గౌరీ హత్యపై కేంద్రానికి కర్ణాటక నివేదిక | A report to the Home Ministry of Karnataka on Gowri Lakesh murder | Sakshi
Sakshi News home page

గౌరీ హత్యపై కేంద్రానికి కర్ణాటక నివేదిక

Published Sun, Sep 10 2017 3:38 AM | Last Updated on Tue, Sep 12 2017 2:22 AM

A report to the Home Ministry of Karnataka on Gowri Lakesh murder

న్యూఢిల్లీ:  ‘లంకేశ్‌ పత్రిక’ సంపాదకురాలు గౌరీ లంకేశ్‌ హత్యపై కర్ణాటక ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఓ నివేదిక సమర్పించింది. బెంగళూరు రాజరాజేశ్వరీ నగర్‌లోని ఇంట్లో ఇటీవల గుర్తుతెలియని దుండగులు గౌరిపై కాల్పులు జరిపి హతమార్చడం తెలిసిందే. దీనిపై హోం శాఖ కర్ణాటకను నివేదిక కోరింది. హత్య, ఆ తర్వాత పోలీసులు చేపట్టిన చర్యలను వివరిస్తూ కర్ణాటక ప్రధాన కార్యదర్శి నివేదికను హోం శాఖకు అందజేశారు. హత్యపై విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించారు.

Advertisement

పోల్

Advertisement