సాయికార్తీక్‌కు టైటిల్ | sai kartik gets under 18 tennis title | Sakshi
Sakshi News home page

సాయికార్తీక్‌కు టైటిల్

Published Tue, Nov 8 2016 10:50 AM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

sai kartik gets under 18 tennis title

సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సిరీస్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ కుర్రాడు సాయి కార్తీక్ రెడ్డి టైటిల్‌ను కై వసం చేసుకున్నాడు. భారతీయ విద్యా భవన్ స్కూల్‌కు చెందిన కార్తీక్ ఫైనల్ మ్యాచ్‌లో 7-6, 6-4తో కిరణ్ దేవ (తమిళనాడు)పై విజయం సాధించాడు. ఇటీవలే భవన్‌‌స జూనియర్ కాలేజ్‌లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ అండర్ -19 టోర్నీలో కార్తీక్ పసిడి పతకాన్ని... ఇండస్ స్కూల్‌లో జరిగిన సౌత్‌జోన్ సీబీఎస్‌ఈ టెన్నిస్ టోర్నమెంట్‌లో రజత పతకాన్ని సాధించాడు.

Advertisement
Advertisement