తిరుమల వెంకన్న ఆంధ్రప్రదేశ్కే!
రాష్ట్ర విభజన ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి తేవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే.. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్కే చెందుతుందని ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీకి చెందిన నిధులు గానీ, ఆస్తులు గానీ విభజన పరిధిలోకి రావని ఈ ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఆస్తిపరులైన దేవుళ్ల జాబితాలో తిరుమల వెంకన్న ఉన్న విషయం తెలిసిందే. టీటీడీ పాలకమండలిలో రాజకీయ నాయకులకు స్థానం ఉంటుంది. అలాగే ఈవో, జేఈఓలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులే ఉంటారు.