జెరూసలెం: కృష్ణ బిలాల ప్రభావం నుంచి కొన్ని కణాలు తప్పించుకొని బయటికి పోతాయన్న ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అంచనా నిజమని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్త జఫ్ స్టెయిన్‌హ్యూర్ ప్రయోగశాలలో కత్రిమ కష్ణబిలాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. 1974లో హాకింగ్ కొన్ని కణాలు కష్ణబిలం ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వాటినే ప్రస్తుతం హాకింగ్ రేడియేషన్ అని పిలుస్తున్నారు. హ్యూర్ ప్రయోగం ప్రకారం ఒక కణం, దాని విరుద్ధ పదార్థాన్ని కష్ణబిలం అంచువద్ద గమనించగా ఒక జత కణాలను కష్ణబిలం శోషించుకుంది. మరికొన్ని కణాలు కష్ణబిలం నుంచి కొంత శక్తిని గ్రహించి వెలుపలకి చేరుకున్నాయి. కష్ణబిలాలు నెమ్మదిగా విస్తరించడానికి, కొన్ని సార్లు అదశ్యం కావడానికి ఇదే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.