Tata Hitachi
-
20 శాతం వృద్ధి: టాటా హిటాచీ
కోల్‌కత: నిర్మాణ రంగానికి అవసరమైన యంత్రాల తయారీలో ఉన్న టాటా హిటాచీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15–20 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2021–22లో కంపెనీ రూ.4,000 కోట్ల టర్నోవర్ సాధించింది. అధిక విలువ కలిగిన మైనింగ్ యంత్రాలకు డిమాండ్ నేపథ్యంలో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం 10–12 శాతం అధికం కానుందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ తెలిపారు. ‘మౌలిక రంగం నుంచి డిమాండ్ వృద్ధి 12–15 శాతం ఉంది. మైనింగ్ విభాగం నుంచి ఇది 20–25 శాతానికి ఎగసింది. మొత్తం విక్రయాల్లో మైనింగ్ విభాగం యూనిట్ల పరంగా 8 శాతం సమకూరుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ సెగ్మెంట్ వాటా 15 శాతానికి చేరనుంది. పొరుగు దేశాలు ఆర్థిక కారణాల వల్ల దిగుమతులను తగ్గించిన తర్వాత మధ్యప్రాచ్య, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఎగుమతులు పెరగడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఎగుమతులు ప్రస్తుతం మొత్తం వ్యాపారంలో ఏడు శాతం వాటాను కలిగి ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో ఎగుమతుల వాటా 10 శాతానికి చేరాల్సి ఉంది’ అని వివరించారు. జేవీలో హిటాచీకి 60 శాతం, టాటా కంపెనీకి 40 శాతం వాటా ఉంది. కర్నాటకలోని ధార్వాడ్, పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో కంపెనీకి ప్లాంట్లు ఉన్నాయి. -
మార్కెట్లోకి టాటా హిటాచీ షిన్రాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సరికొత్త బ్యాక్హోలోడర్ షిన్రాయ్ని టాటా హిటాచీ తెలంగాణ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ ఆర్పీఎం, ఎక్కువ శక్తి ఉన్న షిన్రాయ్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మంచి ఆదరణ పొందిందని టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్ చెప్పారు. బ్యాక్హోలోడర్స్ విభాగంలో కనీసం పది శాతం మార్కెట్ వాటా దక్కించుకోవాలని లకి‡్ష్యస్తున్నట్లు తెలిపారు. ఎక్సవేటర్ రంగంలో తాము బలంగా ఉన్నామని, షిన్రాయ్తో బ్యాక్హోలోడర్స్ విభాగంలో కూడా సత్తా చాటుతామని తెలిపారు. 2011–14 కాలంలో మందగమనం కారణంగా వృద్ధి బాగా క్షీణించిందని, 2015నుంచి క్రమానుగత రికవరీ నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 15– 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జీఎస్టీ, రూపీ క్షీణత ప్రభావం ధరలపై ఉంటుందన్నారు. షిన్రాయ్ ధర రూ. 26– 28 లక్షల రేంజ్లో ఉందని చెప్పారు. -
టాటా హిటాచి నుంచి కొత్త ఎక్స్ కావేటర్ మోడల్
హైదరాబాద్: టాటా హిటాచి కంపెనీ జీఐ సిరీస్‌లో కొత్త ఎక్స్‌కావేటర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. హిటాచికి చెందిన అత్యంత ఆధునిక హైడ్రాలిక్ టెక్నాలజీతో ఈ కొత్త మోడల్, జడ్యాక్సిస్ 370 ఎల్సీహెచ్ జీఐ-సిరీస్ హైడ్రాలిక్ ఎక్స్కావేటర్ను రూపొందించామని కంపెనీ తెలిపింది. ఇంధన సామర్థ్యం 10% వరకూ మెరుగుపడేలా దీన్ని తయారు చేశామని కంపెనీ అడ్వైజర్ ఆర్.కె. కిముర పేర్కొన్నారు. భారత్‌లో పాటు అంతర్జాతీయం నిర్మాణ రంగ మార్కెట్ల అవసరాలను ఈ కొత్త మోడల్ తీరుస్తుందని కంపెనీ ఎండీ సందీప్ సింగ్ వ్యక్తం చేశారు.