
కేంద్ర బడ్జెట్ హైలైట్స్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో శనివారం కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోని ముఖ్యాంశాలు ఇవీ..
మొత్తం బడ్జెట్ - కేటాయింపులు..
- కేంద్ర బడ్జెట్ రూ.17,77,477 కోట్లు
- ప్రణాళికా వ్యయం రూ.4,65,000
- ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లు
- రక్షణకు రూ.2,46,727 కోట్లు
- వైద్యానికి రూ. 3,31,500 కోట్లు
- విద్యా రంగానికి రూ.68,960 కోట్లు
- గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లు
- మహిళా శిషు సంక్షేమం రూ.10,500 కోట్లు
- జల వనరులకు రూ.4,173 కోట్లు
- ఏపీలో ఐఐఎం ఏర్పాటు
- సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు
- నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు
- ఎస్సీ సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు
- మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
- ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు
- అల్ట్రా మెగా పవర్కు లక్ష కోట్లు.
- ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు
- గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు
- వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం.
- మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు.
- నాబార్డుకు 25 వేల కోట్లు
- ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు
- శిషు సంరక్షణకు 300 కోట్లు
- చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు
- మౌలిక వసతులకు 70 వేల కోట్లు
- స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధి
- చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు
- స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లు.
కొత్త పథకాలు..
- ఏడాదికి 330తో ప్రమాద బీమా
- వీసా ఆన్ అరైవల్ స్కీం కింద 150 దేశాలు
- అశోక చక్ర ముద్రతో బంగారు నాణేలు
- 4 వేల మెగా వాట్ల సామర్థ్యం గల 5 మెగా పవర్ ప్లాంట్లు ఏర్పాటు.
- సీనియర్ సిటిజన్ల కోసం వెల్ఫేర్ ఫండ్.
- అటల్ పెన్షన్ యోజన కొనసాగుతుంది
- యూనిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటు ఏర్పాటుకు కృషి
- అత్యున్నత ఆదాయ వర్గాలకు గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత.
- 80 వేల స్కూళ్ల ఆధునీకీకరణ
- భారత్ను తయారీ రంగానికి హబ్గా చేస్తాం
- కేంద్రం పన్నుల్లో 62శాతం నిధులను రాష్ట్రాలకు ఇస్తాం
- జన్ధన్ యోజన ద్వారా మధ్య తరగతి పేదలకు బీమా సౌకర్యం
- గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగుతుంది.
- లక్ష రూపాయలు దాటిన ప్రతి లావాదేవీకి పాన్ నెంబర్ తప్పనిసరి
- బ్లాక్ మనీ నిరోధానికి కొత్త చట్టం
- విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వకపోతే ఏడేళ్ల జైలు శిక్ష
- డిజిటల్ ఇండియాలో భాగంగా ఐదు లక్షల గ్రామాల్లో వైఫై సౌకర్యం
- వెనుకబడిన రాష్ట్రాలతోపాటు ఏపీకి ప్రత్యేక సాయం
- ఉపాధి కల్పనకు నేషనల్ స్కిల్ మిషన్
- పన్ను ఎగవేత దారులకు జైలు శిక్ష పదేళ్లకు పెంపు
- ఉన్నత విద్యకోసం ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకం
- డిజిటల్ ఇండియాలో తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
హామీలు..
- 12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
- 6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
- ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి.
- సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది.
- ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం.
- నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ
- ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం.
- ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం
- ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం
- స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం
- 2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం
- స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
- 11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
- యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది
- లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మాస్తాం
- పన్నుల్లో రాష్ట్రాలకు 42శాతం ఇస్తున్నాం
- ఆధార్ జన్ధన్ ద్వారా లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తున్నాయి
- వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
- 2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
- త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
- 2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
- ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
- ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
- ఏపీ తెలంగాణ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తాం
- బీహార్, బెంగాల్తోపాటు ఏపీ ఆర్థిక సాయం
- గోల్డ్లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్
- హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టోంబ్స్ రక్షణకు నిధులు
పన్నుల విధింపులు..
- హెల్త్ ఇన్స్యూరెన్స్ లిమిట్ రూ.25వేలకు పెంపు
- సర్వీస్ ట్యాక్స్ 14శాతం పెంపు
- పెరగనున్న సిగరెట్ ధరలు
- ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీ.. 15 వేల నుంచి 25 వేలకు పెంపు
- సీనియర్ సిటిజన్లకు ఇది 10 వేల నుంచి 30వేలకు పెంపు
- పెన్షన్ ఫండ్కు చెల్లింపులపై రాయితీ 1 లక్ష నుంచి 1.5 లక్షలకు పెంపు
- బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తాం
- సంపద పన్ను రద్దు
- కోటి రూపాయల ఆదాయం దాటితే 2శాతం అదనపు పన్ను
- వెయ్యి రూపాయలు దాటిన పాదరక్షలపై ఆరు శాతం సుంకం
- బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్ 100 నుంచి 200 పెంపు
- సంపద పన్నుపై 2శాతం అదనపు సర్ చార్జీలు
- 2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం
- జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది
పన్నుల తగ్గింపులు.. మినహాయింపులు..
- స్వచ్ఛ భారత్కు అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపు
- తగ్గనున్న బూట్ల ధరలు.. లెదర్ గూడ్స్పై ఆరుశాతం పన్ను తగ్గింపు
- ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ కింద 1600వరకు మినహాయింపు
- 80 ఏళ్లు దాటిన వారికి 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపు
- వికలాంగులకు అదనంగా 20వేల పన్ను రాయితీ
- సాంకేతిక సేవలపై పన్ను 15శాతం తగ్గింపు
- కార్పోరేట్ పన్ను 30 నుంచి 25శాతానికి తగ్గింపు. ఈ తగ్గింపు నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది.
- దవ్యోల్బణం 6శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం
- ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.
ప్రసంగంలోని కీలకాంశాలు..
- రూపాయి మారకం విలువ బలపడుతోంది.
- ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు
- ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం
- భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది
- 340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు
- పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
- ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
- అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
- భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది
- ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం
- జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది
- కరెంట్ అకౌంట్ లోటు మూడుశాతం
- ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు
- మనీలాండరింగ్ చట్టాల్లో మార్పులు
- ఆదాయ పన్ను యధాతథం.