తాడ్వాయి మండలం బాసన్నపల్లిలో పాఠశాల బస్సు శనివారం బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా ప్రయాణించడంతోనే ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు. ఆ ప్రమాదంపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బోల్తా పడిన బస్సును రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. విద్యార్థులకు స్వల్పగాయాలు అయ్యాయని ఆసుపత్రి వైద్యులు పోలీసులకు తెలిపారు. ఆ ప్రమాద సంఘటనకు సంబంధించిన సమాచారం విద్యార్థుల తల్లితండ్రులకు తెలియడంతో హుటాహుటిన వారు ఆసుపత్రికి చేరుకున్నారు.