితమే: అశోక్‌బాబు
విజయనగరం, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఏపీఎన్జీఓ అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు హెచ్చరించారు. మంగళవారం విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో పదిలక్షల మందితో మహాసభ నిర్వహించనున్నట్టు తెలిపారు. తెలంగాణవాదులు రవాణాను అడ్డుకుంటే కాలినడకనైనా వస్తారని చెప్పారు. హైదరాబాద్‌లో రక్షణ కల్పించాల్సింది సీమాంధ్రులకు కాదని, స్వార్థపూరిత ఆలోచనలున్న తెలంగాణా రాజకీయ నిరుద్యోగులకు మాత్రమేనని చెప్పారు. తెలంగాణతో తమది అన్నదమ్ముల బంధం కాదని, నాటి ప్రధాని నెహ్రూ చెప్పినట్టు భార్యాభర్తల బంధమన్నారు. తెలంగాణ ఉద్యమం కంటే సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రస్థాయిలో జరుగుతోందని తెలిపారు. తెలంగాణలో నాయకులు చేపట్టిన ఉద్యమానికి ప్రజలు పూర్తిగా సహకరించలేదని, సీమాంధ్రలో ప్రజలే సమైక్యాంధ్ర కోసం ఉద్యమాన్ని చేపడుతున్నారన్నారు. సీమాంధ్ర ఎమ్మెల్యేలు, ఎంపీలు అధిష్ఠానం వద్ద సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించలేకపోతున్నారన్నారు. ఉద్యమంలో పాల్గొనని ప్రజాప్రతినిధులు చరిత్రహీనులుగా మిగిలి పోతారని తెలిపారు. జేఏసీ నాయకులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. ఎస్మా అస్త్రాన్ని ప్రయోగిస్తే నాలుగు లక్షల మంది ఉద్యమ ఊపిరిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగితే ఉద్యమం ఉధృతమవుతుందన్నారు. ఈనెల 30వతేదీ వరకు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తామని అనంతరం హైదరాబాద్‌లో సమైక్యవాదులతో సమావేశం నిర్వహించి, తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని అశోక్‌బాబు పార్వతీపురంలో విలేకరులకు తెలిపారు. జిల్లాలో జరిగిన సభల్లో ఆయనతో పాటు రాష్ట్ర జేఏసీ కార్యదర్శి ఎన్.చంద్రశేఖరరెడ్డి సమైక్యాంధ్ర జిల్లా చైర్మన్ పెద్దింటి అప్పారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. వెంకటేశ్వరరెడ్డి, జేఏసీ మహిళా కన్వీనరు రత్నకుమారి, రాజ్యలక్ష్మి, జేఏసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభూజి, డీజీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో హరికృష్ణ చైతన్య రథయాత్ర!
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీఆర్ గతంలో రాష్ర్టవ్యాప్తంగా చైతన్యరథంలో పర్యటించారు. ఇపుడు అదే రథాన్ని హరికృష్ణ ఉపయోగించనున్నారని తెలిసింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే ందుకు ఢిల్లీ వెళ్లిన హరికృష్ణ బుధవారం నగరానికి రానున్నారు. వెంటనే అందుబాటులో ఉన్న సన్నిహితులతో చర్చించిన అనంతరం యాత్ర షెడ్యూల్‌ను ఆయన ప్రకటిస్తారని సమాచారం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ నెలాఖరు నుంచి తెలుగు ఆత్మగౌరవయాత్ర చేయనున్నారు. అంతకంటే ముందుగానే హరికృష్ణ తన యాత్రను ప్రారంభించి తొలుత రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. కొద్ది విరామం అనంతరం మిగిలిన జిల్లాల్లో యాత్ర చేస్తారని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను హరికృష్ణ మంగళవారం ఫోన్లో పరామర్శించారు. -
‘రెండుకళ్ల’కు తోడు ‘రెండుకాళ్లు’!
విశ్లేషణ: ‘‘కాలచక్రాన్ని పాచిపట్టిన పాత పద్ధతులకు మళ్లిద్దామా? చప్పన్నారు రాజ్యాల్లాంటి చిన్నచిన్న రాష్ట్రాలకు, సంస్థానాధీశుల ఇలాకాలకు మళ్లీ మరలిపోదామా? మళ్లీ వెనుకడుగు వేద్దామా? కేవలం వెనుకబాటుతనం పేరిట రాష్ట్ర విభజనను ఎవరూ కోరుకోజాలరు. నేను ఇది వరకు కూడా చెప్పాను- కేవలం వేర్పాటు గురించి మాట్లాడినంత మాత్రాన వెనుకబాటుతనం అనే సమస్య పరిష్కారం కాదు, కాదు అని! వేర్పాటు ధోరణి మరో పెద్ద సమస్యకు దారితీస్తుంది’’ - ఇందిరా గాంధీ ప్రదక్షిణలు చేస్తే మంచి బిడ్డలు పుడతారని తలమాసిన వాళ్లె వరో చెబితే, మంచి మనసుతో నమ్మిన ఓ పిచ్చితల్లి, చుట్టు చుట్టుకూ పొట్ట చూసుకుందని పెద్దలు అంటుంటారు! ప్రస్తు తం రాష్ట్ర ‘విభజన’, ‘సమైక్యత’ సమస్యలను పరిష్కరించలేక సతమతమవుతున్న కాంగ్రెస్ అధిష్టాన దేవత సోనియాగాంధీ స్థితీ, కేసుల నుంచి బయట పడేందుకు తంటాలుపడుతూ ‘విభజన’ విష యంలో కాంగ్రెస్‌కు పరోక్షంగా వత్తాసు పలుకుతున్న ‘టీడీపీ’ అధినేత చంద్రబాబు పరిస్థితీ ఆ సామెతలాగానే ఉంది! ఎందుకంటే, రాజకీయ నిరుద్యోగులతోపాటు, ‘విభజన’ సమస్య తలెత్తినప్పటి నుంచీ రాష్ట్రంలో అంత ర్భాగంగా ఉన్న రెండు ప్రాంతాలూ (కోస్తాంధ్ర, తెలంగా ణలు) తనకు ‘రెండు కళ్లు’ అని ఆది నుంచీ చెప్పిన ‘దేశం’ అధినేత చంద్రబాబు మధ్యలో బాణీ మార్చి కేవలం వ్యక్తి గతంగా తన మెడ మీద ‘కత్తుల్లా’ వేలాడుతున్న కేసుల నుంచి ఎలాగోలా తెములుకునే ప్రక్రియలో భాగంగా తరవాత తన ‘రెండు కళ్లల్లో’ ఒకదానికి ‘శుక్లాలు’ మొలి పించేశారు! కాంగ్రెస్ అధ్యక్షురాలిగా విభజన సమస్యకు ‘తుది రూపం’ ఇవ్వడం ద్వారా రానున్న జనరల్ ఎన్నికల్లో ‘ఓటు-సీటు’ నిష్పత్తి ద్వారా నీటుగా అనుకూల ఫలితం పొందవచ్చునని సోనియా భ్రమపడ్డారు! కాని క్రమంగా రెండు ప్రాంతాల్లోనూ అలజడులు తగ్గకపోగా పెరుగుతు న్నాయి. ఫలితంగా తాను కాంగ్రెస్‌కు ఆశించిన స్థానాలు దక్కే అవకాశాలు నెమ్మదిగా సన్నగిల్లిపోవడంతో సోని యాగాంధీ వ్యూహాన్ని మార్చినట్టు వార్తలు వెలువడ్డాయి. రెండు ప్రాంతాల్లో ఎలాగోలా కాంగ్రెస్‌ను తిరిగి అధికారం లో ప్రతిష్టించడం ద్వారా కొడుకు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాగల అవకాశాలను పెంచడం సోనియా ప్రధాన లక్ష్యమైనట్టు స్పష్టమవుతోంది! అందుకే చంద్రబాబు ‘రెండుకళ్ల’ సిద్ధాంతానికి తోడుగా సోనియా ‘రెండుకాళ్ల’ సిద్ధాంతాన్ని రూపొందిం చుకున్నట్టుంది! అంటే, ఒక కాలును ‘తెలంగాణ కాం గ్రెస్’ బోటులో, మరొక కాలును ‘సీమాంధ్ర కాంగ్రెస్’ బోటులో పెట్టి రెండుచోట్లా లబ్ధిపొందడానికి ఆలోచన చేసినట్టు వార్తలు! అంటే, అటు ‘సోనియా బోటు’కు దీటుగా ఇటు సీమాంధ్రలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేరిట ‘ఇందిరా బోటు’ను ఎన్నికల సమర జలాలలోకి దించబోతున్నారట! ‘‘రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమై క్యాంధ్ర ఉద్యమం విరుచుకుపడి ముందుకు సాగుతుం డటంతో’’ కోస్తాంధ్ర కాంగ్రెస్ నాయకులతోనే ‘ఇందిరా కాంగ్రెస్’ పేరిట పార్టీ దుకాణం తెరిపించి కాంగ్రెస్‌ను బతికించాలనీ, ఒకవేళ విభజన అంటూ జరిగితే కోస్తాంధ్ర ‘ఇందిరా కాంగ్రెస్’ను అప్పుడు తిరిగి తెలంగాణలోని సోనియా ‘బోటు’తోపాటు, కాంగ్రెస్ ఖాతాలోకి సాధికా రికంగానే కలిపేసుకోవచ్చుననీ కాంగ్రెస్ అధిష్టానం ఎత్తు గడ పన్నుతున్నది. చిత్తశుద్ధి లేని ఇంతటి విన్యాసాలు ఆమె సాహసించ డానికి కారణం - కొలది రోజుల నాడు వచ్చిన జాతీయ స్థాయి సర్వేక్షణలన్నీ ‘‘ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు నిర్వహిస్తే రెండు ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడవలసివస్తుందనీ, రాష్ట్రాన్ని విభ జించినా, విభజించకపోయినా ఈ ఓటమిని కాంగ్రెస్ చవి చూడకతప్పద’’నీ స్పష్టం చేయడమే! అందుకు పన్నిన కొత్త ‘చిట్కా’యే కోస్తాంధ్రలో ‘ఇందిరా కాంగ్రెస్’ పార్టీని ఆగమేఘాల మీద ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన! అక్కడ, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలనే తహతహే ఇందుకు కారణం. ఇందిరాగాంధీ వైఖరికి, సోనియా వైఖరికి దివికీ భువికీ మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా దేశంలో ఏర్పడి స్థిరత్వం పొందిన తెలు గుజాతిని విచ్ఛిన్నం చేయడానికి సుతరామూ ఇష్టపడక, దేశ సుస్థిరతకు ఏక జాతిగా ఏక భాషా ప్రాతిపదికపైన ఏర్పడిన రాష్ట్రాల సమైక్యతను, ప్రజల సంఘీభావాన్నీ చెక్కు చెదర్చరాదని 1972 నాటి పార్లమెంటులో రెండో అభిప్రాయానికి తావులేకుండా తెగేసి చెప్పిన ఘనత ఇంది రాగాంధీది! కనుక, తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలి, విడిపోతే అందరం చెడిపోతామన్న నినాదంతో సీమాం ధ్రలో పెల్లుబుకిన సమైక్య ఉద్యమాన్ని కాంగ్రెస్‌కు అను కూలంగా మార్చుకోవాలనే లక్ష్యంతోనే, విభజనను వ్యతి రేకించిన ఇందిరాగాంధీ పేరిట కోస్తాంధ్రలో పార్టీ ఏర్ప డితే ఇందిరపై ప్రేమాభిమానాలతో ప్రజలు ఓట్లు వేసి కాంగ్రెస్‌ను విజయపథం వైపు నడిపిస్తారని సోనియా కాంగ్రెస్ ఆశ. కానీ కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ‘ద్విదళ బీజం’! ఒకవైపున ఒక ప్రాంతంలో రాష్ట్ర ‘విభజన’కు స్వార్థ ప్రయోజనాలతో జెండా ఊపుతూ, మరొక వైపు అందుకు విరుద్ధమైన ప్రతిపాదన ద్వారా తెలుగు జాతి సమైక్యతను కాపాడి విశాలాంధ్ర ప్రగతిని కోరుకున్న ఇందిరా కాంగ్రెస్ పేరిట వేరే ‘దుకాణం’ తెరవాలని కోడలమ్మ సోనియా ‘జెండా’ ఊపటం ఏ రాజనీతి కిందికి, ఏ రకం రాజకీయం కిందికి వస్తుందో ‘రెండు నాల్కల’ ధోరణిలో పడిపోయిన సోనియా కాంగ్రెస్ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాలు చూసే ‘సత్తరకాయ’ (ఇన్‌ఛార్జి) అయిన దిగ్విజయ్‌సింగ్ లాంటి వాళ్లకే తెలియాలి! భాషాప్రయుక్త రాష్ట్ర సమైక్యతను తన పాలనలో ఇందిర చెదరగొట్టలేదు! ఆవిడ, కావాలని కాలికి అంటిన పేడను నెత్తికి పులుముకున్న నాయకురాలు కాదు! ఇందిరాగాంధీ రెండు కళ్లతో దర్శించిందీ, చూసిందీ ఒక్క పరిణామాన్నే - అదే ఆంధ్రప్రదేశ్ సమైక్యత, యావత్తు తెలుగు జాతి అవిచ్ఛిన్నమైన, అప్రతిహతమైన జమిలి పురోగతిని మాత్రమే! అందుకనే, ఎప్పటికీ మరవలేని సందేశాన్ని, హెచ్చరికగా, గుణపాఠంగా ఇందిరాగాంధీ 1972 నాటి పార్లమెంటు నిండు సభలో విభజనోద్యమాల పూర్వరంగంలో చేసిన ఆర్ద్రమైన ప్రకటనను, ఆప్తవాక్యాలను మరొక్కసారి తెలుగు వారందరూ, దారితప్పిపోతున్న రాజకీయపక్షాల నాయకులూ జ్ఞాపకం చేసుకోవడం అవసరం. ఇందిర మాటల్లోనే - ‘‘వెనుకబడిన ప్రాంతాలులేని రాష్ట్రం దేశంలో ఒక్కటి కూడా లేదు. తరతమ భేదాలతో వెనుకబడిన ప్రాం తాలూ, అభివృద్ధి చెందిన ప్రాంతాలున్న అన్ని రాష్ట్రాల లోనేగాక ఒకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో అలాంటి ప్రాంతాలు రాయలసీమ, శ్రీకాకుళం జిల్లా ల్లోనూ ఉన్నాయి. అలాగే తెలంగాణ ప్రాంతం కూడా వెనుకబడి ఉండటంతో పాటు అదే ప్రాంతంలోని మిగతా జిల్లాలతో పోల్చుకుంటే అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి. ఏదో ఒక ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోల్చు కున్నప్పుడు వెనుకబడి ఉన్నంత మాత్రాన ఎక్కడికక్కడ వేరుపడిపోవాలనడం హేతుబద్ధమైన కారణం