భారత రియల్టీ మార్కెట్లోకి చైనా వాండా గ్రూప్ | Indian realty market China's Wanda Group | Sakshi
Sakshi News home page

భారత రియల్టీ మార్కెట్లోకి చైనా వాండా గ్రూప్

Published Mon, Jun 15 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

Indian realty market China's Wanda Group

చైనా రియల్టీ దిగ్గజం దలియాన్ వాండా గ్రూప్ భారత రియల్టీ మార్కెట్లో 500 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. భారత్‌లో పారిశ్రామిక టౌన్‌షిప్‌ల అభివృద్ధి కోసం ఈ మేరకు పెట్టుబడులు పెట్టనున్నది. జాయింట్ వెంచర్ల ఏర్పాటు కోసం డీఎల్‌ఎఫ్ వంటి కంపెనీలతో సంప్రదింపులు జరుపుతోంది.

డీల్స్
 హౌసింగ్‌డాట్‌కామ్ చేతికి రియల్టీ సంస్థ
- రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రిస్క్ అసెస్‌మెంట్ సర్వీసులందజేసే రియల్టీ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను రూ. 10 కోట్లకు ప్రముఖ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్‌డాట్‌కామ్ కొనుగోలు చేసింది.
  పీవీఆర్ చేతికి డీఎల్‌ఎఫ్ డీటీ సినిమాస్
- డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీటీ సినిమాస్‌ను పీవీఆర్ రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీఎల్‌ఎఫ్ యుటిలిటిస్ సంస్థ సినిమా ఎగ్జిబిషన్ బిజినెస్‌ను డీటీ సినిమాస్ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సంస్థ  6,000 సీటింగ్ సామర్థ్యం ఉన్న 29 స్క్రీన్లతో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ 43 నగరాల్లో 467 స్క్రీన్లను నిర్వహిస్తోంది. డీటీ సినిమాస్ కొనుగోలుతో పీవీఆర్ సంస్థ 44 నగరాల్లో 506 స్క్రీన్లను నిర్వహించే స్థాయికి చేరుతుంది.

Advertisement
Advertisement