రిక్షా తొక్కేద్దాం.! | College students Rickshaw clean india green india | Sakshi
Sakshi News home page

రిక్షా తొక్కేద్దాం.!

Published Mon, Feb 9 2015 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

రిక్షా తొక్కేద్దాం.!

రిక్షా తొక్కేద్దాం.!

 సాక్షి, చెన్నై : మెరీనా తీరంలో ఆదివారం ఉదయాన్నే పలు కళాశాలల విద్యార్థులు కనువిందు చేశారు. నాటి రిక్షా పయనాన్ని గుర్తుకు తెస్తూ, ‘రిమ్..జిమ్...రిమ్...జిమ్ మద్రాసు...రిక్షా పయనంతో సాగిద్దాం.. క్లీన్ ఇండియా.. గ్రీన్ ఇండియూ’ అని నినదిస్తూ ముందుకు సాగారు. రోటరీ క్లీన్ ఇండియూ-గ్రీన్ ఇండియూ పిలుపుతో చేపట్టిన రిక్షా, సైకిల్ ర్యాలీతో పాటుగా వాక్‌థాన్‌కు విశేష స్పందన వచ్చింది. నగరంలోని పలు కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉదయాన్నే కన్నగి విగ్రహం వద్దకు చేరుకున్నారు. నగరంలోని సెంట్రల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో నేటికీ రిక్షా లాగుతూ జీవనం సాగిస్తున్న వారిని కలుపుకుని ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించా రు.
 
 సుమారు 50 వరకు రిక్షాలను తెప్పించారు. వాటిని విద్యార్థులు స్వ యంగా తొక్కుతూ ముందుకు కదిలా రు. తొలుత రిక్షా తొక్కేందుకు కొంద రు ఇబ్బంది పడ్డా, రిక్షావాలా సాయం తో రిమ్ జిమ్...రిమ్ జిమ్...అన్న పాటను గుర్తుకు తెచ్చుకునే రీతిలో రయ్‌మంటూ ముందుకు సాగారు. కొందరు విద్యార్థినులు తమ అనుభవాన్ని కెమెరాల్లో పంచుకుంటూ ఆనందాన్ని గడిపారు. అలాగే, సుమారు వంద మంది వరకు సైకిళ్లు తొక్కుతూ ఈ ర్యాలీలో కదిలారు. వందకు పైగా వాకర్లు తమ నడకతో ర్యాలీలో సాగారు. కన్నగి విగ్రహం నుంచి వివేకానంద ఇల్లం వరకు సాగిన క్లీన్ ఇండియూ-గ్రీన్ ఇండి యూ ర్యాలీ ఉదయాన్నే మెరీనా తీరం గుండా వెళ్లే వాళ్లకు ఓ కనువిందే. ముందుగా ఈ ర్యాలీని నిర్వాహకులు జాన్ ఎఫ్ జర్మ్, ఐఎస్‌ఏకె నాజర్, జోసెఫ్ రాజ జెండా ఊపి ఆరంభించారు.  
 

Advertisement

పోల్

Advertisement