ఎమ్మెల్యే వాహనంపై చెప్పుల దాడి
ఎమ్మెల్యే వాహనంపై చెప్పుల దాడి
Published Tue, Dec 6 2016 3:43 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
స్టేషన్‌ఘన్‌పూర్ : అంబేద్కర్ 60 వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలవేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వాహనంపై మహిళలు చెప్పులు విసిరారు. ఈ సంఘటన జనగామ జిల్లా జాఫర్‌ఘడ్‌లో మంగళవారం జరిగింది. జాఫర్‌ఘడ్, స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్ మండలాలను జనగామ జిల్లాలో కలపడానికి అనుకూలంగా ఎమ్మెల్యే లేఖ ఇచ్చారని, జనగామ జిల్లాలో కలపడానికి ఇష్టపడని ఇక్కడ ప్రజలు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వాహనంపై మహిళలు ఒక్కసారిగా దాడిచేశారు. ఆగ్రహించిన మహిళలు వాహనంపైకి చెప్పులు విసిరారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Advertisement
Advertisement