స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? | risk of large time smart mobile using | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా?

Published Fri, Jul 17 2015 10:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:41 AM

risk of large time smart mobile using

లండన్: మీరు స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారా? అయితే మీరు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లేనని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. మీ మానసిక పరిస్థితిని తెలియజేసేందుకు మీ స్మార్ట్‌ఫోన్ అత్యుత్తమ పరికరమని 'నార్త్‌వెస్టర్న్ స్కూల్ ఆఫ్ మెడిసన్' అధ్యయనం చెబుతోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్న 28 మంది స్త్రీ, పురుషులపై ఈ అధ్యయనం నిర్వహించారు.

వారు సెల్‌ఫోన్‌పై ఎంతసేపు ఉంటున్నారు? ఇంటర్నెట్ వినియోగం, ఫోన్ సంభాషణలు, ఏఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు (జీపీఎస్ సాయంతో)? తదితర విషయాలను రెండు వారాలపాటు గమనించారు. రోజుకు సగటున 68 నిమిషాలపాటు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారిలో 87 శాతం మంది ఏదో ఒక మానసిక కారణంతో సతమతమవుతున్నారని గుర్తించారు. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ వినియోగించిన తీరు మానసిక సమస్యల నిర్ధారణలో కీలకపాత్ర పోషించనుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఫ్రొఫెసర్ డేవిడ్ మొహర్ తెలిపారు.

Advertisement
Advertisement