హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరికొత్త బ్యాక్‌హోలోడర్ షిన్రాయ్‌ని టాటా హిటాచీ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ఆర్‌పీఎం, ఎక్కువ శక్తి ఉన్న షిన్రాయ్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ చెప్పారు. బ్యాక్‌హోలోడర్స్ విభాగంలో కనీసం పది శాతం మార్కెట్ వాటా దక్కించుకోవాలని లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు.
ఎక్సవేటర్ రంగంలో తాము బలంగా ఉన్నామని, షిన్రాయ్‌తో బ్యాక్‌హోలోడర్స్ విభాగంలో కూడా సత్తా చాటుతామని తెలిపారు. 2011–14 కాలంలో మందగమనం కారణంగా వృద్ధి బాగా క్షీణించిందని, 2015నుంచి క్రమానుగత రికవరీ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 15– 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీఎస్‌టీ, రూపీ క్షీణత ప్రభావం ధరలపై ఉంటుందన్నారు. షిన్రాయ్ ధర రూ. 26– 28 లక్షల రేంజ్‌లో ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment