
వారాంతపు వినోదం
పారే కాలువపై చిన్న పడవలో విహరిస్తూ అటు పక్కా, ఇటుపక్కా ఉన్న పడవల దగ్గరకు వెళ్లి ఆసక్తిరేపిన ఆహార పదార్థాన్ని టేస్ట్ చూస్తూ.. అలా అలా ముందుకు సాగిపోవడం! బ్యాంకాక్‌లో విహరించిన వారికి ఈ అనుభవం ఉండొచ్చు. అక్కడ ప్రతి వీకెండ్‌లోనూ ఇలాంటి ఫుడ్‌ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. షాపులూ పడవల మీదే ఉంటాయి, కొనుక్కొని తినడమూ పడవల మీద ప్రయాణిస్తూనే!