కొలిమిగుండ్ల: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం నాయినిపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పెద్దవాగు ఉధృతి అమాంతం పెరిగి గొర్రె పిల్లలు కొట్టుకుపోయాయి.
అనంతపురంలో భారీగా వర్షాలు కురవడంతో వాగు ఉధృతి పెరగటం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓబయ్య, చిన్నయ్య అనే ఇద్దరు రైతులకు చెందిన 20 గొర్రె పిల్లలు కొట్టుకుపోయాయి.