'జడలు వేసుకోవడం మానేశారు'
పణజి: హిందువుల పిల్లలను కాన్వెంట్ స్కూళ్లకు పంపొద్దంటూ తన భార్య చేసిన వ్యాఖ్యలను గోవా మంత్రి దీపక్ ధవలికర్ సమర్థించారు. ఆమె వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. తమ మతం గురించి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని అన్నారు. భారతీయ మహిళలు పాశ్చాత్య పోకడలు పోవడం వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని ధవలికర్ సతీమణి లత వ్యాఖ్యానించారు.
భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని ధవలికర్ ఆందోళన వ్యక్తం చేశారు. 'పూర్వం మహిళలు కుంకుమ పెట్టుకునేవారు. సంప్రదాయ చీరలు ధరించేవారు. జుత్తును చక్కగా దువ్వుకుని జడలు వేసుకునేవారు. ఇది భారతీయ స్త్రీత్వము. రానురాను ఈ సంప్రదాయం కనుమరుగవుతోంది' అని ధవలికర్ అన్నారు. పిల్లలను హిందూ మతం గురించే బోధించే పాఠశాలలకే పంపాలని ఆయన సలహాయిచ్చారు.