Advanced Services
-
క్యాన్సర్ రోగులకు అధునాతన సేవలు
సాక్షి, అమరావతి: క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు రాష్ట్రం లోనే అధునాతన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా గుంటూరులో అధునాతన హాస్పైస్, పాలియేటివ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి (జీజీ హెచ్‌కి) అనుబంధంగా గుంటూరులోని బొంగరాలబీడులో అధునాతన హాస్పైస్ పాలియేటివ్ కేర్ సెంటర్ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వచ్చే వరకు గుంటూరు జీజీహెచ్‌లో తాత్కాలిక కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక కేర్ సెం టర్లో ఇరవై నాలుగ్గంటలూ వైద్యుడు, ఆరుగురు నర్సులు, న్యూట్రిషియన్, సిబ్బంది రోగులకు సేవలందిస్తారు. పాలియేటివ్ కేర్‌పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఏమిటీ హాస్పైస్, పాలియేటివ్ కేర్ క్యాన్సర్‌తో బాధపడుతూ కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు చేయించుకొనే రోగుల్లో తీవ్రమైన నొప్పి, బాధ ఉంటుంది. రేడియేషన్, కీమోథెరపీ పూర్తయి వ్యాధి నయం అవ్వక అడ్వాన్స్డ్ స్టేజ్‌తో ఉన్న వారికి జీవితం నరకప్రాయమే అవుతుంది. ఆస్పత్రిలో ఉన్నా జబ్బు నయం కాదు. ఇంటి దగ్గర నొప్పి, బాధకు ఉపశమనం లభించదు. ఇటువంటి రోగులకు శారీరక, మానసిక సాంత్వన చేకూర్చడమే హాస్పైస్, పాలియేటివ్ కేర్ ఉద్దేశం. చినకాకానిలో అకడమిక్ రీసెర్చ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో చినకాకానిలో నడుస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిలో ప్రివెంటివ్ అంకాలజీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలాఖరుకు అందుబాటులోకి రాష్ట్రంలో క్యాన్సర్‌కు అధునాతన వైద్యం అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఈ నెలాఖరు కు గుంటూరులో హాస్పైస్, పాలియేటివ్ కేర్ సెంట ర్, చినకాకానిలో ప్రివెంటివ్ అంకాలజీ, అకడమిక్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించబోతున్నాం. – నవీన్ కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
‘సర్కారీ’ వైద్యం విస్తృతం
జనరల్ ఆస్పత్రిలో వైద్య సేవలు మరింత మెరుగు పడనున్నాయి. రోగులకు ఆన్లైన్ వసతులు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే అన్ని విభాగాల వైద్యసేవలు ఆన్లైన్లో కొనసాగనున్నాయి. వార్డుల్లోనే రక్త పరీక్షలు, ఎక్స్‌రేలు తీస్తారు. నిజామాబాద్‌అర్బన్: రాష్ట్రంలోనే ఈ–ఆస్పత్రి విధానం లో సేవలందిస్తున్న ఏకైక దవాఖానా మన జిల్లా ఆస్పత్రే. గతేడాది నుంచి ‘ఈ– విధానం’ అందుబాటులోకి రాగా, ఈ సేవలను మరింత విస్తరించనున్నారు. మొన్నటివరకు రోగులు కేవలం గ్రౌండ్ ఫ్లోర్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. రిజిస్ట్రేషన్ ఒకచోట, వైద్య సేవలు మరో చోట అందిస్తుండ గా, ప్రస్తుతం ఆ పద్ధతి మార నుంది. ఇప్పు డు అన్ని విభాగాల్లో రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కలగనుంది. ప్రతి విభాగంలో .. ఏడంతస్తుల ఆస్పత్రిలో ఒక్కో అంతస్తులో ఒక్కో విభా గంలో సేవలందిస్తున్నారు. మొదటి అంతస్తులో గైనిక్, కంటి విభాగాలు, రెండో అంతస్తులో జనరల్ మెడిసిన్, చిన్న పిల్లల వార్డు, మానసిక వైద్య నిపుణులు, టీకాల విభాగం, మూడో ఫ్లోర్లో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, నాలుగో ఫ్లోర్ లో టీబీ, ఆయుర్వేదిక్, నాచురోపతి, ఐదో