Adith
-
కొత్త కథలైతే విజయం ఖాయం
‘‘తాగితే తందానా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రనిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. కొత్త కాన్సెప్టులతో వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదిత్, మధు, సప్తగిరి లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆదిత్, సప్తగిరి, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘తాగితే తందానా’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై వి.మహేష్, వినోద్ జంగపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి లుక్‌ని మారుతి, బ్యానర్ లోగోని నిర్మాత దామోదరప్రసాద్ విడుదల చేశారు. దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లు సరైన ప్లానింగ్‌తో వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి చేయడంలో సక్సెస్ అయినట్టు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను’’ అన్నారు ఆదిత్. ‘‘కమెడియన్‌గా మంచి చిత్రాలు వస్తే చేద్దామనుకుంటున్న తరుణంలో శ్రీనాథ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా’’ అన్నారు సప్తగిరి. ‘‘ముగ్గురు కుర్రాళ్లు తాగిన మత్తులో ఒక సమస్యలో ఇరుక్కుంటారు.. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారనేది చిత్రకథ’’ అన్నారు శ్రీనాథ్ బాదినేని. ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు వినోద్ జంగపల్లి. చిత్రనిర్మాత వి.మహేష్, లైన్ ప్రొడ్యూసర్ అనిల్, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ బి.నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
ఇలాంటి సినిమా అవసరమా అన్నారు..
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంతోశ్ పి జయకుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం 2 రోజుల్లోనే దాదాపు 2.5 కోట్ల రూపాయలను రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడిగా హ్యాపీగా ఉంది. సపోర్ట్ చేసిన యూనిట్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి సమాధానం చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. బి, సిలలో ఆడే సినిమా ఇది అన్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి థ్యాంక్స్. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్ షాట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు. హీరోయిన్ నిక్కి తంబోలి చిత్రవిజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మా సినిమా యూత్‌కు మాత్రమే
ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ– ‘‘17రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశాం. ఇందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మా సినిమా ట్రైలర్, వీడియోస్‌కు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఆదిత్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ లేవు. రికార్డులు, రివార్డ్స్ లాంటివి కూడా లేవు. ఎవరూ చేయలేని స్క్రిప్ట్ చేయాలని అనుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాదు.. యూత్‌కి మాత్రమే’’ అన్నారు. ‘‘ఇది ప్యూర్ అడల్ట్ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్లొద్దు. ఆ విషయాన్ని ట్రైలర్లో కూడా చెప్పాం. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నటుడు ‘సత్యం’ రాజేష్. ‘‘ఈ చిత్రంలో నేను కొత్తగా ఉండే పాత్ర చేశా. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. ఆ పాత్రకు నాపేరు సూచించిన ‘సత్యం’ రాజేష్ అన్నకు థ్యాంక్స్. ’’ అని ‘తాగుబోతు’ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కీ తంబోలి పాల్గొన్నారు. -
తుంగభద్ర మూవీ స్టిల్స్