ఆర్మూర్, న్యూస్‌లైన్: ఆలస్యంగానైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులపై పెట్టిన కేసులను తొలగించడం ఆర్మూర్ ప్రాంత రైతాంగం విజయమని శాసనసభ మాజీ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి అభివర్ణించారు. సుదీర్ఘ కాలం ప్రభుత్వంతోపాటు హోం, న్యాయశాఖ అధికారులతో చర్చించడంతోనే ఈ జీవో జారీ చేయడం సాధ్యమైందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించకుండా, బాధితుల తో కమిటీ వేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలో సమస్యను శాంతియు తంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేసామన్నారు.
మరోవైపు, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రైతులను ఐదున్నరేళ్లపాటు ఠాణాలు, కోర్టుల చుట్టూ తిప్పిన నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కేసులను ఎత్తివేస్తున్నట్లు జీవో జారీ చేసారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతులు ఈ ఐదేళ్లలో కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోయి న మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మిగిలి పోయిన రూ.10.83 కోట్ల బకాయిలను ఇప్పిస్తే ఎర్రజొన్నల వివాదానికి తెరపడినట్లేనని రైతులు అభిప్రాయపడుతున్నారు.
అప్పుడు ఏం జరిగింది?
2008లో ఆర్మూర్ ప్రాంతంలోని 108 గ్రామాలకు చెందిన సుమా రు 25 వేల రైతులు ఎర్రజొన్నలను పండించారు. విత్తన వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధర చెల్లించి మోసం చేస్తుండటంతో రైతులు ఆందోళన బాట పట్టారు. క్వింటాలుకు రూ. 1,540 ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర చెల్లించడానికి ఆర్మూర్ మండ లం అంకాపూర్ గ్రామానికి చెందిన గోదావరి హైబ్రీడ్ సీడ్స్ కంపెనీ యజమాని మహిపాల్‌రెడ్డి ముందుకు వచ్చారు. ఆయన డిమాండ్ మేరకు ఈ ప్రాంతంలో పండించే ఎర్రజొన్నలన్నీ మహిపాల్‌రెడ్డికే అమ్మాలని అప్పటి కలెక్టర్ రామాంజనేయులు సమక్షంలో ఒప్పందం కుదిర్చారు. ఈ మేర కు రైతులు పండించిన సుమారు 5.11 లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్నలను వ్యాపారి స్వాధీనం చేసుకున్నారు. కానీ, 2.03 క్వింటాళ్లకు మాత్రమే రూ. 32 కోట్లు చెల్లించారు.
ఆ తరువాత
ఎర్రజొన్నలు ఢిల్లీ మార్కెట్‌లో అమ్ముడుపోకపోవడం, బ్యాంకు రుణం రాకపోవడంతో మిగతా డబ్బులు రూ. 46 కోట్లు రైతుల కు చెల్లించలేనని వ్యాపారి చేతులు ఎత్తేశారు. దీంతో ఆగ్రహిం చిన రైతులు ఉద్యమాలు చేశారు. అయినా, ప్రభుత్వం స్పందిం చకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. 2008 జూన్ 16న 44వ, 63వ జాతీయ రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు.
రైతులు వేల సంఖ్య లో ఆర్మూర్‌కు తరలిరావడంతో ఉద్యమం అదుపు తప్పి హింసాయుతంగా మారింది. ఆందోళనకారుల ఆగ్రహం తారాస్థాయికి చేరి, సీడ్ వ్యాపారులు మహిపాల్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు తగలబెట్టారు. మూడు ప్రభుత్వ వాహనాలకు నిప్పంటించారు. శాంతి భద్రతల సమస్యల తలెత్తడం, పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రైతులను నియంత్రించడానికి గాలిలో కాల్పులు జరిపారు. కాల్పులలో ఆరుగురు రైతులు గాయపడ్డారు. వేల్పూర్ మండలం పడగల్‌కు చెందిన ఏనుగు శేఖర్‌కు తూటా తగిలింది.
చేతులు కాలాక
ఈ సంఘటనతో దిగి వచ్చిన ప్రభుత్వం ఏపీ సీడ్స్ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయించడానికి నిర్ణయించి ఉద్యమాన్ని విరమింపజేసింది. సీడ్ వ్యాపారి నుంచి సుమారు మూడు లక్షల క్వింటాళ్ల ఎర్రజొన్నలను స్వాధీనం చేసుకొని క్వింటాలుకు * 1,200 చొప్పున రైతులకు * 35 కోట్లు చెల్లించింది. ఏపీ సీడ్స్ ఎర్రజొన్నలు అమ్మగా వచ్చిన లాభాన్ని రైతులకు తిరిగి చెల్లిస్తామని, లేదా సీడ్ వ్యాపారి నుంచి బకాయిలు రాబట్టి 2008 ఆగ స్టు నెలాఖరులోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ సీడ్స్ వా రు ఎర్రజొన్నలు విక్రయించినపుడు లాభాలు రాకపోవడం, వ్యాపా రి కోర్టుకు వెళ్లడంతో సుమారు రూ. 10.83 కోట్ల బకాయిలు అలాగే ఉండిపోయాయి.
కేసుల తిప్పలు
సీడ్ వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసినందుకు, ప్రభుత్వ వాహనాలను దహనంం చేసినందుకు 43 మంది రైతులపై 13 కేసులను ఆర్మూర్ ఠాణాలో నమోదు చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం లోని 37 మందిపై, బాల్కొండ నియోజకవర్గంలోని ఒకరితో పాటు మరికొందరు రైతులు ఇందులో ఉన్నారు. ఆర్మూర్ మండ లం మంథనికి చెందిన నర్సారెడ్డి, పుర్రె శివన్న, పాపాయిగారి నర్సారెడ్డి, పెద్దొళ్ల గంగారెడ్డి, పుర్రె ప్రవీణ్, నక్కల మహిపాల్, మిర్ధాపల్లికి చెందిన ఇద్దరు రైతులు, గోవింద్‌పేట్‌కు చెందిన ఆరుగురు, మచ్చర్లకు చెందిన ఆరుగురు, నందిపేట్ మండలానికి చెందిన 17 మంది ఇందులో ఉన్నారు. రావల్సిన డబ్బుల కోసం వేలాది మంది ఆందోళన చేస్తే, నేల తల్లిని సాగుచేసే అభం శుభం తెలియని రైతులపై రాజద్రోహం, హత్యాయత్నం, గృహదహనం, తదితర కేసులు బనాయించారు. హడావుడిగా జైలుకు పంపారు. కేసు లు ఎత్తివేయాలంటూ ప్రజా ప్రతినిధులు, నాయకులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది.
హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
రైతులు ఆరేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. న్యాయవాదులను నియమించుకున్నారు. ఇతర ఖర్చులను భరిస్తున్నా రు. కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ హోం మంత్రి జానారెడ్డిని కలిసి విన్నవించారు. బాధిత రైతులు కమిటీగా ఏర్పడి డబ్బులు జమ చేసుకొని హైదరాబాద్‌లో నా యకుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా నాయకులు ఏనా డూ పట్టించుకోలేదన్నదే రైతుల ఆవేదన.
ఊరట
Published Thu, Jan 2 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement