సాక్షి, అమరావతి : సమగ్రంగా.. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే మేనిఫెస్టో రావడం హర్షదాయకం అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రాధాన్యత ఇవ్వడం.. ఆయా సామాజిక వర్గాల శాశ్వత అభివృద్ధికి తోడ్పడేలా మేనిఫెస్టో రూపొందడం నిజంగా చాలా మంచి పరిణామమన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఏ ఒక్కరిని వదల లేదని.. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుందని ఆమె స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ముఖ్యంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేసి సామాన్యులకు భరోసా కల్పించిందని పేర్కొన్నారు.
వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఏపీలోని ప్రతి ఒక్కరు జగన్ ఆధ్వర్యంలో సౌకర్యంగా.. సంతోషంగా.. ధైర్యంగా బతకొచ్చు అనే ధీమా కల్పించిందన్నారు. జనాభాలో 90 శాతం ఉన్న మధ్యతరగతి ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కార్డ్ ఇస్తాననడం పట్ల సామాన్యులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నోటిఫికేషన్లు లేవు.. ఉద్యోగాలు లేవని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తి చేయడమే కాక ప్రతి ఏడాది జనవరి 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను రిలీజ్ చేస్తానని చెప్పడంతో నిరుద్యోగులకు ఒక భరోసా ఇచ్చినట్లయిందని తెలిపారు.
గ్రామ సచివాలయం తీసుకోస్తాననడం వల్ల మహాత్మ గాంధీ కలలు కన్నా భారతం సాకరమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జన్మభూమి కమిటీల్లాగా వీటిలో లంచాలు మింగడం ఉండబోదని స్పష్టం చేశారు. చేతివృత్తులకు కార్పొరేషన్‌లు ఉండటం వల్ల గ్రామాలకు జీవ కళ వస్తుందని... పల్లెల నుంచి వలస వెళ్లిన వారు తిరిగి సొంత ప్రాంతానికి వస్తారని తెలిపారు. మేనిఫెస్టో వైఎస్సార్‌సీపీ నాయకులకు శిరోధార్యమని.. దీన్ని తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం కోసం రాజేశేఖర్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. జగన్ 4 అడుగులు ముందుకు వేశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment