నెలసరి సరుకులు పెరిగాయి..! | The monthly increase in shipments. | Sakshi
Sakshi News home page

నెలసరి సరుకులు పెరిగాయి..!

Published Thu, Jun 15 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 PM

నెలసరి సరుకులు పెరిగాయి..!

నెలసరి సరుకులు పెరిగాయి..!

సర్వే

ఆ అయిదు రోజులు ఆడవారి ఆరోగ్యాన్ని శాసిస్తాయి. జాగ్రత్తల విషయంలో అలక్ష్యమూ ఉంటుంది. కానీ, ఆ అయిదు రోజులు సరైన జాగ్రత్తలు తీసుకుంటే మరో అయిదు కాలాలు ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ విషయాన్ని భారత పట్టణ స్త్రీ బాగా గమనించిందని, అందుకే వ్యక్తిగత పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రపంచ స్త్రీ వ్యక్తిగత పరిశుభ్రత మార్కెట్‌ ఒక అంచనాకు వచ్చింది. ఈ మార్కెట్‌లో ఈ యేడాది పెరిగిన వృద్ధిరేటును గమనించి రాబోయే ఐదేళ్లలో రానున్న మార్పులను
తెలియజేస్తోంది.

ప్రపంచ ఎఫ్‌.ఎమ్‌.సి.జి (ఫాస్ట్‌ మూవ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌) మార్కెట్‌ ఈ ఏడాది సర్వే చేసి ఒక నివేదికను రూపొందించింది. స్త్రీల శుభ్రతకు సంబంధించిన శానిటరీ నాప్‌కిన్, పాంటీలైనర్, టంపాన్, క్లెన్సర్లు, స్ప్రేలు, డిస్పోజబుల్‌ రేజర్స్‌... వంటి ఉత్పత్తుల అమ్మకాల వృద్ధి రేటు గడిచిన ఐదేళ్లతో పోల్చితే ఈ యేడాది (2016–2017) మనదేశంలో బాగా పెరిగింది. స్త్రీల వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తుల తయారీలో ఉన్న ప్రముఖ కంపెనీలు దీనిని ధృవపరుస్తున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల కంపెనీలూ దీంట్లో ఇన్‌వాల్వ్‌ అయ్యి స్త్రీల వ్యక్తిగత పరిశభ్రత ఉత్పత్తుల మార్కెట్‌ ఇండియాలో ఏ విధంగా ఉన్నాయో విశ్లేషించారు.

పెరుగుతున్న వృద్ధిరేటు...
మన దేశంలో ఇటీవల స్త్రీ పరిశుభ్రత ఉత్పత్తులలో వేగవంతమైన ఆధునిక అభివృద్ధి కనిపిస్తోంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. దీనికి వేగంగా పట్టణీకరణ జరుగుతుండటం, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక వృద్ధి రేటు పెరగడం, పెరిగిన అవగాహన, ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరగడం.. వృద్ధిరేటును గణనీయంగా పెంచాయి. వృద్ధిరేటు ఈ ఐదేళ్లలో (2010 –2015) 16.5 శాతం పెరిగింది. నేటి రోజులలో స్త్రీల శానిటరీ నాప్‌కిన్‌ విభాగం రెవెన్యూ విపరీతంగా పెరిగింది. వివిధ రకాలైన శానిటరీ నాప్‌కిన్స్‌ ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించడానికి వీలుగా ఉంటాయి. వీటిలో మందం, అతి పల్చని నాప్‌కిన్స్‌ ఈ రెండు రకాలనూ పట్టణ అమ్మాయిలు తేడా గమనించి కొనుగోలు చేస్తున్నారు. వీటితో పోల్చితే పాంటీలైనర్, టంపాన్ల మార్కెట్‌ తక్కువగా ఉన్నప్పటికీ గతంతో పోల్చుకుంటే వృద్ధిరేటు బాగా పెరిగింది.

మిగతా స్త్రీల వ్యక్తిగత ఉత్పత్తులలోనూ ...
ఇక మిగతా ఉత్పత్తుల విషయానికి వస్తే అంటే శరీరానికి ఉపయోగించే క్లెన్సర్లు, స్ప్రేలు, వాడిపడేసే రేజర్లకు గతంలో అత్యంత తక్కువగా ఉండే మార్కెట్‌ కూడా ఇప్పుడు ఓ గాడిన పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మన దేశంలో స్త్రీల పరిశ్రుభతకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెట్‌ 2021 నాటికి ఎలా ఉండబోతుందో కంపెనీలు ఒక అంచనాకి వచ్చాయి. కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇండియన్‌ మార్కెట్‌ మీద దృష్టి నిలిపాయి. ప్రజలు పరిశుభ్రత వైపుగా చూపుతున్న కోణాన్ని దృష్టిలో పెట్టుకొని తమ ఉత్పత్తులను ఎలా విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నాయి. చాలావరకు మహిళలు రుతుక్రమం సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల వారు అధికశాతం అనారోగ్యం పాలిట పడుతుంటారు. వీరిలో అవగాహన కల్పించడానికి తయారీదారులు సెలబ్రిటీలతో ప్రమోషనల్‌ యాక్టివిటీస్‌ పెంచడం, రకరకాల ఈవెంట్స్‌ నిర్వహించడం వంటివాటితో క్యాంపెయిన్లు చేస్తున్నారు.

దీనివల్ల కొత్త ఉత్పత్తుల వినియోగంలోనూ స్త్రీలలో అవగాహన పెరిగింది. వీటిలో పీ అండ్‌ జిహెచ్‌హెచ్, జాన్సన్‌ అండ్‌ జాన్సన్, యూనిచార్మ్‌ ఇండియా, కింబెర్లీ క్లార్క్‌... మొదలైన కంపెనీలు స్త్రీల వ్యక్తిగత పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెట్‌ని పెంచే క్రమంలో పడ్డాయి. పట్టణస్త్రీలు నమ్మదగిన బ్రాండ్లలో విష్పర్‌ ముందుండగా గ్రామీణ ప్రాంతాలలో ఇంకా ఈ ఉత్పత్తులకు అంత మార్కెట్‌ లేదు. కారణం వీటి రేటు అధికంగా ఉండటమే. ఇప్పటికీ మిలియన్ల మంది గ్రామీణ మహిళలు రుతుక్రమ సమయంలో కాటన్‌ క్లాత్‌నే ఉపయోగిస్తున్నారు.

భారతీయ స్త్రీ వ్యక్తిగత శుభ్రతలో మార్కెట్‌ పోకడలు...
రాబోయే ఐదేళ్లలో స్త్రీల వ్యక్తిగత శుభ్రతకు సంబంధించిన ఉత్పత్తుల మార్కెట్‌లో ఊహించని పెరుగుదల కనిపిస్తుంది. ∙ఈ మార్కెట్‌లో విస్తృతమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఈ మార్కెట్‌లో అవకాశాలూ పెరుగుతాయి. ∙ఇండస్ట్రీ కన్‌సల్టెంట్లు, ఉత్పత్తిదారులు, స్టాక్‌హోల్డర్స్, ప్రజెంటేటర్స్‌కి అవకాశాలు బాగుంటాయి.  ∙కంపెనీ, బ్రాండ్, ధర, ప్రాంతం.. వంటివి ఈ మార్కెట్‌ను శాసిస్తాయి.వ్యాపార రంగంలోకి వచ్చే కొత్తవారు కూడా ఈ తరహా ఉత్పత్తుల వైపు దృష్టిసారించేలా ఈ నివేదిక ఉండటం విశేషం.
– ఎన్‌.ఆర్‌

Advertisement

Photos

View all
Advertisement