హిజ్బుల్ టెర్రరిస్ట్ అరెస్ట్
శ్రీనగర్ : హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్ట్ ఆదిల్ అహ్మద్ భట్‌ను బుధవారం జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి ఆయుధాలు, బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలపై కాల్పులు సహా అనేక బాంబు పేలుళ్లలో భట్ నిందితుడు.
ఇదిలాఉండగా.. భద్రతా బలగాలు బుధవారం లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అమర్నాథ్ యాత్ర దాడిలో ఇస్మాయిల్ ప్రధాన నిందితుడు.