కడప: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బలానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. శనివారం హిస్సార్ లో ముఖేష్ ను కడప జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.20 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ ఉన్నాడనే సమాచారంతో కడప ఎస్పీ గులాఠీ ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి పట్టుకున్నారు.
ఇదిలాఉండగా ఒంటిమిట్టలో ఎర్రచందనం దుంగలు అదృశ్యంపై ఎస్పీ గులాఠీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు సహకరిస్తున్నరనే ఆరోపణలతో ఎనిమిది మంది పో్లీస్ సిబ్బందిపై చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో ఏఎస్ఐ తో సహా మరో కొంతమంది పోలీస్ సిబ్బంది పాత్ర ఉందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీరిపై విచారణకు ఎస్పీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.