alam palli
-
భార్యను చంపిన భర్తకు యావజ్జీవ శిక్ష
ఆలంపల్లి: భార్యను చంపిన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ జిల్లా అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. ఎస్పీ రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం పులుమామిడికి చెందిన మొత్కుపల్లి అంజయ్య, మల్లమ్మ దంపతులు. అనుమానంతో అంజయ్య తరచూ భార్యను వేధిస్తుండేవాడు. ఈక్రమంలో 2011 మే 20 ఆయన భార్యకు ఉరి వేసి చంపేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అప్పట్లో సీఐ రామకృష్ణ కేసును దర్యాప్తు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. శుక్రవారం కేసు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా అదనపు జడ్జి ఉదయగౌరి పైవిధంగా తీర్పు చెప్పారు. -
భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష
ఆలంపల్లి: భర్తను హత్య చేసిన కేసులో భార్యకు యావజ్జీవ శిక్ష విధించినట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు. గత సంవత్సరం (2012) అక్టోబర్లో బషిరాబాద్ మండల పరిధిలోని గొట్టిగకుర్ధులో మైలారం నాగమ్మ భర్త మైలారం చిన్నమల్కప్పను హత్య చేసింది. శవాన్ని దాచిపెట్టిన సంఘటనలో అప్పటి బషిరాబాద్ ఎస్ఐ రఘునాథ్ కేసు నమోదు చేశారు. కోర్టులో కేసుకు సంబంధించి అభియోగ పత్రాలు సమర్పించడంతో పీపీ శుక్లవరధన్రెడ్డి వాదించారు. నేరం రుజువు కావడంతో పూర్వపరాలు పరిశీలన అనంతరం జిల్లా అదనపు న్యాయమూర్తి ఉదయగౌరి నాగమ్మకు శిక్ష ఖరారు చేశారు. . ఆమెకు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 15వేలు జరిమానా విధించారని ఎస్పీ తెలిపారు.