
నిఖిల్ వాగ్లె
న్యూఢిల్లీ: బెదిరింపులకు భయపడనని ప్రముఖ మరాఠి జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లె స్పష్టం చేశారు. సామాజిక ఉద్యమకారుడు, సీపీఐ నేత గోవింద్ పన్సారే హత్య కేసులో నిందితుడు సమీర్ గైక్వాడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని వచ్చిన వార్తలపై ఆయన ఈవిధంగా స్పందించారు. చాలా కాలంగా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. తనకు రక్షణ కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా వద్దన్నానని తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవింద్ పన్సారే హత్యకు గురైయ్యారు. ఈ కేసులో సనాతన సంస్థ సభ్యుడు సమీర్ గైక్వాడ్ ను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. గైక్వాడ్ తర్వాతి టార్గెట్ నిఖిల్ వాగ్లె అని పోలీసులు కనుగొన్నారు. పన్సారేను హత్య చేసిన తర్వాత వాగ్లెను అంతం చేయాలని ప్లాన్ వేశాడని, అతడి ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.