ఎస్ఎంఈ చాంబర్స్ సలహాదారుగా అజయ్‌కుమార్ అగర్వాల్
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఎస్ఎంఈ చాంబర్స్‌కు సలహాదారుగా ఐ పాపర్స్ కన్సల్టింగ్ సంస్థ డెరైక్టర్ అజయ్ కుమార్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు ఉంటారని ఐ పాపర్స్ కన్సల్టింగ్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ముంబై కేంద్రంగా 45 వేల ఎస్ఎంఈ సంస్థలు సభ్యులుగా 22 ఏళ్ల నుంచి ఎస్ఎంఈ చాంబర్స్ కార్యకలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు(ఎస్ఎంఈ)ను పటిష్టం చేయడం, మంచి వ్యాపార భాగస్వామ్యాల ఏర్పాటు ద్వారా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎస్ఎంఈ చాంబర్స్ తగిన ప్రయత్నాలు చేస్తోందని వివరించింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గతంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌గా వ్యవహరించిన అజయ్ కుమార్ అగర్వాల్... ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డ్‌ను, యూనిటీ తదితర అవార్డులను గెల్చుకున్నారని తెలిపింది.