నిరాశా నిస్పృహలు వేధిస్తున్నాయా? | Are you frustrated with disappointment? | Sakshi
Sakshi News home page

నిరాశా నిస్పృహలు వేధిస్తున్నాయా?

Published Sat, Aug 5 2017 11:52 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

నిరాశా నిస్పృహలు వేధిస్తున్నాయా?

నిరాశా నిస్పృహలు వేధిస్తున్నాయా?

ఉపశమనం

ఎంత కష్టపడినా ఫలితం దక్కక, అనుకున్న పనులు జరగక, ఇంట్లో అశాంతి, నిరాశా నిస్పృహలతో ఉన్న పరిస్థితులను అధిగమించడానికి కొన్ని పరిహారాలు.. ∙ప్రతి శుక్రవారం మేడిచెట్టు చుట్టూ ఇరవై ప్రదక్షిణలు చేయాలి. లక్ష్మీదేవిని తామరపూలతో అర్చించాలి. పాయసం వంటి తెల్లని తీపి పదార్థాలను నివేదించాలి ∙ఇరవై శుక్రవారాలు శివాలయంలో ఆవునేతిని, తెల్లని వస్త్రాలను, పత్తిని, పెరుగును దానం చేయాలి. నానబెట్టిన బొబ్బర్లను ఆవులకు తినిపించాలి. ఆలయం వద్ద ఉండే పేదలకు పొంగలి పెట్టాలి ∙వాన నీటిని సేకరించి, నీటితో ఉన్న ఆ పాత్రను ఇంట్లో ఈశాన్య దిశగా ఉంచాలి.

డబ్బు, ఇతర విలువైన వస్తువులను భద్రపరచుకునే బీరువాను నైరుతి దిశలో ఉంచాలి ∙ స్త్రీలతో దురుసుగా ప్రవర్తించకుండా ఉండాలి. పొరపాటుగానైనా, స్త్రీలను బాధపెడితే మనస్ఫూర్తిగా వారి క్షమాపణలు కోరండి. ∙ఏదైనా శుక్రవారం రోజున కొత్త తాళం కప్పను కొని, దిండు కింద పెట్టుకుని నిద్రించండి. మర్నాటి ఉదయం ఇంటికి దగ్గర్లోని ఆలయానికి ఆ తాళం కప్పను కానుకగా ఇవ్వండి. ∙ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు మొదట ఆవునేతి దీపాన్ని వెలిగించాలి. అనాథ బాలలకు పాలు దానంగా ఇవ్వాలి.
– పి.జగన్నాథదాసు

Advertisement
Advertisement