హల్ చల్ చేస్తున్న ఐఐటి విద్యార్థినుల వీడియో
చెన్నై: మద్రాస్ ఐఐటీ విద్యార్థులు రూపొందించిన పేరడీ అరేంజ్డ్ మ్యారేజీ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. తమ కుటుంబంలోకి కోడలుగా రావాల్సిన అమ్మాయికి ఉండాల్సిన గుణగణాలను ఏకరువు పెడుతూ,వ్యంగ్యంగా సాగే వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. 12 అంతర్జాతీయ అవార్డులతో, 2012 లో సంచలనం సృష్టించిన కార్లే రే జెప్సన్ ఆల్బం 'కిస్ ' లోని కాల్ మీ మే బీ పాటకు పేరడీగా ఐఐటి విద్యార్థినిలు కృపా వర్గీస్, అనుక్రిపా ఎలాంగో అస్మిత ఘోష్ ఈ వీడియో ను చిత్రీకరించారు. 'బీ అవర్ పొందాటి(భార్య)' మే బి కాల్ మీ అంటూ పాటలా సాగే వీడియో ఇపుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది.
2016 ఏడాదికి సాహిత్య అవార్డు లోని పేరడీ కాంటెస్ట్ విభాగం ఎంట్రీకోసం మద్రాస్ ఐఐటికీ కృపా వర్గేసీ ఈ వీడియో రూపొందించారు. సగటు భారతీయ కుటుంబాల్లో కోడలికి కావాల్సిన అర్హతలు, ఉండకూడని లక్షణాల గురించి ఏకరువు పెడుతూ సాగే ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్.... ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కుర్చీపై కూర్చున్న ఓ మహిళ తన కుమారుడికి కావాల్సిన వధువు కోసం పెద్ద చిట్టానే విప్పింది.
అంతేకాక తమ కుటుంబానికి చెందిన వివరాలను, సాంబారు, వడ తయారు చేసే నైపుణ్యం తదితరాలను ఆశువుగా వెల్లడించింది. ఏప్రిల్ 4 యూ ట్యూబ్ లో పోస్ట్ అయిన ఈ వీడియో ఫీవర్ అనంతరం సోషల్ మీడియాకు పాకింది. ఇప్పటికే రెండులక్షలకు పైగా లైక్ లను కామెంట్లను సొంతం చేసుకుంది. ఆ వీడియో మీకోసం...