Stetoskop
-
స్టెతస్కోప్ బదులుగా..
వాషింగ్టన్: వందల సంవత్సరాలుగా వినియోగిస్తున్న సెతస్కోప్కు ఇక కాలం చెల్లిపోనుంది. దీని స్థానంలో కొత్త పరికరం అందుబాటులోకి రానుంది. దీని కోసం ‘హార్ట్బర్ట్స్’ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు యూఎస్‌లోని ఓర్లాండో హెల్త్‌లో కార్డియాలజీ చీఫ్ డేవిడ్ బెల్లో. సెతస్కోప్లో ఉన్నట్లు చెవులకు పెట్టుకునే పరికరంతో పాటు యాప్ కూడా ఉంటుంది. ఈ పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి.. ‘హార్ట్బర్డ్స్’ అనే యాప్‌ను యాక్టివేట్ చేస్తే చాలు... హార్ట్‌బీట్ తెలుసుకోవచ్చు అంటున్నారు బెల్లో. హార్ట్ బీట్స్‌తో పాటు ఫోన్ స్క్రీన్‌పైనా గుండె కొట్టుకుంటున్న విధంగా తరంగాలు కూడా కనిపిస్తాయట. -
రోగులకు ‘సంగీత చికిత్స’
కొచ్చి: మెళ్లో స్టెతస్కోపుతో వైద్యం చేయాల్సిన డాక్టర్లంతా తమ గానమాధుర్యంతో రోగులకు చికిత్స చేశారు. ఈ సంఘటన బుధవారం కొచ్చిలోని జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. నగరంలోని డాక్టర్ల బృందమంతా కలసి పాతపాటలు పాడుతూ రోగులకు వైద్యం చేశారు. కళలు, సంగీతం నాణ్యమైన జీవనాన్ని పెంపొందిస్తుందని తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ సంగీత చికిత్సను ప్రారంభించారు. కేరళకు చెందిన ‘కొచ్చి బియోన్నల్ ఫౌండేషన్ (కేబీఎఫ్) ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఈ ప్రాజెక్టు చేపట్టింది.