వరల్డ్‌ బ్యాంక్‌ బృందం ఎదుట రైతుల ఆవేదన | Andhra pradesh Capital region formers explains their problems to world bank delegation | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ బ్యాంక్‌ బృందం ఎదుట రైతుల ఆవేదన

Published Thu, Sep 14 2017 1:45 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

వరల్డ్‌ బ్యాంక్‌ బృందం ఎదుట రైతుల ఆవేదన

వరల్డ్‌ బ్యాంక్‌ బృందం ఎదుట రైతుల ఆవేదన

అమరావతి : ప్రపంచ బ్యాంకు బృందానికి ఏపీ రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. మూడు పంటలు పండే భూములను లాక్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నిడమర్రులో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కారణంగా ఇప్పటికే భూమిని కోల్పోయిన, కోల్పోతున్న బాదితులు ఆ బృందానికి తమ బాధలు చెప్పుకున్నారు.

'మా దగ్గర నుంచి భూమిని బలవంతంగా తీసుకొని ఎకరాకు రూ.18లక్షలులు ఇచ్చి వారు మాత్రం రూ.50లక్షలకు అమ్ముకుంటున్నారు. బంగారంలాంటి పంటలు పండే భూములను నాశనం చేస్తున్నారు. మేం ఎట్టి పరిస్థితుల్లో రాజధానికి భూములు ఇవ్వం. మౌలిక సదుపాయాలకు భూములు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని రైతులు చెప్పగా.. గతంలో నెలకు తమకు రూ.12వేలు గిట్టుబాటు అయ్యేదని, ఇప్పుడు మాత్రం నెలకు రూ.2,500మాత్రమే ఇస్తోందంటూ రైతు కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement