సాక్షి, హైదరాబాద్: శాసనమండలి సోమవారం కొనసాగిన కొద్దిసేపూ సభ్యుల సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో మార్మోగిపోరుుంది. ఉదయం 10కి సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీలు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఐదు నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. 12 గంటలకు తిరిగి ప్రారంభమైనప్పుడూ అదే పరిస్థితి నెలకొంది. పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, దేవగుడి నారాయణరెడ్డి, జూపూడి ప్రభాకరరావు తదితరులు సమైక్య తీర్మానం చేయూలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో చైర్మన్ చక్రపాణి సభను మళ్లీ వాయిదా వేశారు. సభ మధ్యాహ్నం 1.45కి మళ్లీ ప్రారంభమైనా నినాదాలు కొనసాగడంతో మండలి మంగళవారానికి వాయిదా పడింది.
నోటీసులు తిరస్కరించండి: వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన నోటీసును తిరస్కరించినట్టే సీఎం, మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసులను కూడా తిరస్కరించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ ఆలీ కోరారు. ఆయన సోమవారం మండలి మీడియూ పారుుంట్‌లో సోమవారం మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ రూల్ 77 కింద నోటీసు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, విద్రోహచర్య అని అన్నారు.
మంత్రివర్గ ఆమోదం తప్పనిసరి కాదు: రామచంద్రయ్య
పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ, మండలి తిరస్కరించాలని ప్రభుత్వం తరఫున నోటీసులివ్వడానికి మంత్రివర్గం ఆమోదం తీసుకోవాలన్న నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదని మండలిలో సభా నాయకుడు, మంత్రి రామచంద్రయ్య అన్నారు. మంత్రివర్గం నాయకుడిగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. నోటీసులివ్వడం రాజ్యాంగ విరుద్ధమేమీ కాదన్నారు.
మండలిలో నినాదాల హోరు
Published Tue, Jan 28 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement