వందేళ్లకు పైగా బతకాలంటే.. | People ask me remedies for increasing life span. I say that I eat less, talk less & sleep less:Naseem Changezi | Sakshi
Sakshi News home page

వందేళ్లకు పైగా బతకాలంటే..

Published Tue, May 31 2016 3:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM

People ask me remedies for increasing life span. I say that I eat less, talk less & sleep less:Naseem Changezi

న్యూఢిల్లీ:  ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భగత్ సింగ్  అనుచరుడు నసీమ్  మీర్జా చంగేజి  (106) తన నూరేళ్ల జీవన  ప్రస్థానానికి  సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో ఆరోగ్యంగా  వందేళ్లు జీవించాలంటే అన్ని విషయాల్లోనూ మితంగా ఉండటమే మేలని సూచించారు. తన ఆరోగ్య రహస్యం చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారనీ...దీనికి ఏ డాక్టర్ దగ్గర పరిష్కారం లేదని తేల్చి చెప్పారు. తక్కువ తినాలి..తక్కువ మాట్లాడాలి.. తక్కువ నిద్రపోవాలని, అదే తన ఆరోగ్య రహస్యమని నసీమ్  స్పష్టం చేశారు.   లైఫ్ స్పాన్  ను పొడిగించే మందులేవీ వైద్యుల దగ్గర లేదన్నారు. తాను హాకీ చాంపియన్ అనీ, రోజూ సాయంత్రం హాకీ సాధన చేస్తానని తెలిపారు.  హాకీ లెజెండ్  ధ్యాన్ చంద్ తో హాకీ  ఆడేవాడినని గుర్తు చేసుకున్నారు.

 షహీద్ భగత్ సింగ్  స్వేచ్ఛా  భారతాన్ని చూడాలనుకుంటున్నారు. అందుకే  పార్లమెంట్ లో బాంబులు  విసిరారు. బ్రిటిష్  ప్రభుత్వం   భగత్  ను  ఉరి తీస్తుంది,  లేదా  జీవిత ఖైదు  చేస్తుందని హెచ్చరించినా  భగత్  వినలేదనీ నసీమ్ మీడియాకు తెలిపారు. తాను కూడా స్వాతంత్య్ర సమరయోధుడనే.. కానీ  చావాలనుకోలేదు.. భారతదేశం  స్వాతంత్ర్యం  చూడాలనుకున్నానని తెలిపారు. కానీ  స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, భగత్ సింగ్ కలలు కన్న  స్వేచ్చ సమాజంలో రాలేదని  నిరాశ వ్యక్తం చేశారు.  అన్ని మతాలు, కులాలు  సామరస్యం, శాంతితో జీవించాలని భగత్ సింగ్ కోరుకున్నారన్నారు.  భగత్ సింగ్ కు  ఆశ్రయం ఇచ్చినట్టు తెలిసి ఉంటే  బ్రిటీష్ ప్రభుత్వం తనను  కూడా  ఉరి తీసేదన్నారాయన.

అలాగే సుభాష్ చంద్ర బోస్ పంజాబ్ వెళ్లి బాంబులు  ఎలా తయారు చేయాలో యువత బోధించాడని , ఆ తరువాత  జపాన్ వెళ్లి,   భారత జాతీయ కాంగ్రెస్ మూలాలను ఏర్పాటు చేశాడనీ,  ఓడ ప్రమాదంలో  మరణించాడని తెలిపారు.   కాగా షహీద్ దివాస్ ఉత్సవం (అమరుల డే) సందర్భంగా మార్చి 23 న ఢిల్లీ   అసెంబ్లీ ఆవరణలో అమరవీరుల భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల విగ్రహాలకు ఆవిష్కరణ సందర్భంగా నసీమ్  ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  సత్కరించారు.    


 

Advertisement
Advertisement