టీవీ సీరియల్ నిర్మాతపై దాడి | Telugu TV serial producer attacked in Hyderabad | Sakshi
Sakshi News home page

టీవీ సీరియల్ నిర్మాతపై దాడి

Published Mon, Jun 12 2017 8:53 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 PM

టీవీ సీరియల్ నిర్మాతపై దాడి

టీవీ సీరియల్ నిర్మాతపై దాడి

బంజారాహిల్స్‌ :
ప్రతినెల రెండవ ఆదివారం టీవీ షూటింగ్‌లకు సెలవు ప్రకటించినా ఓ టీవీ నిర్మాత మాత్రం షూటింగ్‌ నిర్వహిస్తున్నాడని ఆరోపిస్తూ లోకేషన్‌కు వెళ్లి నిర్మాతపై దాడి చేయడమే కాకుండా సెట్‌లో విధ్వంసం సృష్టించారంటూ ఎనిమిదిమంది టీవీ కార్మికులు, ఆర్టిస్ట్‌లపై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.

వివరాలిల్లోకి వెళితే...  రామ సీత అనే టీవీ సీరియల్‌ షూటింగ్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో ఆదివారం ఉదయం జరుగుతుండగా సెలవు రోజున కూడా షూటింగ్‌ చేస్తున్నారని ఆరోపిస్తూ టీవీ ఫెడరేషన్‌ నాయకులు దాడికి పాల్పడ్డారు. చక్రి అనే వ్యక్తితో పాటు రాజేందర్‌సింగ్, నాగరాజు, విజయ్‌యాదవ్, నర్సింగ్‌యాదవ్‌ తదితరులు దాడి చేశారంటూ నిర్మాత పులి వాసు, కోడైరెక్టర్‌ జయకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వీరందరిపై పోలీసులు ఐపీసీ 323, 341,327, 506 తదితర సెక్షన్స్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement