అర్థం చేసుకోరూ...! | Ee Peddollunnare Telugu movie | Sakshi
Sakshi News home page

అర్థం చేసుకోరూ...!

Published Mon, Jul 6 2015 11:25 PM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

అర్థం చేసుకోరూ...!

అర్థం చేసుకోరూ...!

 ‘మీ పెద్దోళ్లున్నారే... మా చిన్నోళ్లకేం కావాలో ఎప్పటికీ తెలుసుకోలేరు’ అని ‘నువ్వు-నేను’ చిత్రంలో హీరో ఉదయ్‌కిరణ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్సే. ఇప్పుడు ఆ డైలాగ్ స్ఫూర్తితో ‘ఈ పెద్దోళ్ళున్నారే...’ అంటూ ఒక సినిమా వస్తోంది. అరవింద్, అపూర్వా అరోరా జంటగా కోనేటి ఫిలింస్ పతాకంపై కె.హనిత నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోనేటి శ్రీను దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘‘ఈ కాలం పిల్లలను అర్థం చేసుకోవడం కష్టం అని తరతరాలుగా వినిపిస్తున్న మాట. పిల్లలు, పెద్దల మధ్య ఉన్న అంతరాలను వినోదాత్మకంగా చర్చిస్తున్న చిత్రమిది’’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ పంజాల, సంగీతం: వెంగీ.
 

Advertisement

పోల్

Advertisement