బైక్ దొంగలు అరెస్టు
► 8బైకులు స్వాధీనం
► నలుగురికి రిమాండ్
ఇబ్రహీంపట్నంరూరల్: జల్సాల కోసం బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను మంగళవారం అధిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. సీఐ గోవింద్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాగోల్‌కు చెందినబొమ్మల దిలీప్ కుమార్ బైక్‌ల చోరీలను వృత్తిగా ఎంచుకున్నాడన్నారు. ఇతను తాను చోరీ చేసిన వాహనాలను విక్రయించేందుకు చేగూరి శ్రీకాంత్, నందకుమార్‌ను ఏజెంట్లుగా పెట్టుకున్నాడన్నారు.
మంగళవారం తుర్కయంజాల్ ఎక్స్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులను అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా బైక్‌ల దొంగతనం వెలుగులోకి వచ్చిందన్నారు.దీంతో వారిని అరెస్టు చేసి, 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రధాన నిందితుడు దిలీప్‌పై గతంలో ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో జరిగిన చోరీ కేసులో జైలు వెళ్లి బెయిల్‌పై వచ్చినట్లు ఆయన వివరించారు.