అంతస్తులో ఏఆర్టీ సెంటర్, ఆరో ఫ్లోర్లో చెవి, దంత వైద్య విభాగాలు, ఏడో ఫ్లోర్లో బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబ్ ఉన్నాయి. అయితే, ఆయా విభాగాలన్నింటికీ గతంలో ఒక్కచోటే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండేది. త్వరలోనే అన్ని విభాగాల వద్ద రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు కానున్నాయి. రోగి నేరుగా తమకు కావాల్సిన విభాగానికి వచ్చి పేర్లు నమోదు చేసుకుంటే, ఆ వెంటనే వైద్యసేవలు అందిస్తారు. అంతా ఆన్లైన్లోనే.. రోగి సంబంధిత విభాగంలో పేరు నమోదు నుంచి చికిత్సల వరకు మొ త్తం వివరాలన్నీ ఆన్లైన్లో నమోదవు తాయి. ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి అతనికి అందించిన వైద్య సేవలు, వివిధ పరీక్షల వివరాలు వెంటవెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. పేషెంట్‌కు కేటాయించే నెంబర్ ఆధా రంగా ఆస్పత్రిలో ఎక్కడి నుంచైనా ఆయా వివరాలు తెలుసుకోవచ్చు. గతంలో మాదిరిగా రక్త పరీక్షలకు, ఎక్స్‌రేకు ఆయా విభాగాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీని కోసం ఆస్పత్రిలో లోకల్ ఏరియా నెట్వర్క్ (లాన్)ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ఆస్పత్రిలో ఆయా విభాగాలు ఎక్కడ ఉన్నాయో రోగికి తెలిసేలా ప్రవేశ మార్గంలోనే సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, గ్రౌండ్ ఫ్లోర్లో ఇన్ఫర్మేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో నలుగురు సిబ్బంది రోగులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తారు. త్వరలో అందుబాటులోకి.. త్వరలోనే అన్ని విభాగాల్లో పేర్ల నమోదు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా సత్వర వైద్య సేవలు అందుతాయి. రోగులకు అందించే అన్ని వైద్యసేవలను ఆన్లైన్లో పొందుపరుస్తాం. రోగులకు మరింత చేరువచేస్తాం. – డాక్టర్ బన్సీలాల్, ఈ–ఆస్పత్రి ఇన్చార్జి రోగులకు ఇబ్బందులు లేకుండా.... ఆస్పత్రిలో వైద్యసేవలు మెరుగుపరుస్తున్నాం. అన్ని విభాగాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వైద్య సేవలు ఆన్లైన్లో పొందుపరుస్తున్నాం. – రాములు, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
మరో రెండు వారాల్లో...
శరవేగంగా రైలు ప్రయాణం అందుబాటులోకి ఆధునిక సేవలు నగర వాసి కోర్కెలు నెరవేరే రోజులు చేరువయ్యాయి. గంటల తరబడి రహదారులపై పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా పోతోంది. నమ్మ మెట్రో పేరిట ఆధునిక నగర ప్రయాణ సేవలు అందుబాటులోకి రానుంది. బెంగళూరు: నగరంలోని తూర్పు-పశ్చిమ (ఈస్ట్-వెస్ట్) కారిడార్లను కలుపుతూ నిర్మించిన మెట్రో మరో రెండు వారాల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ వెల్లడించారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును ముఖ్యఅతిథిగా ఆహ్వానిస్తున్నామని అదే విధంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని గరిష్టంగా రెండు వారాల్లోపు ఈస్ట్-వెస్ట్ మెట్రో రైలును ప్రారంభిస్తామన్నారు. దీని వల్ల బయ్యపనహళ్లి నుంచి మైసూరు రోడ్డు వరకూ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మెట్రోలో ప్రయాణం చేవచ్చునని తెలిపారు. నగరంలో బసవేశ్వర సర్కిల్ నుంచి హెబ్బాళ వరకూ రూ.1,200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయని కే.జే జార్జ్ ఆశాభావం వ్యక్తం చేశారు.