రేషన్ కోసం తిప్పలు
ఈచిత్రం మడకశిర మండలం గౌడనవెళ్లి గ్రామంలోనిది. సిగ్నల్ సమస్యతో 14 నంబర్ షాపులోని ఈ-పాస్ యంత్రం వేలిముద్రలు తీసుకోకపోవడంతో మంగళవారం జనమంతా ఇలా ఊరికి కిలోమీటరు దూరం వచ్చి రేషన్ తీసుకుంటున్నారు. అక్కడ కూడా సిగ్నల్ సమస్య వస్తుండడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, దీంతో కూలి పనులు కూడా మానుకోవాల్సి వస్తోందని కార్డుదారులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు వృద్ధులు, వికలాంగులు కిలోమీటర్ల దూరం నుంచి రేషన్ సరుకులను ఇళ్లకు తీసుకువెళ్లేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. మండలంలోని దాదాపు అన్ని రేషన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొందనీ, కొందరు రేషన్ డీలర్లయితే సిగ్నల్ బాగా అందుతుందని సమీపంలోని కొండలపైకి వెళ్తుండడంతో లబ్ధిదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- మడకశిర రూరల్