సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, సీమాంధ్ర జిల్లాల్లోని 35వేల మంది న్యాయవాదులు ఈ నెల 30 వరకూ విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుబ్బారావు కోరారు.
సాక్షి, రాజమండ్రి : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, సీమాంధ్ర జిల్లాల్లోని 35వేల మంది న్యాయవాదులు ఈ నెల 30 వరకూ విధులు బహిష్కరించి ఉద్యమంలో పాల్గొనాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సుబ్బారావు కోరారు. సీమాంధ్ర జిల్లాల న్యాయవాదుల జేఏసీ ప్రతినిధులు శనివారం రాజమండ్రిలో సమావేశమయ్యారు. ప్రజాప్రతినిధులు తక్షణం తమ పదవులకు రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని సమావేశం డిమాండ్ చేసిందన్నారు. ఈనెల 31న గుంటూరులో మరోసారి సమావేశమై తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తుందని చెప్పారు.