తిరుపతి: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఒక్కసారిగా భగ్గుమంది. సీమాంధ్రలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చేపట్టిన సీమాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుతోంది. సీమాంధ్ర జిల్లాలో అడుగడుగునా నిరనసలు, ధర్నాలు, ర్యాలీలతో అట్టడుకిపోతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో కూడా ఉద్యమ సెగ రగులుకుంది.
నిత్యం శ్రీవారి సేవలో నిమగ్నమైఉండే టీటీడి ఉద్యోగులు తమ విధులను భహిష్కరించి సమైక్య ఉద్యమాన్ని కోనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ 20రోజులుగా టీటీడి ఉద్యోగులు తిరుపతిలోని టీటీడి పరిపాలనా భవనం వద్ద రిలేనిరాహారదీక్షలు చేస్తున్నారు. ఉద్యమానికి మద్దుతుగా వారూ తమ సమైక్యా గళాన్ని వినిపిస్తున్నారు. సమైక్యాంద్రప్రదేశ్ మాత్రమే రాష్ట్రప్రజలంతా కోరుకుంటున్నారని టీటీడి ఉద్యోగులు అంటున్నారు.
టీటీడి ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
Published Sat, Aug 24 2013 6:32 PM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement