మురికివాడలో.. మేకప్ లేకుండా షూటింగ్!
మురికివాడలో.. మేకప్ లేకుండా షూటింగ్!
Published Fri, Nov 25 2016 5:25 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
సాధారణంగా సినిమా షూటింగ్ అంటే పెద్ద పెద్ద బిల్డింగులు, వాటి మధ్యలో స్విమ్మింగ్ పూల్... ఇలాంటి అందమైన వాతావరణం కనిపిస్తుంది. కానీ, మాస్ స్టార్‌గా పేరొందిన గోపీచంద్ మాత్రం తన సినిమాల్లో సహజత్వానికి దగ్గరగా చేస్తారు. ఇంతకుముందు కూడా ఒక డంపింగ్ యార్డు వద్ద సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తించే పాత్రలో చేసిన గోపీచంద్.. తాజాగా సికింద్రాబాద్ స్లమ్స్‌లో షూటింగ్ చేస్తున్నాడు. అది కూడా అస్సలు మేకప్ వేసుకోకుండా!! హ్యాట్రిక్ హిట్లు సాధించిన సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమా రెండో షెడ్యూలు షూటింగ్ ఆ స్లమ్‌లో ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో పూర్తయింది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె పుల్లారావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూలు థాయ్‌లాండ్‌లో 32 రోజుల షూటింగ్ జరుపుకొంది.
గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో తాము నిర్మిస్తున్న సినిమా షూటింగ్ సగం పూర్తయిందని, గోపీచంద్, హన్సిక, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖరామన్, చంద్రమోహన్, సీత... ఈ షెడ్యూల్లో నటించిన వాళ్లెవ్వరూ అసలు మేకప్ వేసుకోకుండా చేశారని నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు తెలిపారు.
2014లో మిస్ దీవా బ్యూటీ పెజంట్‌లో పాల్గొన్న శ్రీ రాథే ఈ సినిమాలో గోపీచంద్ చెల్లెలిగా నటించగా, 2014 మిస్ ఇండియా కంటెస్టెంట్ నటాషా అస్సాదీ హీరో ఫ్రెండ్‌గా నటించారు. నటీనటవర్గం: గోపీచంద్, హన్సిక మొత్వానీ, క్యాథరీన్ ట్రెసా, నికితిన్ థీర్ (తంగబలి), తనికెళ్ల భరణి, ముకేష్ రిషి తదితరులు, సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, బ్యానర్: శ్రీ బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: సంపత్ నంది.
Advertisement
Advertisement