కాదు. అలాంటి కారణంపై ఆధారపడి వెనకాముందు చూడ కుండా తీవ్రమైన నిర్ణయాలకు రాకూడదు. అలా అయితే ఈ ప్రక్రియకు అంతం ఎక్కడ? ఇలాంటి విషయాల్లో ఎక్కడ గిరిగీసుకుని కూర్చోవడం? ఈ లెక్కన ఒకే రాష్ట్రం లోని ప్రతి ఒక్క జిల్లా తాము వేరుపడి ఉండాలని కోరుకో గలదా? కాలచక్రాన్ని పాచిపట్టిన పాత పద్ధతులకు మళ్లి ద్దామా? చప్పన్నారు రాజ్యాల్లాంటి చిన్నచిన్న రాష్ట్రాలకు, సంస్థానాధీశుల ఇలాకాలకు మళ్లీ మరలిపోదామా? మళ్లీ వెనుకడుగు వేద్దామా? కేవలం వెనుకబాటుతనం పేరిట రాష్ట్ర విభజనను ఎవరూ కోరుకోజాలరు. ‘‘నేను ఇది వరకు కూడా చెప్పాను- కేవలం వేర్పాటు గురించి మాట్లాడినంత మాత్రాన వెనుకబాటుతనం అనే సమస్య పరిష్కారం కాదు, కాదు అని! వేర్పాటు ధోరణి మరో పెద్ద సమస్యకు దారితీస్తుంది. ఆ సమస్య ఇతర రాష్ట్రాలకే కాదు, ఏ ప్రాంతంలో అయితే ఆ వేర్పాటు వాదం తలెత్తుతుందో ఆ ప్రాంతానికో, ఆ రాష్ట్రానికో మరో పెద్ద సమస్యగా మారుతుంది. నా కట్టుబాటు సమైక్య రాష్ట్రానికే. మీరేదో వేరుపడి పోయినంత మాత్రాన మిగతా ప్రజల్ని వదిలించుకోవచ్చునని భావించడంగానీ లేదా వేర్పాటు సమస్య తీరిపోయిందని భావించడంగానీ కేవలం పసలేని ఆలోచన, నిరుపయోగమైన వాదన... ఆంధ్రప్రదేశ్ అనేక వేల ఏళ్లుగా విలక్షణమైన, విశిష్టమైన సాంస్కృతిక శక్తిగా ఉంటూ వచ్చింది. ఆంధ్రదేశం పేరు అతి ప్రాచీన బౌద్ధ వాంగ్మయంలోనే ఉంది. నేడు ఆంధ్ర ప్రదేశ్ రూపంలో ఉన్న భాగాలన్నీ చరిత్రలోనూ దీర్ఘకాలం పాటు ఒకే గొడుగు కింద ఉన్నాయి. భాషా రాష్ట్రాల సమస్య మన జాతీయోద్యమంలో అంతర్భాగంగా ఉంటూ వచ్చింది. వాస్తవం నుంచి వెనక్కి మళ్లే సమస్యే లేదు. వెనక బ్రిటిష్ ప్రావిన్సెస్‌లో విభిన్న ప్రాంతాలు ఉండి ఉండవచ్చు, కాని ఆ నాటి ప్రతీ ప్రావిన్షియల్ యూనిట్టూ భాషా ప్రాతిపదికపైనే ఉండేదని మరవరాదు. వివిధ రాష్ట్రాల ఆవిర్భావంలో మొత్తం మీద కనిపించేది హేతుబద్ధమైన ఏర్పాటే. అందువల్ల తాత్కాలిక భావో ద్రేకాలకు లోనైపోయి ఈ హేతుబద్ధమైన భాషాప్రయుక్త రాష్ట్రాల పునాదిని కూల్చకుండా అత్యంత జాగరూకతతో ఉండాలి’’ అని ఇందిర హెచ్చరించారు! నేటి కాంగ్రెస్ నాయకత్వం రాజకీయ నిరుద్యోగుల నినాదాలకు తలొగ్గి వాటికి ‘లాభ లబ్ధి’ కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చురేపుతోంది. ఇది ఆ పార్టీకి, తాత్కాలికంగా అది ఆధారపడుతున్న, ప్రజల మధ్య ‘సౌరు’ కోల్పోయిన కొన్ని ప్రతిపక్షాలకూ, వాటిలో అక్షరాస్యులైన మూర్ఖులకూ పిడుగుపాటుగా మారకముందే తొమ్మిది కోట్ల మంది తెలుగు ప్రజలను ఇప్పటికైనా శరణు వేడుకోవటం అవ శ్యం జరగాల్సిన పని! ‘విభజించి-పాలించే’ సామ్రాజ్య వాద దుర్నీతికి శాశ్వత దాఖలాలుగా చరిత్రలో పాఠాలుగా నిలిచి పోయినవీ, ఈ రోజుకీ తేరుకోలేనివీ - పునరేకీకరణ జరిగిన ఒక్క వియత్నాం మినహా రెండు జర్మనీలు, రెండు కొరియాలు, బదాబదలైన యుగోస్లావియా విభజన! -
సమైక్య సునామి సృష్టిద్దాం
వైవీయూ, న్యూస్‌లైన్ :సమైక్యవాదులు సృష్టించే సునామీలో విభజన వాదం కొట్టుకుపోతుందని ప్రముఖ న్యాయవాది వీణా అజయ్‌కుమార్ అన్నారు. శనివారం నగరంలోని పొట్టిశ్రీరాములు విగ్రహ కూడలి వద్ద సర్వమత సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత పొటిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో ముస్లిం, హిందూ, క్రైస్తవ మతపెద్దలు హజరత్ మౌలాన ముఫ్తి సయ్యద్ ముగ్దుమ్సాహెబ్, విజయ్‌స్వామి, రాజేష్‌స్వామి, ఫాదర్ కనకరాజుల ప్రార్థనలతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వీణా అజయ్‌కుమార్ మాట్లాడుతూ కులాలకు, మతాలతకు అతీతంగా మనమంతా ఒక్కటే, మనలక్ష్యం కూడా సమైక్యాంధ్ర ఒక్కటే అన్న నినాదంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమైక్యాంధ్రకు ప్రజలే నాయకులుగా వ్యవహరిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత సీమాంధ్రలో ఆందోళనల వేడి ఢిల్లీకి చేరడంతో డిసెంబర్ 23 ప్రకటన వచ్చిందన్నారు. దీంతో సీమాంధ్ర నాయకులు, ప్రజలు శాంతించారన్నారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అలుపులేకుండా ఉద్యమాలు చేస్తూనే ఉండటంతో కేంద్రప్రభుత్వం వారిపట్ల మొగ్గుచూపిందన్నారు. అలా కాకుండా అప్పటి నుంచి సమైక్యవాదాన్ని కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ప్రస్తుతం ప్రతికుటుంబానికి హైదరాబాద్‌తో అనుబంధం ఏర్పడిందని, దాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరన్నారు. ముస్లిం మతగురువు హజరత్ మౌలాన ముఫ్తి సయ్యద్ ముగ్దుమ్సాహెబ్ మాట్లాడుతూ అఖండ భారతావనిలో రాష్ట్రాలను ముక్కలుగా చేయడం తగదన్నారు. క్రైస్తవ మతగురువు కనకరాజు మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండే తెలుగుజాతిని చీల్చాలనుకోవడం తగదన్నారు. హిందూ మతపెద్దలు విజయ్‌స్వామి, రాజేష్‌స్వామి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా నిర్వహించే ఈ ఉద్యమం విజయవంతం అవుతుందన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ఎన్జీఓ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, యాజమాన్యాలు సంఘీభావం ప్రకటించారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, నగర కన్వీనర్ ఎస్.బి.అంజాద్‌బాషా, కాంగ్రెస్ నాయకులు కందుల రాజమోహన్‌రెడ్డి, గౌస్‌పీర్, జేఏసీ నాయకులు రామచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, ఇంటాక్ కన్వీనర్ ఎలియాస్‌రెడ్డి ప్రసంగించారు. జయనగర్ కాలనీ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు ‘ఆలోచించండి ఓ విభజన వాదుల్లారా..’ అంటూ చేసిన నృత్యగీతం అందరినీ అలరించింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భాస్కర్‌వర్మ, షంషుద్దీన్, సురేష్, ప్రకాష్, ఫారుఖ్, నవనీశ్వర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రవికిరణ్‌రెడ్డి, రాణా, లోకా, ఓ. రవి, వై.రవి, సుబ్బారెడ్డి, అమెరికన్ మాంటిస్సోరి విద్యార్థులు, ఆక్స్ఫర్డ్ పాఠశాల విద్యార్థులు, మార్వాడిసంఘ సభ్యులు పాల్గొన్నారు. -
ఊరూవాడా ప్రతిధ్వనిస్తోన్న సమైక్య భేరి
సాక్షి నెట్వర్క్: వేర్పాటు ప్రకటన వెనక్కి వెళ్లే వరకు సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యపోరాటం ఆగేలా కనిపించడం లేదు. పద్దెనిమిది రోజులుగా ఉద్ధృతంగా సాగుతున్న ఉద్యమం రోజురోజుకీ స్వరూపం మార్చుకుంటూ మరింత బలపడుతోంది. స్వచ్ఛందంగా ప్రజలు చేపట్టిన పోరాటానికి ఐదురోజులుగా సకల జనుల సమ్మె తోడవడంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పాలన స్తంభిస్తోంది. ప్రభుత్వకార్యాలయాలు, స్కూళ్ల మూసివేత కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు కదలడం లేదు. ఎన్జీవోలకు సమ్మెకు బాసటగా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనప్రదర్శనలు, మానవహారాలు, సోనియా, దిగ్విజయ్‌సింగ్, బొత్స, చిరంజీవి, కేసీఆర్‌ల దిష్టిబొమ్మల దహనాలు, శవయాత్రలు శనివారం కూడా అన్నిచోట్లా హోరెత్తాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో సమైక్య ఉద్యమం చేపట్టిన పాలవ్యాపారులకు సంఘీభావం ప్రకటించేందుకు వచ్చిన టీడీపీ నేత అంబికా కృష్ణను నిరసనకారులు అడ్డుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టమైన వైఖరి ప్రకటించనందున ఆ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే ఉద్యమంలో పాల్గొనాలని అంబికాకృష్ణకు తేల్చిచెప్పారు. టీడీపీకి చెందిన అనంతపురం జిల్లా పెనుకొండ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డిలకు హిందూపురం పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. వారి వాహనాలను ఉపాధ్యాయ జేఏసీ నాయకులు అడ్డుకుని చంద్రబాబుతో సమైక్యనినాదం చేయించాలని పట్టుబట్టారు. పార్ధసారధి నిరసనకారులను సముదాయించే యత్నం చేయగా, ‘చెవిలో పువ్వు పెట్టే మాటలొద్దు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఎలా ఇచ్చారని మీ పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెండి’ అని స్పష్టం చేశారు. అనంతపురంఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రోడ్డుపై ఊడ్పులు ఊడ్చి... తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో వ్యవసాయ శాఖ ఉద్యోగులు రోడ్డుపై ఊడ్పులు ఊడ్చి నిరసన తెలిపారు. రామచంద్రపురం పట్టణంలోకి వచ్చే అన్ని రహదారులను జేఏసీ ఆధ్వర్యంలో దిగ్బంధించారు. కాకినాడ, తునిలలో ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ బస్సులతో ర్యాలీలు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజక వర్గాల్లో కొనసాగింది. రాజమండ్రి బస్సు యాత్రలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, అమలాపురం బస్సు యాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి పాల్గొన్నారు. యానాం బంద్ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలోని యానాంలో తెలుగువారు సమైక్యంగా ఉండాలంటూ బంద్ పాటించారు. పశ్చిమగోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష మూడో రోజుకు చేరింది. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన వికలాంగుడు కేతా శ్రీనివాసరావు మోటారు సైకిల్‌పై చేస్తున్న యాత్ర భీమవరం చేరుకోగా, జేఏసీ నాయకులు స్వాగతం పలికి అతన్ని అభినందించారు. బొత్స ఇంటి ముట్టడిలో ఉద్రిక్తత సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తక్షణమే తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరంలో ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో మంత్రి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ ఇంటిని ముట్టడించారు. కోట జంక్షన్ నుంచి ర్యాలీగా వస్తున్న ఉపాధ్యాయులపై పోలీసులు దురుసుగా వ్యవహరించడంతో అర్ధగంటసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 15 వేలమందితో ర్యాలీ నెల్లిమర్లలో ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ విజయనగరం-పాలకొండ రహదారిని సమైక్యవాదులు దిగ్బంధించారు. స్థానిక ఆర్వోబీ నుంచి చంపావతి బ్రిడ్జి వరకూ 3 కిలోమీటర్ల మేర 15 వేల మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు. వంగపండు ఆటాపాటా పార్వతీపురంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినూత్న తరహాలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాగాయకుడు వంగపండుప్రసాదరావు తన ఆటాపాటాతో అలరించారు. చీపురుపల్లిలో మహిళా ఉపాధ్యాయులు ప్రధాన రహదారి మోకాళ్ళపై నడిచి నిరసన తెలిపారు. శింగరకొండ దేవాలయం మూత ప్రముఖ పుణ్యక్షేత్రమైన ప్రకాశం జిల్లా శింగరకొండ దేవాలయాన్ని గంటపాటు మూసివేసి నిరసన తెలిపారు. దేవాదాయశాఖ సిబ్బంది ఆలయం బయట ధర్నాకు దిగారు. ఒంగోలు డిపో ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. ఒంటెలతో ప్రదర్శన విశాఖ జిల్లా వేపగుంటలో వైఎస్సార్సీపీ నాయకులు ఒంటె లతో ప్రదర్శన నిర్వహించారు. విజయమ్మ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా వైఎస్సార్సీపీ నేతలు విశాఖ ఎంవీపీకాలనీలో బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాలాంధ్ర బస్సు యాత్ర విశాఖ చేరుకుంది. యాత్ర కార్యదర్శి రవితేజ ఏయూలోని విద్యార్థుల దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా రేపు ఏజెన్సీ బంద్ విజయమ్మ దీక్షకు మద్దతుగా విశాఖ ఏజెన్సీలోని 11మండలాల్లో సోమవారం బంద్ పాటిస్తున్నట్లు పాడేరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సీకరి సత్యవాణి తెలిపారు. విజయమ్మ చేపడుతున్న దీక్షకు ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ విశాఖ జిల్లా చోడవరం యూనిట్ శనివారం మద్దతు ప్రకటించింది. విశాఖ జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద సమైక్యాంధ్ర కోసం ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు మాడుగుల ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ప్రకటించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. విజయవాడలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు భారీ ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో సమైక్యవాదులు కిలో ఉల్లిని రూ.10లకు విక్రయించారు. రోడ్డుపై వరినాట్లు గుంటూరు నగరంలో వ్యవసాయశాఖ జిల్లా యంత్రాంగం నిరసన ప్రదర్శనతో పాటు రోడ్డుపై వరినాట్లు వేశారు. ఆదర్శరైతులు సైతం ట్రాక్టర్లు కట్టుకుని ప్రదర్శన, మానవహారాల్లో పాల్గొన్నారు. మాచర్లలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రదర్శన, రాస్తారోకో చేపట్టారు. విధులు బహిష్కరించిన మున్సిపల్ కమిషనర్ చిలకలూరిపేటలో మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్, గెజిటెడ్ అధికారులు విధులు బహిష్కరించి సంఘీభావం తెలిపారు. విజయమ్మ దీక్షకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థి యూనియన్ సంఘీభావం ప్రకటించింది. పొన్నూరులో టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర క్విట్ సోనియా నినాదంతో శనివారం నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. గుంటూరులో ఆదివారం నుంచి తాను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి శనివారం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీలో నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. బీజేపీ కార్యాలయం ముట్టడి అనంతపురం నగరంలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి బీజేపీ పదాధికారుల సమావేశాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఎస్కేయూలో జేఏసీ నేతలు రక్తదానం చేసి నిరసన తెలిపారు. కర్నూలులో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కోట్ల, మంత్రి టీజీ వెంకటేష్ కార్యాలయాలను ముట్టడించారు. బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ మంత్రాలయంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, రాఘవేంద్ర సర్కిల్లో మానవహారం నిర్మించారు. శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న ఎంసెట్ కౌన్సెలింగ్ విధులకు హాజరు కావడం లేదని బోధన, బోధనేతర సిబ్బంది శనివారం అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ దశరథరామయ్యకు లేఖ ఇచ్చారు. మహిళా భేరి సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి నేతృత్వంలో శనివారం వేలాది మందితో మహిళా భేరి నిర్వహించారు. విభజన వద్దంటూ మహిళలు గళమెత్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ముస్లిం మైనారిటీలు సుమారు 3వేల మంది శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సమ్మె నోటీసు తిరస్కరించినందుకు ఎస్సీడీసీఎల్ సీఎండీ రమేష్ దిష్టిబొమ్మను ట్రాన్స్‌కో ఉద్యోగులు దహనంచేశారు. సోనియాది తొందరపాటు నిర్ణయం: ఎంపీ రాయపాటి తెలంగాణవాదుల డిమాండ్లకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు. గుంటూరులోని హిందూ కళాశాల సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుండా ముందడుగు వేసిన పక్షంలో రాజకీయాల నుంచి శాశ్వతంగా నిష్ర్కమిస్తానని ప్రకటించారు. -
ఈనెల 30 వరకూ సీమాంధ్ర న్యాయవాదుల విధుల బహిష్కరణ
సాక్షి, రాజమండ్రి : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, సీమాంధ్ర జిల్లాల్లోని 35వేల మంది న్యాయవాదులు ఈ నెల 30 వరకూ విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుబ్బారావు కోరారు. సీమాంధ్ర జిల్లాల న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు శనివారం రాజమండ్రిలో సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సమావేశం డిమాండ్ చేసిందన్నారు. ఈనెల 31న గుంటూరులో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తుందని చెప్పారు. -
హైదరాబాద్‌లో ఓటింగ్ పెట్టి చూడండి:భూమా నాగిరెడ్డి
కర్నూలు: రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పెట్టి చూస్తే..ఎక్కువ మంది దేనికి మద్దతు ఇస్తున్నారో తేలిపోతుందని వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. రాజకీయ నేతల తీరుపై మండిపడ్డ భూమన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాజకీయ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. విభజన జరిగిందని ఒకసారి, జరగలేదని మరొకసారి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర రాజకీయ నేతలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారి ఓటింగ్ పెడితే ప్రజలు సమైక్యాంధ్రాకే మద్దతిస్తారని తెలిపారు. సమైక్యాంధ్ర మద్దతుగా ఉద్యమం మరింత ఊపందుకుంది. రాష్ట్ర విభజన అంశంపై సీమాంధ్ర ఆందోళన కారులు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. -
మేరా భారత్ మహాన్
జాతీయ భావం... సమైక్య వాదం మువ్వన్నెల రెపరెపల నడుమ హోరెత్తిన నినాదం సాక్షి, నెట్వర్క్: మువ్వన్నెల పతాక రెపరెపలకు సమైక్య నినాదం శృతి కలిసింది. సమైక్యాం ధ్ర పరిరక్షణ లక్ష్యంగా ఉద్యమిస్తున్న సకలజనులు గురువారం స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూనే సమైక్యాంధ్ర ఆకాంక్షనూ ఎలుగెత్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగులు అధికారికంగా జరిగిన స్వాతంత్య్రదినోత్సవంలో పాల్గొనకుం డా అక్కడే వేరుగా జాతీయజెండా ఎగురవేశశారు. కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరంలో ‘సమైక్యాంధ్రపై కవి సమ్మేళనం’ నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట, కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంవద్ద జాతీయ, సమైక్య పతాకాలను పక్కపక్కనే ఎగురవేశారు. ముమ్మిడివరంలో జేఏసీ నేతలు పెన్మత్స జగ్గరాజు, కోనా శ్రీనివాసరావు, బీవీఆర్ చౌదరిల ఆధ్వర్యంలో సమైక్యవాదులు గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆరు రోజులుగా ఆమరణదీక్ష చేస్తున్న మంత్రి తోట నరసింహం సతీమణి వాణి ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్యులు తెలిపారు. కేంద్రమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... ఫోన్లో మంత్రి తోట నర్సింహం, వాణితో మాట్లాడి దీక్షను విరమించాలని కోరారు. టీడీపీ కి చెందిన రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సీతానగరం కస్తూర్బా ఆశ్రమం ఎదుట గాంధీలా కర్ర చేత పట్టుకుని నిలబడి ఎనిమిది గంటలు దీక్ష చేశారు. శ్రీకాకుళంలో స్వర్ణమంజరి అంధుల పాఠశాల విద్యార్థులు గాంధీ, నెహ్రూ, వివేకానందుడు, అల్లూరి సీతారామరాజు, తెలుగు తల్లి వేషధారణలతో ర్యాలీ తీశారు. జేసీస్ ఫెమీనా ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ కుండలతో ప్రదర్శన నిర్వహించారు. ఇచ్ఛాపురంలోని అన్ని పాఠశాలల విద్యార్థులు బస్టాండ్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో జెండా వందనం సందర్భంగా సమైక్యాంధ్ర ఆవశ్యకతపై ఉద్వేగంగా మాట్లాడుతూ సర్పంచ్ మల్లిపెద్ది ధనలక్ష్మి స్పృహతప్పి పడిపోయారు. పాలకొల్లులో మూడోరోజూ బంద్ కొనసాగింది. తాడేపల్లిగూడెంలో విద్యార్థులు రాష్ర్ట చిత్రపటం ఆకారంలో కూర్చుని సమైక్యాంధ్ర కు మద్దతు తెలిపారు. విశాఖ ఆంధ్రాయూనివర్సిటీలో ఐక్య విద్యార్థి ఫ్రంట్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం జరిగింది. గోపాలపట్నంలో ఎన్ఎంయూ ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్‌లకు పెద్దకర్మ నిర్వహించారు. ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. అనకాపల్లిలో గుడ్ షెపర్డ్ విద్యార్థులు వెయ్యి అడుగుల భారీ పతాకాన్ని ప్రదర్శించారు. విజయనగరంలో ఆర్టీసీ సంఘాల ఐక్యవేదిక, న్యాయవాదుల సంఘం సభ్యులు, ఎన్జీఓలు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ నుంచి ఎత్తుబ్రిడ్జి వరకు ర్యాలీగా వెళ్లి రాజీవ్ విగ్రహం ఎదురుగా భారీ మానవహారం నిర్మించారు. పార్వతీపురంలో సమైక్యవాదులు కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. చీపురుపల్లిలో ఆర్ఈసీఎస్ ఉద్యోగులు బైక్ ర్యాలీ, మూడురోడ్ల జంక్షన్లో మానవహారం నిర్వహించారు. వర్షంలోనూ సమైక్యం...: ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తున్నా నెల్లూరు జిల్లాలో ఆందోళనకారులు ఉద్యమాన్ని కొనసాగించారు. నెల్లూరులో ఆర్టీసీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి వంటావార్పు, మానవహారం, ర్యాలీలు నిర్వహించారు. సూళ్లూరుపేటలో ఆందోళనకారులు జాతీయ జెండాకు బదులుగా సమైక్యాంధ్ర జెండాను ఎగురవేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కనిగిరిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ముక్కు కాశిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ప్రతిజ్ఞ బూనారు. ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో శంకర్‌విలాస్‌సెంటర్, హిందూకళాశాల కూడలి, లాడ్జిసెంటర్ వద్ద కార్యకర్తలతో ప్రదర్శన, మానవహారం చేశారు. జిల్లాలో అన్నిచోట్లా వైఎస్ఆర్ సీపీ నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. చిలకలూరిపేటలో ఆర్టీసీ కార్మికులు రాస్తారోకో చేశారు. తెనాలి, మంగళగిరి, మాచర్లలో వైఎస్సా ర్ సీపీ నేతలు ఆధ్వర్యంలో సోనియా, కేసీఆర్, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మలను ఊరేగించారు. పలువురు ఎన్జీవోలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన అవార్డులను తీసుకోలేదు. మున్సిపల్ ఉద్యోగులు విజయవాడలో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలు రెండోరోజు కొనసాగుతున్నాయి. జగ్గయ్యపేట, పెనుగంచిప్రో లు మండలాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతున్నాయి. చిల్లకల్లులో గ్రామస్తులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. గంగూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేశారు. రెగ్యులర్ వైద్య సేవలు బంద్: అనంతపురంలో పంచాయతీరాజ్ జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి మద్దతు పలికారు. ఈనెల 19 నుంచి జరిగే ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ నాయకులు ప్రకటించారు. శుక్రవారం నుంచి అత్యవసర వైద్యసేవలు మినహా రెగ్యులర్ వైద్య సేవలను బంద్ చేస్తున్నామని వైద్య ఆరోగ్య జేఏసీ నాయకులు తెలిపారు. ధర్మవరంలో వెయ్యి అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సమైక్యవాదం ఢిల్లీకి వినిపించేలా ప్రజలందరూ కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ విజయవాడలో చేపట్టనున్న దీక్షకు మద్దతుగా కళ్యాణదుర్గంలో వైఎసార్ కాంగ్రెస్ పార్టీ ట్రే డ్ యూనియన్ నాయకులు రిలే దీక్షలు ప్రారంభించారు. రాయదుర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఎస్ఎస్ వలీకి ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలులో సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 15వ రో జూ కొనసాగాయి. ఆత్మకూరులో జ్యువెలర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలేదీక్షలకు వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ జెండాతోపాటు నల్లజెండాను ఎగురవేసి నిరసన తెలిపారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట సమైక్యవాదులు కేంద్రమంత్రుల ఫొటోలను కుక్కలు, గుంటనక్కల రూపాల్లో చిత్రించి నిరసన తెలిపారు. విభజన ఆందోళనతో ఆత్మహత్య గుత్తి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయనే నిరాశతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జక్కలచెరువుకు చెందిన మోహన్, రంగమ్మ కుమారుడు రంగస్వామి (24) గ్రాడ్యుయేషన్ తరువాత ఐటీఐ చేశారు. విద్యుత్ సంస్థలో పోల్ టు పోల్ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ కొంతకాలం క్రితం ప్రమాదానికి గురయ్యాడు. అప్పటి నుంచి గ్రామంలో చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తుండేవాడు. రాష్ట్రం విడిపోతే మళ్లీ ఉద్యోగం రాదనే ఆందోళనతో గురువారం సూసైడ్ నోట్ రాసి.. గ్రామానికి సమీపంలోని పొలానికి వెళ్లి క్రిమి సంహారక మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
‘దీక్షా’ధారులు .. వైఎస్సార్ సీపీ నేతల నిరశన
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు నిరవధిక నిరహారదీక్షలు చేపడుతున్నారు. ఆరోగ్యపరిస్థితి విషమిస్తున్నా సమైక్యమే ధ్యేయంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కడప కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డిలు చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారంతో మూడోరోజుకు చేరింది. వీరికి సంఘీభావం పలికేందుకు వస్తున్న జనసందోహంతో ఆ ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం రాత్రికి రవీంద్రనాథరెడ్డికి షుగర్ లెవెల్స్ 50, శ్రీకాంత్‌రెడ్డికి 70కి పడిపోయినా మొక్కవోని లక్ష్యంతో దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవడు గొట్టిపాటి భరత్ చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం 5వ రోజుకు చేరింది. భరత్‌తో పాటు దీక్షలో కూర్చున్న పొదిలి రాఘవ, యద్దనపూడి హరిప్రసాద్, భూక్యా రాజానాయక్ల ఆరోగ్యం క్షీణించడంతో నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భరత్‌కు మద్దతుగా బుధవారం పర్చూరులో బంద్ పాటించారు. ఇక కనిగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త రాజాల ఆదిరెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా హిందూపురం వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చౌళ్లూరు రామకృష్ణారెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మూడవ రోజుకు చేరింది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం రాజమండ్రి నగర కన్వీనర్ గుర్రం గౌతం, మరో ఇద్దరు యువజన నాయకులు పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, సాల్మన్‌రాజు బుధవారం రాజమండ్రిలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన దళిత నేత గొసుమస్తాన్రావు బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. నెల్లూరు వేదాయపాళెంలో వైఎస్సార్సీపీ రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేపట్టిన నిరసన దీక్షను ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రారంభించారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలో వైఎస్సార్ సీపీ నేత మక్కువ శ్రీధర్ మంగళవారం చేపట్టిన 48 గంటల నిరవధిక నిరాహార దీక్ష బుధవారం కూడా కొనసాగింది. నేటి నుంచి ఆకేపాటి, కొరముట్ల ఆమరణదీక్ష వైఎస్సార్ జిల్లా రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటిఅమర్నాథ్రెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. -
తెలంగాణ వర్సెస్ సమైక్యం
హైదరాబాద్, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇరు సంఘాల ఉద్యోగులు తెలంగాణ, సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఏపీఎన్జీవో పిలుపు మేరకు మంగళవారం కోఠిలోని డీఎంహెచ్ఎస్లో ఆ సంఘం ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. డీఎంహెచ్‌ఎస్‌లోని కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం, డీఎంఈ, డీహెచ్, వైద్యవిధాన పరిషత్ తదితర కార్యాలయాలలోని తోటి సీమాంధ్ర ఉద్యోగులను నిరసనలో పాల్గొనాలని కోరారు. అనంతరం డీఎంహెచ్ఎస్ క్యాంపస్‌లో ర్యాలీలు నిర్వహించారు. అదే సమయంలో టీఎన్జీవోలు, టీజీవోలు, ఇతర తెలంగాణ ఉద్యోగులు సద్భావన యాత్ర పేరిట భారీ ర్యాలీ నిర్విహ ంచారు. దీంతో ఇరుసంఘాల ఉద్యోగులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో క్యాంపస్ మార్మోగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఏపీఎన్జీవోల ఉద్యోగులను డీఎంహెచ్ఎస్ నుంచి పంపించి వేశారు. ఇంతలోనే తెలంగాణ ఉద్యోగుల ర్యాలీ వద్దకు టీఎన్జీవోల అధ్యక్ష, కార్యదర్శులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి వచ్చారు. అయితే సుల్తాన్‌బజార్ ఏసీపీ సోమేశ్వరరావు నేతృత్వంలో వారిద్దరినీ అరెస్ట్ చేసి, అఫ్జల్‌గంజ్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగులు ఒక్కసారిగా స్టేషన్ గేటు వైపు దూసుకురావడంతో పోలీసులు ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. ఇంతలోనే టీజీఓ అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ అక్కడకు చేరుకోవడంతో వారిని సైతం పోలీసులు అరెస్ట్ చేసి సుల్తాన్‌బజార్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, అరెస్టయినవారిని ఎంతకీ విడిచిపెట్టకపోవడంతో ఆగ్రహించిన టీఎన్జీవోలు, టీజీవోలు సుల్తాన్‌బజార్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించారు. అరెస్టయిన వారికి మద్దతుగా తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఆర్వీ మహేందర్‌కుమార్ తదితరులు ఇన్స్పెక్టర్ ఆనంద్‌ను నిలదీశారు. ఉద్యోగులు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించడంతో అక్కడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చేయిదాటి పోతుండడంతో అరెస్టు చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు. అనంతరం దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టడానికే ప్రభుత్వం, సీమాంధ్ర మంత్రులు, పెట్టుబడిదారులు ఏపీఎన్జీవోలతో సమైక్యాంధ్ర సమ్మెను చేయిస్తున్నారని ఆరోపించారు. బుధవారం నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భోజన విరామ సమయంలో ధర్నా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. టీజీవో అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ, ఏపీఎన్జీవోలు అధ్యక్షులు అశోక్‌బాబు తెలంగాణ వారిని కుక్క అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉపేక్షిస్తే .. ఉద్యమిస్తాం.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమేనని తెలంగాణ జిల్లాల్లోని ఉద్యోగులు అన్నారు. సీమాంధ్రలో తెలంగాణవాదులను, ఉద్యమ నేతలను కించపరుస్తూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఏపీ ఎన్జీవోలు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమన్నారు. ఆరుదశాబ్దాల కల..తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట నీ, దీనిపై ఉపేక్షిస్తే.. మళ్లీ ఉద్యమిస్తమని వారు హెచ్చరించారు. సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు సహకరించాలని తెలంగాణ ఉద్యోగులు కోరారు. కేంద్ర సంఘం పిలుపు మేరకు టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా అన్ని డివిజన్‌స్థాయి కార్యాలయాలతోపాటు కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు నిరసనలు తెలిపారు. భోజన విరామ సమయంలో కలెక్టరేట్లలో ధర్నాలు నిర్వహించారు. వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆందోళనలు జరిగారుు. టీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ల అరెస్ట్‌కు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కరీంనగర్లో వివిధ శాఖల ఉద్యోగులు బైక్‌ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. నీటిపారుదలశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎల్ఎండీ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు బైక్‌ర్యాలీతో శాంతి ర్యాలీ నిర్వహించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యోగులు కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల ఎదుట, నిర్మల్, మంచిర్యాలలో ఆర్డీవో కార్యాలయాల ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఖమ్మం, నల్లగొండ జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా సంగారెడ్డిలోని కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులు ఆయా డిపోల ఎదుట ధర్నాలు కొనసాగిం చారు. రంగారెడ్డి జిల్లా పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు నిరసన తెలిపారు. -
తిరుమలలో బస్సుల పునరుద్ధరణ
సాక్షి, తిరుమల: సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా మంగళవారం తిరుమల కొండకు 38 ఏళ్ల తర్వాత ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. అయితే, ఆర్టీసీతో టీటీడీ అధికారులు జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం రాత్రి 11 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బస్సులను పునరుద్ధరించారు. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు రోజుకు సుమారు 500 బస్సు సర్వీసులు 3,200 ట్రిప్పులు తిప్పుతున్నారు. దీనివల్ల రోజుకు సరాసరిగా రోజుకు 40వేల మందిని తిరుమలకు చేరవేస్తున్నారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.35 లక్షల మేర ఆదాయం సమకూరుతోంది. సమ్మెలో భాగంగా తిరుమల డిపోకు తాళం వేయడంతో అందులోని 106 బస్సులు ఆగిపోయాయి. తిరుపతి, అలిపిరి, మంగళంతోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల బస్సులు కూడా డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్, టీటీడీ ఈవో ఎంజీ గోపాల్, తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ బాబు తదితరులు కలసి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరాజ్, కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపారు. అరగంట పాటు సాగిన ఈ చర్చల్లో తిరుమలకు బుధవారం వేకువజామున నుంచి బస్సులు నడిపేందుకు కార్మిక సంఘా లు అంగీకరించాయి. తిరుమల డిపోకు చెందిన 107 బస్సులను మాత్రమే నడపాలని, ఇవి కూడా అలిపిరి వద్ద ఉన్న బాలాజీ బస్టేషన్ వరకు నడపాలని నిర్ణయించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండ టానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక సంఘాల నేతలు ప్రభాకర్, చల్లా చంద్రయ్య తెలిపారు. -
సమైక్య గర్జన
సాక్షి, నెల్లూరు : సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీతో పాటు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థులు, ఎన్జీఓ సంఘాలు సోమవారం సమైక్య ఉద్యమాన్ని హోరెత్తించారు. నేషనల్ హైవేపై వంటా వార్పు నిర్వహించి రాకపోకలను దిగ్బంధించారు. హరనాథపురం సెంటర్లో నేతలు రాస్తారోకో నిర్వహించారు. దీంతో నాలుగు మార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది. కావలిలో ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి సమైక్య ఉద్యమానికి మద్దతు పలికారు. గూడూరులో వైఎస్సార్సీపీ నేతలు జేఏసీతో కలిసి దీక్షలు చేపట్టారు. సోమవారం అర్ధరాత్రి నుంచి 71 విభాగాలకు సంబంధించిన ఎన్జీఓలు దాదాపు 50 వేల మంది సమ్మె బాటపట్టారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉద్యమకారులు వంటా వార్పుతో పాటు ర్యాలీలు, రాస్తారోకోలు, సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయడంతో పాటు సమైక్యాంధ్ర ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఎన్జీఓ నాయకులు తేల్చి చెబుతున్నారు. రాబోయే కాలంలో జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతం కానుంది. నగరంలో సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ, ఎన్జీఓల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీఎం కాంపౌండ్ నుంచి మద్రాసు బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మినీబైపాస్ రోడ్డులోని హరనాథపురం సెంటర్లో రాస్తారోకో చేసి రాకపోకలను దిగ్బంధించారు. కృష్ణచైతన్య కళాశాల విద్యార్థులు జెడ్పీ నుంచి ఆత్మకూరు బస్టాండు సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కావలిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలోని ఆర్టీసీ సెంటర్ నుంచి జెండా చెట్టు వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆర్టీసీ సెంటర్లో వంటా వార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. కావలికి వచ్చిన లక్ష్మీపార్వతి జేఏసీ శిబిరంలో కూర్చొని మద్దతు ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సోనియా గాంధీ బ్రిటిష్ పాలకుల్లాగా దేశాన్ని విభజించి పాలించాలని చూస్తుందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు ఓట్లు, సీట్లు ప్రాతిపదికగా రాష్ట్ర విభజనకు పూనుకుందని విమర్శించారు. 70 శాతం మంది తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని కోరుకోవడం లేదన్నారు. పొదలకూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, హెల్త్ అండ్ మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. గూడూరులో వైఎస్సార్సీపీ, జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు నిరసనలు వ్యక్తం చేశారు. టవర్ క్లాక్ కూడలిలోని దీక్షా శిబిరంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల కన్వీనర్ మల్లు విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు కూర్చున్నారు. రాస్తారోకో నిర్వహించారు. ప్రధాన మార్గంలో కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. చిల్లకూరు మండలంలోని బల్లవోలులో యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చింతవరం అంబేద్కర్ కూడలి ప్రాంతంలో మానవహారం ఏర్పాటు చేసి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాల ఆటో కార్మికులు కోట, విద్యానగర్ల్లో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. కోట గాంధీబొమ్మ సెంటర్ వద్ద కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉదయగిరి తహశీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులు నిరాహార దీక్ష చేశారు. దుత్తలూరు బస్టాండు సెంటర్లో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వరికుంటపాడు మండలం కొండాయపాళెంలో బస్టాండు సెంటర్లో జేఏసీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. వింజమూరు బస్టాండు సెంటర్లో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బుచ్చిరెడ్డిపాళెంలో ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు. పాఠశాలలు, కళాశాల విద్యార్థులు సైతం ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. కొడవలూరులో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో అల్లూరు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై వాలీబాల్ ఆడారు. నార్తురాజుపాళెం ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరిలో మోటారు వెహికల్ మెకానిక్‌లు, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం, ఆటో కార్మికులు, ఎలక్ట్రికల్ కార్మికులు పట్టణంలోని పాల కేంద్రం వద్ద వాహనాలను అడ్డుకున్నారు. రెండు గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా పట్టణంలో దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. సూళ్లూరుపేటలో ఏపీ ఎన్జీఓ తాలూకా కార్యదర్శి జనార్దన్ ఆధ్వర్యంలో మండలంలోని మెడికల్ విభాగం సిబ్బంది స్థానిక ప్రభుత్వాసుపత్రి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సెంటర్లో మానవహారంతో నిరసన తెలిపారు. పట్టణంలోని రామలింగ చౌడేశ్వరి మహిళా సేవా సమాజం ప్రతినిధులు, కార్యకర్తలు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన చేశారు. వీరు కూడా మానవహారంలో పాల్గొన్నారు. స్థానిక గోకులకృష్ణా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు స్థానిక హోలీక్రాస్ సెంటర్ నుంచి బజారువీధుల్లో ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌లో మానవహారం నిర్వహించారు. ఆత్మకూరులో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వాసిలిలో పాఠశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
లోక్‌సభలో ‘సమైక్య’ సెగలు
కృష్ణుడి వేషధారణలో ఎంపీ శివప్రసాద్ నిరసన సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అంశం మరోసారి లోక్‌సభలో నిరసనల పర్వానికి దారితీసింది. సోమవారం ఒకవైపు వర్షాకాల సమావేశాలు రెండోవారంలోకి ప్రవేశించగా.. మరోవైపు సమైక్యాంధ్ర, కేరళలో సోలార్ ప్యానెల్ కుంభకోణం అంశాలపై ప్రతిపక్షాలు సభను స్తంభింపజేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ కుంభకోణం, కిష్ట్వార్లో హింస అంశాలను కూడా బీజేపీ సభ్యులు సభలో ప్రస్తావించారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ కృష్ణుడి వేషధారణలో వచ్చి సభలో నిరసన తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఇతర టీడీపీ ఎంపీలు ప్లకార్డులు, నినాదాలతో తమ ఆందోళన వ్యక్తపరిచారు. డిప్యూటీ స్పీకర్ కరియా ముండా దీనిపై అసహనం వ్యక్తంచేశారు. ‘‘ఈ రోజు సభలో పలువురు సభ్యుల వైఖరి సభా మర్యాదను పూర్తిగా మంటగలిపేలా ఉంది. కొందరు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేస్తే.. ఒక సభ్యుడైతే సభలో వేణువు వాయించడానికి యత్నించారు..’’ అని అసహనం వ్యక్తంచేశారు. ఉదయం సభ ప్రారంభం కాగానే వామపక్ష పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. సోలార్ ప్యానెల్ కుంభకోణం విషయంలో కేరళ సీఎం ఊమెన్ చాందీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలు కొనసాగడంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. సభ పునఃప్రారంభమయ్యాక కూడా ప్రత్యేక బోడోలాండ్ కావాలంటూ కోక్రాజర్కు చెందిన ఓ ఎంపీ ప్లకార్డు ప్రదర్శించారు. ఈ గందరగోళంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం దేశ ఆర్థిక పరిస్థితిపై ఒక ప్రకటన చేశారు. అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. -
విభజన భయంతో.. ఆగని మరణాలు
చిత్తూరు జిల్లాలో పీజీ విద్యార్థి ఆత్మహత్య గుండెపోటుతో ఆరుగురి మృతి సాక్షి, నెట్వర్క్: రాష్ట్రాన్ని విభజిస్తారనే భయంతో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం సమైక్యాంధ్ర కోరుతూ చిత్తూరు జిల్లాలో పీజీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోగా, మరొకరు ఆత్మహత్యాయత్నం చేశారు. చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం పెరిందేశం దళితవాడకు చెందిన జే.పోతురాజు (22) తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎంకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పదిరోజులుగా స్వగ్రామంలో ఉండే సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట చిరునగర్కు చెందిన ఆటో ఎలక్ట్రిషియన్ గడ్డం రామారావు (58), పశ్చిమగోదావరి నరసాపురం మండలం చామకూరిపాలెంకు చెందిన చామకూరి కోటేశ్వరరావు (40), మొగల్తూరు మండలం కాటంవారితోటకు చెందిన కాటం పండుబాబు (48), కొయ్యలగూడెం మండలం పరింపూడి గ్రామానికి చెందిన చౌటుపల్లి నాగేశ్వరరావు(54), కొవ్వూరులోని మూడు డాబాల వీధిలో నివాసం ఉంటున్న తెలుగు ఉపాధ్యాయుడు గండికోట వెంకట గౌరీ శంకర్ (52), నిడదవోలు మండలం కోరుమామిడి వెంకటేశ్వరరావు(42) రాష్ర్టం విడిపోతుందేమోనని మనస్తాపంతో గుండెపోటుకు గురై మృతిచెందారు. విభ‘జనాందోళన’ చూస్తూ హఠాన్మరణం కొడుకు మృతి వార్త విని ఆగిన తండ్రి గుండె సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళనలను టీవీలో వీక్షిస్తూ విజయవాడ భవానీపురం కరకట్ట సమీపంలో నివసించే జాలా సురేష్ (39) హఠాన్మరణం చెందాడు. ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో గుమాస్తాగా పనిచేసే ఈయన ఆదివారం మధ్యాహ్నం వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ నిర్వహించిన ర్యాలీలో చురుకుగా పాల్గొన్నాడు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సోమవారం నాటి ఆందోళన కార్యక్రమాలపై చర్చించేందుకు ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ టీవీలో వార్తలను చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ వార్త తెలిసిన వెంటనే సురేష్ తండ్రి జాలా వెంకటేశ్వరరావు అలియాస్ ఏసోబు (70) అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. -
అన్ని అవకాశాలను వాడుకుంటాం: శైలజానాథ్
రాష్ట్రం ఐక్యంగా ఉండాలను కోరుకుంటున్నామని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ పునరుద్ఘాటించారు. ప్రజల ప్రతినిధులుగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు. ఆదివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారిని ఐక్యంగా ఉంచడానికి అన్ని అవకాశాలను వాడుకుంటామని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో తమ ప్రాంత ఎంపీలతో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రేపు ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పారు. ఎల్లుండి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభజనపై సంప్రదింపులు ముగిశాయన్న హైకమాండ్ ఇప్పుడు ఆంటోని కమిటీ వేసిందన్నారు. అలాగే రాష్ట్ర విభజనపై పార్టీ నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిర్ణయం తీసుకోదని భావిస్తున్నట్టు చెప్పారు. సీమాంధ్రలో ప్రజాభిష్టాన్ని పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. చంద్రబాబు బతకడానికి రాజకీయాలే మార్గమనుకుంటున్నారని అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని శైలజానాథ్ దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత స్పష్టత ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సీఎం కిరణ్ కూడా క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్త అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచే అధికార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
ధర్మాన సహా ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా
సీఎంకు లేఖల సమర్పణ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ రాజీనామా పత్రాలను ఆయనకు అందజేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, తమ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా తాము రాజీనామా చేశామని స్పష్టంచేశారు. తాము కూడా ప్రజల వెంటే నడుస్తామని ప్రకటించారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని, అలా కాని పక్షంలో తమ రాజీనామా పత్రాలను శాసనసభాపతికి పంపించాలని వారు సీఎంను కోరారు. దర్మానతో పాటు జుట్టు జగన్నాయకులు, కొర్ల భారతి, మీసాల నీలకంఠంనాయుడు, బొడ్డేపల్లి సత్యవతి రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ కూడా మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ధర్మాన తదితరులు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు నడచుకుంటామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశామన్నారు. రాష్ట్ర విభజనతో తలెత్తే సమస్యలపై సీఎం కిరణ్ లేవనెత్తిన సందేహాలు వాస్తవమేనని, ఆయన వాదనను తాము సమర్థిస్తున్నామని చెప్పారు. విభజన అంశంపై అసెంబ్లీలో కానీ లేదా ఏ వేదికపైనైనా చర్చ జరిగితే సమైక్యాంధ్రప్రదేశ్ వాదనను గట్టిగా వినిపిస్తామని చెప్పారు. -
ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం
న్యూస్‌లైన్ నెట్వర్క్ : సమైక్యాంధ్ర పరిరక్షణోద్యమ కెరటం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. ప్రదర్శనలు పదునెక్కుతున్నాయి. నిరసనలు మిన్నంటుతున్నాయి. ఎక్కడ చూసినా రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనాలు, వినూత్న రీతిలో వేషధారణలు దర్శనమిస్తున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న ఏకైక నినాదంతో తొమ్మిదో రోజున కూడా పోరు కొనసాగించారు. ఈ ఆందోళనలు అన్ని వర్గాలనూ కదిలిస్తున్నాయి. జేఏసీలుగా ఏర్పాటయ్యేందుకు ఒకొక్కరుగా ముందుకు వస్తూ ఉద్యమంలో క్రియాశీలురవుతున్నారు. సమైక్య పోరులో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. సీమాంధ్ర జిల్లాల్లో గురువారం నాటి ఉద్యమ ఘట్టాలివి.. విశాఖలో మహిళా ఉద్యోగులకు పసుపు, కుంకుమ, జాకెట్ అందించి, వాటిని మంత్రులకు పంపించాలని సమైక్యాంధ్ర విద్యార్ధి జేఏసీ ఆందోళన నిర్వహించింది. ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయకుంటే వాళ్ల ఇళ్లలోనే వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. అగనంపూడిలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన 48గంటల దీక్ష రెండోరోజూ కొనసాగింది. గురువారం వైఎస్సార్సీపీ నేతలు కొణ తాల రామకృష్ణ, గండి బాబ్జీ, తిప్పల నాగిరెడ్డి ఉద్యమకారులకు సంఘీభావం ప్రకటించారు. సుప్రీంలో పిల్ వేసేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 12న జరగాల్సిన సింహగర్జన 14కు వాయిదా పడింది. కేంద్రమంత్రి పళ్లంరాజు ఇల్లు ముట్టడి తూర్పుగోదావరి జిల్లాలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 13 జిల్లాల ఉపాధధి హామీ అసిస్టెంట్ల సంఘాలు రాజమండ్రిలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. చెవిటి, మూగ పాఠశాల విద్యార్థులు పొట్టి శ్రీరాములు చిత్రంతోపాటు, తెలుగుతల్లి కన్నీరు పెడుతున్నట్టు, రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దనే అర్థం వచ్చే చిత్రాలతో ర్యాలీ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పళ్లంరాజు ఇంటిని కాకినాడలో ముట్టడించారు. అమలాపురంలో 400 మీటర్ల జాతీయ జెండాను సమైక్యవాదులు ఊరేగించారు. ఎంపీ కనుమూరి, మంత్రి పితాని ఇళ్ల ముట్టడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం ఐ.భీమవరంలో ఎంపీ కనుమూరి బాపిరాజు ఇంటిని, పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో మంత్రి పితాని ఇంటిని ఉద్యమకారులు ముట్టడించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ జోరు వానలో రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. కూరగాయల వర్తకులూ భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ నేతలు ఉద్యమంలో ముందుండి నడవాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరంలో డిమాండ్ చేశారు. పాలకొల్లులో డ్వాక్రా మహిళల ర్యాలీలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగి ఒకరు శిరోముండనం చేయించుకున్నారు. మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కనిపించడంలేదని.. ఆచూకీ తెలపాలని కోరుతూ పాతపట్నం పోలీస్‌స్టేషన్‌లో వైఎస్సార్సీపీ నేత కలమట వెంకటరమణ ఫిర్యాదు చేశారు. విజయనగరంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా హిజ్రాలుభజనలు చేస్తూ శవయాత్ర నిర్వహించారు. భోగాపురం, రామభద్రాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంట వార్పు చేశారు. చీపురుపల్లిలో కుక్కలకు కేసీఆర్ మాస్క్‌లు అమర్చారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరు వద్దనున్న బీజేపీ జాతీయ నాయకుడు వెంకయ్యనాయుడి కుమారుడికి చెందిన హర్షా టయోటా షోరూమ్‌ను విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జరిగిన వంటా వార్పు కార్యక్రమంలో నెల్లూరు రూరల్, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు పాల్గొన్నారు. సోనియాగాంధీపై గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త పాశం సునీల్‌కుమార్, మండల కన్వీనర్ మల్లు విజయకుమార్‌రెడ్డి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్సార్ కాంగ్రెస్ రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరాయి. పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి గురువారం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్, టీడీపీలు రాజీనామా డ్రామాలతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కావాలని బాపట్లలో జరిగిన సభలో ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి అన్నారు. సింహాసనంపై కుక్కతో నిరసన అనర్హులను అందలం ఎక్కిస్తే.. అంటూ సింహాసనంపై కుక్కను కూర్చొపెట్టి పశుసంవర్ధక శాఖ అధికారులు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకూ నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. మేం కూడా వ్యతిరేకం అంటూ గంగిరెద్దులుతో తలలూపించారు. తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడలో, పార్టీ జిల్లా కన్వీనర్ జగ్గయ్యపేటలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో పొదుపు సంఘాల మహిళలు, పాల వ్యాన్లతో డెయిరీ మిల్క్ కార్మికులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, డాక్టర్లు ఉద్యమంలో పాల్గొన్నారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. పుత్తూరులో వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు రోజా ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో అన్ని వర్గాల వారూ భారీ ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఉద్యమకారులకు మద్దతు తెలిపారు. రోడ్లపైనైనా చదువుకుంటాం.. రాష్ట్ర విభజనకు ఒప్పుకోం.. అని విద్యార్థులు రోడ్లపైనే కూర్చుని చదువుకుంటూ తెలిపిన నిరసన ఆకట్టుకుంది. కర్నూలులో అర్చక, పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హోమం జరిపారు. వైఎస్సార్ జిల్లా కడపలో ఆర్టీసీ కార్మికులు రిలే దీక్షలు చేపట్టగా రెవెన్యూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నిర్మానుష్యంగా మారింది. న్యాయవాదులు మృదంగం వాయిస్తూ, కర్రసాము చేస్తూ నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ బస్సులు తొమ్మిదో రోజూ రోడ్డెక్కలేదు. రాజంపేటలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బద్వేలులో గురువారం బంద్ జరిగింది. సమైక్య పావురం కొరుక్కుపేట(చెన్నై), న్యూస్‌లైన్: అందరూ సమైక్యంగా ఉండాలని కోరుతూ గురువారం చెన్నైకి చెందిన ఎవర్గ్రీన్ విద్యాశ్రమం విద్యార్థులు వినూత్న రీతిలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 3 నుంచి 8వ తరగతికి చెందిన 12 వేల మంది విద్యార్థులు 15 వేల చదరపు అడుగుల వైశాల్యంలో శాంతి పావురం ఆకృతిలో కూర్చుని సమైక్య సందేశాన్ని చాటారు. ‘కలిసి జీవిస్తే కోటి లాభాలు’, ‘దేశం ముక్కలైతే ముప్పు’ అంటూ నినాదాలు చేశారు. హిరోషిమా, నాగసాకి దాడులకు గుర్తుగాను, దేశంలో వినిపిస్తున్న విభజన నినాదాలకు వ్యతిరేకంగా శాంతి కపోతం సందేశాన్ని ఇచ్చినట్లు విద్యాశ్రమం ప్రిన్సిపాల్ కలైఅరసి పేర్కొన్నారు. ఆగని మరణాలు.. సాక్షి, ఏలూరు/ఉయ్యూరు, న్యూస్‌లైన్: సీమాంధ్రంలో మృత్యుఘోష ఆగడం లేదు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని తట్టుకోలేక వేర్వేరు ప్రాంతాల్లో గురువారం తొమ్మిది మంది గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కె.గోకవరం గ్రామానికి చెందిన సత్యనారాయణ(55) బుధవారం రాత్రి టీవీలో ఢిల్లీ పెద్దల ప్రకటనలను చూస్తూ భావోద్వేగంతో గుండెపోటుకు గురయ్యూడు. హైదరాబాద్‌లో వడ్రంగి పని చేసుకుని జీవిస్తున్న మొగల్తూరులో సవర నాగరాజు(29) విభజన ప్రకటన నేపథ్యంలో వారం రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. రాష్ట్రం విడిపోతే బతుకుదెరువు కష్టమవుతుందన్న ఆందోళనతో గుండెపోటుకుగురై తనువు చాలించాడు. చింతలపూడిలో గుంజి చుక్కమ్మ (45), ఉండి గ్రామానికి చెందిన కిలారి విష్ణు (32), కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన పండ్రాజు వెంకటేశ్వరరావు(58)లు భావోద్వేగానికి గురై గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కల్లూరుకు చెందిన బడిగ హనుమంతప్ప (52), రొద్దం మండలం పెద్దపల్లికి చెందిన ఈడిగ లక్ష్మినారాయణ (40), కంబదూరుకు చెందిన సురేంద్ర శర్మ (50), కూడేరు మండలం పీ.నారాయణపురానికి చెందిన కురుబ ఎర్రిస్వామి(55) విభజన వార్తలు టీవీలో చూస్త్తూ గుండెపోటుతో మృతి చెందారు. -
రెండో రోజుకు వైఎస్సార్ సీపీ ఆమరణ నిరశన
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా జీవీఎంసీ వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు కంపా హనోకు, గుడిమెట్ల రవిరెడ్డి చేపట్టిన ఆమరణ నిరహారదీక్ష రెండో రోజుకు చేరుకుంది. వీరికి సంఘీభావంగా గురువారం నాయకులు, విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చారు. సమైక్యాంధ్ర నాయకులు ఆడారి కిషోర్‌కుమార్, ఏయూ జేఏసీ నాయకులు ఆరేటి మహేష్, కాంతారావు, లగుడు గోవింద్, పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, సమన్వయకర్తలు జీవీ రవిరాజు, తిప్పల నాగిరెడ్డి మద్దతు తెలిపారు. -
ఢిల్లీ యాత్రలు అంతా ఉత్తుత్తి హడావిడే!
రాష్ట్ర సమైక్యాన్ని కాపాడేందుకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నామని గత కొంతకాలంగా కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ఢిల్లీలో చేస్తున్న హడావుడి అంతా నాటకమేనని తెలుస్తోంది. విభజనపై సీమాంధ్రప్రాంతంలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమం నుంచి తప్పించుకొనేందుకే కాంగ్రెస్ సీమాంధ్ర నేతలు ఢిల్లీ యాత్రలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్న వాదన ప్రజల్లో నాటుకుపోయిన నేపథ్యంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమంలోకి పాల్గొంటుండటంతో పాటు కాంగ్రెస్ నేతలపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు కూడా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు వెనుకడుగు వేస్తున్నారు. రాష్ట్ర సమైక్యంగా ఉంచేందుకు అధిష్టానాన్ని ఒప్పించడానికి తామేదో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకోవడానికి అటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు ఢిల్లీలో మకాం వేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను, అధినేత్రి సోనియాగాంధీని వరుసపెట్టి కలుసుకోవడమే కాకుండా ఢిల్లీలో ప్రత్యేక భేటీలు నిర్వహించడం వంటివన్నీ ఉత్తుత్తి హడావిడేనని ఢిల్లీ వెళ్లొచ్చిన నేతలు చెబుతున్నారు. ‘నిజానికి నిర్ణయం జరిగిపోయింది... ఇప్పుడు హైకమాండ్ ముందు మేం చేసేదేమీ లేదు.. మా వంతు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రజల్లో చెప్పుకోవడానికి నాయకులంతా తాపత్రయపడుతున్నారు’ అని ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన ఒక ఎంపీ వివరించారు. ఆంటోనీ నేతృత్వంలోని కమిటీ కూడా రాష్ట్ర నాయకులు కోరితే వేసిందే తప్ప ఆ కమిటీ ద్వారా అధిష్టానం నిర్ణయాన్ని మార్చే అవకాశం లేదని, ఆ విషయం కూడా నాయకులందరికీ తెలుసని ఆయన చెప్పారు. ఢిల్లీలో మంగళవారం సోనియాగాంధీతో భేటీ అయిన రాయలసీమ నేతలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, లబ్బి వెంకటస్వామి తదితరులు బుధవారం నగరానికి చేరుకున్నారు. వాస్తవానికి అయిదు పదినిముషాలకు మించి ఎవరికీ సమయం ఇవ్వని సోనియా గాంధీ తమతో దాదాపు 25 నిముషాల సేపు మాట్లాడారని వారు చెప్పారు. రాయలసీమ జిల్లాల్లోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకొని రాయల తెలంగాణ అంశం గురించి నేతలు ప్రస్తావించగా సోనియా నుంచి ఒకింత సానుకూలత వచ్చినట్లు చెబుతున్నారు. ఏమైనా ఉంటే కమిటీ ముందు చెప్పాలని, దీని తరువాత మంత్రుల కమిటీ కూడా ఉంటుంది కనుక అక్కడ కూడా ఈ అంశాలను లేవనెత్తితే పరిశీలిస్తారని సూచించినట్లు తెలిసింది. -
జన నినాదమై... ఉవ్వెత్తున సమైక్య సమరం
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్రనే శ్వాసిస్తూ, ధ్యానిస్తూ జన నినాదమై ఉద్యమం సీమాంధ్రలో వెల్లువెత్తుతోంది. నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు, మారుమూల పల్లెలు అన్నీ ఒక్కటై సమైక్యమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నాయి. కులాలు, మతాలు, శ్రామిక వర్గాల వారీగా ప్రజలు విభజనయత్నాలకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. స్వచ్ఛందంగా వివిధ రూపాల్లో ఆందోళనలను హోరెత్తిస్తున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన బుధవారం కూడా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యాసంస్థల మూత కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా ప్రైవేటురంగంలోని ఉద్యోగులందరూ సమైక్యపోరాటంలో భాగస్వాములవుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన 72గంటల పెన్‌డౌన్ బుధవారంతో ముగిసింది. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను గురువారం ప్రకటిస్తామని నేతలు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఆగ్రహజ్వాలలు కొనసాగుతున్నాయి. గోదావరి తీరాన 300కుటుంబాల నిరాహారదీక్ష రాజమండ్రి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన 300కుటుంబాలు నిరాహార దీక్షలో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. కాకినాడలో జర్నలిస్టు వారణాసి సాయిపెరుమాళ్లు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారు. గుంటూరులో ఏపీఎన్జీవో జేఏసీ పిలుపు మేరకు అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులు విధులు బహిష్కరించి ప్రదర్శన చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ విద్యార్థులు గుంటూరు-విజయవాడ హైవేపై రాస్తారోకో చే శారు. నడిరోడ్డుపై ముస్లింల ప్రార్ధన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వేలాదిమంది ముస్లింలు మసీదుల నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సోనియా మనసు మార్చి రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాలని నడిరోడ్డుపై ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. కర్నూలులో పతంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో సుమారు 500మంది సభ్యులు వెంకటరమణ కాలనీ సమీపంలో జాతీయ రహదారిపై యోగాసనాలతో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. మేముసైతమంటూ అంధుల ర్యాలీ తిరుపతిలో అంధులు భారీ ర్యాలీ నిర్వహించారు. కపిలితీర్థం నుంచి లీలామహల్ కూడలి, మున్సిపల్ కార్పొరేషన్, నాలుగుకాళ్ల మంటపం, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తెలుగుతల్లి విగ్రహం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరం నడిచి సమైక్యనినాదాలతో ప్రదర్శన చేపట్టారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే షాపులను మూయించి బంద్ నిర్వహించారు. పరకాల ప్రభాకర్ బుధవారం మదనపల్లి నుంచి బస్సుయాత్రను కొనసాగించారు. సినిమా థియేటర్లమూత కృష్ణా జిల్లాలో ఫిలింఛాంబర్ నేతృత్వంలో ఎగ్జిబిటర్లు బుధవారం బంద్ పాటించి జిల్లా మొత్తం సినిమా థియేటర్లు మూసివేశారు. విజయవాడలో భారీ ప్రదర్శన చేపట్టారు. నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు బుధవారం రాత్రి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఉయ్యూరులో రైతులు ఎడ్లబళ్లతో ప్రదర్శన చేశారు. గుడివాడలో నడిరోడ్డుపై నాట్లు వేశారు. సమ్మెకు తామూసిద్ధమన్న ఎంపీడీవోలు ఈ నెల 12 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు రాష్ట్ర ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు హరిహరనాధ్ విజయవాడలో ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నేతలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలులో బార్ అసోసియేషన్ సభ్యులు కోర్టు విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న జిల్లా న్యాయమూర్తి ఎ.