భారత్ ఫైనాన్షియల్ ‘ఇన్క్లూజన్’గా ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్
న్యూఢిల్లీ: ఎస్‌కేఎస్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ పేరు భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌గా మారింది. సోమవారం (ఈ నెల 13) నుంచి ఈ కొత్త పేరు అమల్లోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. భారత్‌లో అతి పెద్ద సూక్ష్మరుణ సంస్థల్లో ఒకటిగా భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(గతంలో ఎస్‌కేఎస్ మైక్రోఫైనాన్స్) కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. 18 రాష్ట్రాల్లో లక్షకు పైగా గ్రామాల్లో 63.65 లక్షల మహిళ సభ్యుల సూక్ష్మ రుణ అవసరాలను తీరుస్తోంది. ఈ సంస్థ రుణ రికవరీ పద్ధతులు దారుణంగా ఉండటంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడడం 2010లో సంచలనం సృష్టించింది. ఇక బీఎస్‌ఈలో సోమవారం భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ షేర్ 1.1 శాతం తగ్గి రూ.668 వద్ద ముగిసింది.