
స్టెతస్కోప్ బదులుగా..
వాషింగ్టన్: వందల సంవత్సరాలుగా వినియోగిస్తున్న సెతస్కోప్‌కు ఇక కాలం చెల్లిపోనుంది. దీని స్థానంలో కొత్త పరికరం అందుబాటులోకి రానుంది. దీని కోసం ‘హార్ట్‌బర్ట్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు యూఎస్‌లోని ఓర్లాండో హెల్త్‌లో కార్డియాలజీ చీఫ్ డేవిడ్ బెల్లో. సెతస్కోప్‌లో ఉన్నట్లు చెవులకు పెట్టుకునే పరికరంతో పాటు యాప్ కూడా ఉంటుంది. ఈ పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి.. ‘హార్ట్‌బర్డ్స్’ అనే యాప్‌ను యాక్టివేట్ చేస్తే చాలు... హార్ట్‌బీట్ తెలుసుకోవచ్చు అంటున్నారు బెల్లో. హార్ట్ బీట్స్‌తో పాటు ఫోన్ స్క్రీన్‌పైనా గుండె కొట్టుకుంటున్న విధంగా తరంగాలు కూడా కనిపిస్తాయట.