రంగారెడ్డి(పెద్దేముల్): రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో కోటపల్లి ప్రాజెక్టుల్లో ఓ అడుగు నీరు చేరిందని పెద్దేముల్ మండల కోటపల్లి ప్రాజెక్టు ఏఇ నికేష్ తెలిపారు. 24అడుగుల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుల్లో ప్రస్తుతం 6అడుగులు ఉండగ, బుధవారం కురిసన వర్షంకు ఓ అడుగు నీరు చేరటంతో మెత్తం 7 అడుగులకు చేరిందని ఇరిగేషన్ ఏఇ తెలిపారు.