రాధాకృష్ణ వాహనాన్ని అడ్డగించారు. ఒంగోలు నగరంలో పదివేల మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై చేసిన రాస్తారోకోతో రాకపోకలు స్తంభించాయి. పదివేలమంది ఉద్యోగుల భారీ ప్రదర్శన అనంతపురం నగరంలో సమైక్యాంధ్రకు మద్దతుగా గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు పది వేల మంది ఉద్యోగులతో ఆర్ట్స్ కళాశాల నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐదు వేల మంది మహిళలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. సమైక్య ఉపాధ్యాయ జేఏసీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ఆధ్వర్యంలో పీఆర్టీయూ నాయకులు శ్రీకాకుళంలో సమావేశమై సమైక్య రాష్ట్ర సాధన కోసం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సమైక్య ఉపాధ్యాయ జేఏసీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎచ్చెర్లలోని బీఆర్ అంబేద్కర్ వర్సిటీ విద్యార్థులు హౌరా-చెన్నై జాతీయ రహదారిపై హోమం నిర్వహించి, రహదారిని దిగ్బంధించడంతో సుమారు పది కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. రణస్థలం, నరసన్నపేట, టెక్కలి తదితర ప్రాంతాల్లోనూ రాస్తారోకోలునిర్వహించారు. విజయనగరంలో ఉద్యోగులు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పేలుతున్న స్లో ‘గన్స్’ సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఏఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర జిల్లాల్లో సమైక్యవాదులు చేస్తున్న నిరసనల్లో నినాదాలు హోరెత్తుతున్నాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలపై ఆందోళనకారులు రాసి, ప్రదర్శిస్తున్న నినాదాలు, వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివరావు, సీఎం కిరణ్, పీసీసీ చీఫ్ బొత్సలను ఎండగడ్తూ చిత్రించిన, రూపొందించిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. గత వారం రోజులుగా సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో నిరసనకారులు ప్రదర్శించిన ప్లకార్లుల్లోని నినాదాలు, వాల్‌పోస్టర్లలోని వ్యాఖ్యలు మచ్చుకు కొన్ని.... విభజనకు ముందు దర్జా... ఆ తర్వాత బికారి సమైక్యాంధ్రలో కుర్చీలో దర్జాగా ఉన్న కేసీఆర్.. విభజన జరిగితే బికారిగా మారతారంటూ రూపొందించిన ఫ్లైక్సీ అనంతపురం నగరంలో వెలిసింది. నాకు నచ్చని పదం రాజీనామా సినిమాల్లో చిరంజీవి డైలాగులను పేరడీ చేస్తూ విజయవాడలో ప్లకార్డులు ప్రదర్శించారు. నాకు తెలుగుభాషలో నచ్చనిది ఒకే ఒక్క పదం ‘రాజీనామా’ అంటూ ఠాగూర్ సినిమాలో డైలాగ్‌ను, నా ఇంటి ముందు ధర్నా చేయమని ముగ్గురికి చెప్పండి.. వారు ముగ్గురికి చెబుతారు.. వారు మరో ముగ్గురికి చెబుతారు.. అంటూ స్టాలిన్ సినిమాలో డైలాగ్‌ను పేర డీ చేశారు. బొత్స ఆచూకీ చెప్పండి ‘‘విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి బొత్స సత్యనారాయణ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని వెతుక్కుంటూ వెళ్లి తప్పిపోయారు. ఆచూకీ తెలిసిన వారు సమైక్యాంధ్ర ఉద్యమ కార్యకర్తలకు తెలియజేయాలి.’’ అంటూ విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో వాల్‌పోస్టర్ అంటించారు. తెలుగుతల్లికి సోనియా తూట్లు తెలుగు తల్లిని సోనియాగాంధీ బల్లెంతో పొడుస్తుంటే కారుతున్న రక్తాన్ని గద్ద రూపంలో కేసీఆర్ తాగుతున్న చిత్రాన్ని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్ ప్రదర్శించింది. రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ చిరంజీవి, బొత్స, గంటాశ్రీనివాసరావులను కోతి బొమ్మలుగా చిత్రీకరించినబ్యానర్‌ను తెలుగుశక్తి నేతలు విశాఖపట్నంలో ఊరేగించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పాము.. చిరు చీటింగ్ జీవి... చెన్నైలో అవార్డులు సమైక్యాంధ్రను పరిరక్షించాలని కోరుతూ తమిళనాడు రాష్ట్రం చెన్నై మైలాపూర్‌లో తెలుగు సంఘాలు బుధవారం నిరాహారదీక్ష నిర్వహించాయి. ఈ సందర్భంగా వ్యంగ్యోక్తులతో అవార్డులను ప్రకటించారు. సోనియాకు ‘విభజన విధ్వంస స్వరూపిణి’, కేసీఆర్‌కు ‘ఫామ్ హౌస్ పాము’, చిరంజీవికి ‘చీటింగ్ జీవి’, పురంధేశ్వరికి ‘పితృ ఆత్మక్షోభకారిణి’, సీమాంధ్ర కేంద్ర మంత్రులకు ‘సోనియా పెట్స్’, కాంగ్రెస్ అధిష్టానానికి ‘అష్టదరిద్ర స్థానం’ అవార్డులను ప్రకటించారు. తొమ్మిదిమందిని మింగిన ‘విభజన’ ఒకరి ఆత్మహత్య.. గుండెపోటుతో 8 మంది.. ఇద్దరి ఆత్మహత్యాయత్నం సాక్షి నెట్వర్క్: రాష్ట్ర విభజన ప్రకటనను జీర్ణించుకోలేక బుధవారం ఒక్కరోజే 8 మంది గుండెపోటుతో మరణించగా, ఒకరు ఆత్మహత్యకు, మరో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కాకిలేరులో పెయింటర్ దిడుమర్తి రాజీవ్‌గాంధీ (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అత్తిలి మండలం గుమ్మంపాడులో వినుకొండ వెంకటసుబ్బమ్మ (54), ఉండి గ్రామానికి చెందిన దొమ్మేటి శ్రీను (31), పెంటపాడు మండలం గ్రామానికి చెందిన మేనేటి కోటేశ్వరరావు(61), ఉంగుటూరు మండలం నారాయణపురంలో కర్రి నాగరాజు(35), అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన రంగప్ప (45), రాయదుర్గం మండలంలోని జుంజరంపల్లికి చెందిన అచ్చెల్లి మాబు(35) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. రాష్ట్ర విభజనపై వస్తున్న వార్తలను టీవీలో వీక్షిస్తూ కర్నూలు జిల్లా అవుకు మండల పరిధిలోని రాఘవరాజపురానికి చెందిన బూరుగుల నాగేష్ బుధవారం గుండెపోటుతో మరణించాడు. చిత్తూరు జిల్లా రామచంద్రాపురంలో చంద్రమౌళి నాయుడు (55) సమైక్య ఉద్యమాలను టీవీలో చూస్తూ కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు రుయాకు తరలించగా చికిత్సపొం దుతూ మరణించాడు. సత్యవేడులో బాలాజీ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా గుత్తికి చెందిన కిషోర్ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమైక్య ద్రోహులకు కుంభీపాకం శిక్ష విజయనగరంలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో సోనియా, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను మరుగుతున్న నూనెలో దించి కుంభీపాకం శిక్ష విధించారు. -
విభజనపై వెనక్కి తగ్గాల్సిందే: సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం
సాక్షి; హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన సోమవారం తీవ్రరూపం దాల్చింది. తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వరసగా రెండోరోజూ వందలాది మంది సీమాంధ్ర ఉద్యోగులు విధులు బహిష్కరించారు. సచివాలయం లోపల, బయట ద్వారాల వద్ద బైఠాయించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా, యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. యూపీఏ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు. మురళీకృష్ణ స్పష్టం చేశారు. సీమాంధ్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన ఉద్యోగులకు తమ మద్దతును ప్రకటించారు. రాష్ట్ర విభజనవల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రభుత్వోద్యోగులేనని, అలాంటిది తమకు మాట మాత్రమైనా చెప్పకుండా యూపీఏ తెలంగాణ ఏర్పాటు ప్రకటించడం గర్హనీయమని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడక ముందే సీమాంధ్ర ఉద్యోగులందరూ వెళ్లిపోవాలని కేసీఆర్ హెచ్చరిస్తుంటే ఇక తమకు భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు. సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పిన రెండు రోజులకే మాట మార్చారని, ఇక తమ భద్రతకు భరోసా ఎలా కల్పిస్తారని నిలదీశారు. సీమాంధ్ర నాయకులను నమ్మి మోసపోయామని లేకుంటే తెలంగాణ ప్రకటనకు ముందే ఉద్యమబాట పట్టేవాళ్లమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిన మాట పూర్తిగా అవాస్తవమని, అబద్ధపు ప్రచారంతో సీమాంధ్ర ప్రజలపై తెలంగాణలో వ్యతిరేకభావనను పెంచుతున్నారని ఆ ప్రాంత రాజకీయ నేతలను తప్పుపట్టారు. 1970లో సర్వీస్ కమిషన్ ఏర్పడిన తరవాత 14ఎఫ్, 610 జీవోను అనుసరించే రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాలు జరిగాయని, ఇక అన్యాయానికి ఆస్కారమెక్కడుందని ప్రశ్నించారు. ఇటీవల చేపట్టిన నియామకాల్లో 20శాతం మంది నల్గొండ జిల్లా నుంచే ఎంపికయ్యారని, మెరిట్ సాధించిన వారికే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు వరకూ పదోన్నతులు ఆపాలని కొందరు కోరుతున్నారని ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదన్నారు. ఈలోగా పదవీ విరమణ చేసే వారికి దీనివల్ల నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అసంబద్ధమైన డిమాండ్ వల్ల ఇరు ప్రాంతాల ఉద్యోగులు నష్టపోయే ప్రమాదముందన్నారు. తెలంగాణ ప్రకటనను చేసిన దిగ్విజయ్ సింగ్‌కు రాష్ట్ర పరిస్థితులపై కనీస అవగాహన కూడా లేదని ఫోరం నేతలు విమర్శించారు. ప్రణాళికాబద్ధంగా ఉద్యమం కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంతవరకూ వెనక్కి తగ్గబోమని సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కార్యదర్శి కె.వి కృష్ణయ్య చెప్పారు. -
12 నుంచి సకలజనుల సమ్మె
రాష్ట్ర విభ జన ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే 12 అర్ధరాత్రి నుంచి సకలజనుల సమ్మెకు సిద్ధం కావాలని ప్రజలకు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డి.వి.కృష్ణయాదవ్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని పెన్నానది వంతెనపై సోమవారం సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహించారు.అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. కృష్ణయాదవ్ మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయని వారి ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. సీమాం ధ్రుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్, అంజయ్య, అరవింద్, శ్రీను, నవీన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.