త్వరలో హరికృష్ణ చైతన్య రథయాత్ర! | Nandamuri Harikrishna ready to Chatainya Rathayatra! | Sakshi
Sakshi News home page

త్వరలో హరికృష్ణ చైతన్య రథయాత్ర!

Published Wed, Aug 21 2013 2:31 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM

త్వరలో హరికృష్ణ చైతన్య రథయాత్ర!

త్వరలో హరికృష్ణ చైతన్య రథయాత్ర!

సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకున్న తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన అనంతపురం జిల్లా హిందూపురం నుంచి యాత్రను ప్రారంభించనున్నట్లు సన్నిహితవర్గాల సమాచారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీఆర్ గతంలో రాష్ర్టవ్యాప్తంగా చైతన్యరథంలో పర్యటించారు. ఇపుడు అదే రథాన్ని హరికృష్ణ ఉపయోగించనున్నారని తెలిసింది. పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనే ందుకు ఢిల్లీ వెళ్లిన హరికృష్ణ బుధవారం నగరానికి రానున్నారు.
 
 వెంటనే అందుబాటులో ఉన్న సన్నిహితులతో చర్చించిన అనంతరం యాత్ర షెడ్యూల్‌ను ఆయన ప్రకటిస్తారని సమాచారం. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ నెలాఖరు నుంచి తెలుగు ఆత్మగౌరవయాత్ర చేయనున్నారు. అంతకంటే ముందుగానే హరికృష్ణ తన యాత్రను ప్రారంభించి తొలుత రాయలసీమ, తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తి చేస్తారని తెలుస్తోంది. కొద్ది విరామం అనంతరం మిగిలిన జిల్లాల్లో యాత్ర చేస్తారని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను హరికృష్ణ మంగళవారం ఫోన్లో పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement