బంగారు తెలంగాణ కోసం... | Golden Telangana new movie shooting start | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కోసం...

Published Sun, Mar 8 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 10:31 PM

బంగారు తెలంగాణ కోసం...

బంగారు తెలంగాణ కోసం...

ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించి, బంగారు తెలంగాణాగా చేయడం కోసం కొంతమంది యువకులు ఏం చేశారు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘నాంది’. సింహశ్రీ మిద్దె హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘నవ తెలంగాణ’ అనేది ఉపశీర్షిక. కొండోజు ఉపేంద్రాచారి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఉమశ్రీ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది.

సింహశ్రీ మాట్లాడుతూ -‘‘రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కలిసి అభివృద్ధికి పాటుపడాలని చెప్పే చిత్రం ఇది. ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తెలంగాణ యువతకు మంచి సందేశం ఇస్తున్నాం’’ అన్నారు. మేలో షూటింగ్ పూర్తవుతుందనీ, జూన్‌లో విడుదల చేయనున్నామనీ నిర్మాత తెలిపారు. మణి, రాఘవ, సూర్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎన్. తిరు, సంగీతం: రవి కొరకాల.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement