భోగాపురంలో ఉద్రిక్తత
భోగాపురం (విజయనగరం) : ఎయిర్పోర్టు గ్రామాలను సందర్శించడానికి వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మించనున్న ఎయిర్పోర్టును స్థానికులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సోమవారం ఆ గ్రామాలను సందర్శించేందుకు వెళ్లిన సీపీఎం నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.