పార్టీలన్నీ ఉద్యమిస్తే కేంద్రం వెనక్కు | 'Centre will go back if all parties come forward' | Sakshi
Sakshi News home page

పార్టీలన్నీ ఉద్యమిస్తే కేంద్రం వెనక్కు

Published Tue, Oct 8 2013 2:55 AM | Last Updated on Wed, Aug 8 2018 5:45 PM

పార్టీలన్నీ ఉద్యమిస్తే కేంద్రం వెనక్కు - Sakshi

పార్టీలన్నీ ఉద్యమిస్తే కేంద్రం వెనక్కు

samaikyandhra, telangana, employees forum, muralikrishna, సమైక్యాంధ్ర, తెలంగాణ, ఉద్యోగుల ఫోరం, మురళీకృష్ణ
  సచివాలయ సమైక్యాంధ్రఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ వ్యాఖ్య
 వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పార్టీలన్నీ కలిసి సమైక్యం కోసం ఉద్యమిస్తే విభజన అంశంపై కేంద్రం వెనక్కుతగ్గడం సాధ్యమేనని సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ అన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు ఉద్యోగుల ఫోరం సోమవారం సంఘీభావం తెలిపింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యోగులు జగన్ దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తూ జగన్ ఆమరణ దీక్ష చేపట ్టడం అభినందనీయమన్నారు. గతంలో సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో పోరాడితే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సంఘీభావం తెలిపారని గుర్తుచేశారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఉద్యమించే ప్రతిపార్టీకి తాము మద్దతు ఇస్తామని వెల్లడించారు. జగన్‌ను కలిసిన వారిలో కో చైర్మన్ బి.మురళీమోహన్, కన్వీనర్ టి.వెంకటసుబ్బయ్య, వైస్ చైర్మన్ బెన్సన్, కోఆర్డినేటర్ ఎ.రవీంద్రరావు, సచివాలయ హౌసింగ్ సొసైటి ప్రెసిడెంట్ కె.వెంకట్రామిరెడ్డి తదితరులున్నారు. మరోవైపు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్ కె. ఓబుళపతి, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వైఎస్ జగన్‌ను కలిశారు. సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ఉద్యమంలో ఉపాధ్యాయులు సైతం పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు వైఎస్సార్‌సీపీ అధినేతకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement